జోసెఫిన్ చాప్లిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోసెఫిన్ చాప్లిన్
1971లో జోసెఫిన్ చాప్లిన్
జననం
జోసెఫిన్ హన్నా చాప్లిన్

(1949-03-28)1949 మార్చి 28
శాంటా మోనికా, కాలిఫోర్నియా, అమెరికా
మరణం2023 జూలై 22(2023-07-22) (వయసు 74)
పారిస్, ఫ్రాన్స్
వృత్తినటి
జీవిత భాగస్వామినికోలస్ సిస్టోవారిస్
(m. 1969; div. 1977)
జీన్-క్లాడ్ గార్డిన్
(m. 1989; మ. 2013)
భాగస్వామిమారిస్ రోనెట్
(1977–1983; మరణించే వరకు)
పిల్లలు3
తల్లిదండ్రులుచార్లీ చాప్లిన్
ఊనా ఓ'నీల్

జోసెఫిన్ హన్నా చాప్లిన్ (1949 మార్చి 28 - 2023 జూలై 13) అమెరికన్ నటి, చిత్రనిర్మాత. ఆమె చార్లీ చాప్లిన్, అతని నాల్గవ భార్య ఊనా ఓ'నీల్ కుమార్తె.[1]

1952లో తన తండ్రి సినిమా లైమ్‌లైట్ తో బాలనటిగా అరంగేట్రం చేసింది.[2] 1972లో పీర్ పాలో పసోలిని దర్శకత్వంలో వచ్చిన ది కాంటర్బరీ టేల్స్ చిత్రంలో ఆమె తన నటనకుగాను ప్రసిద్ధిచెందింది.[3][4] ఆమె హాలీవుడ్ దిగ్గజ నటులతో పలు చిత్రాలే కాక వివిధ టెలీవిజన్ ధారావాహికలలోనూ నటించింది.

బాల్యం[మార్చు]

1949 మార్చి 28న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో ఆమె జన్మించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమెకు ఫ్రెంచ్ నటుడు మారిస్ రోనెట్ ద్వారా జూలియన్ రోనెట్ అనే కుమారుడు ఉన్నాడు.[5] ఆమె 1983లో అతని మరణం వరకు ఆయనతోనే కలసి జీవించింది.[6]

ఆమె గ్రీకు ఫ్యూరియర్ నికోలస్ సిస్టోవారిస్‌ను వివాహం చేసుకుంది; ఈ దంపతులకు చార్లీ అనే ఒక బిడ్డ ఉంది.[7]

ఆమె 1989లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త జీన్-క్లాడ్ గార్డిన్‌ను వివాహం చేసుకుంది, వారికి ఆర్థర్ అనే కుమారుడు ఉన్నాడు.[8] జీన్-క్లాడ్ గార్డిన్‌ 2013లో మరణించాడు.

మరణం[మార్చు]

74 సంవత్సరాల వయస్సులో జోసెఫిన్ చాప్లిన్ పారిస్‌లో 2023 జూలై 13న మరణించింది.[9][10] ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు.[11]

మూలాలు[మార్చు]

 1. "Chaplin's Dancing Daughter". LIFE. 9 January 1956. p. 82. Retrieved 5 May 2016.
 2. "Limelight". TV Guide. Retrieved 10 May 2016.
 3. Hughes, Howard (2011). Cinema Italiano: The Complete Guide From Classics to Cult. I.B. Taurus & Co. Ltd. p. 140. ISBN 978-1-84885-608-0.
 4. Hughes, Howard (2011). Cinema Italiano: The Complete Guide From Classics to Cult. I.B. Taurus & Co. Ltd. p. 140. ISBN 978-1-84885-608-0.
 5. Cinéma. 289-300 (in French). Fédération française des ciné-clubs. 1983. p. 5. ... Après Maria Pacôme, il avait épousé Joséphine Chaplin, dont il avait eu un fils, Julien, le 16 octobre 1980. ...{{cite book}}: CS1 maint: unrecognized language (link)
 6. Elizabeth Devine (1 September 1984). Annual Obituary 1983. St. James. pp. 135–. ISBN 978-0-912289-07-6. Festival for his work. Ronet's second marriage was to Charles Chaplin's youngest daughter, Josephine, and the marriage produced Ronet's only child.
 7. Hispano americano. Vol. 55. Tiempo. May 1969. pp. 68–.
 8. "Charlie Chaplin : Chaplin Children and Grandchildren". www.charliechaplin.com. Retrieved 2021-08-03.
 9. Mme Joséphine Gardin-Chaplin (in French)
 10. Helmore, Edward (2023-07-21). "Josephine Chaplin, actor and daughter of Charlie Chaplin, dies aged 74". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2023-07-21.
 11. "Charlie Chaplin | దిగ్గజ హాస్యనటుడు చార్లీ చాప్లిన్‌ కూతురు మృతి-Namasthe Telangana". web.archive.org. 2023-07-22. Archived from the original on 2023-07-22. Retrieved 2023-07-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)