జోసెఫ్ యాంటిక్
![]() | |||||||||||||||||||||||
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం |
సికింద్రాబాద్ | 1931 మార్చి 13||||||||||||||||||||||
మరణం |
2016 జూలై 12 ముంబై, భారతదేశం | (వయసు: 85)||||||||||||||||||||||
ఆడే స్థానము | సెంటర్ హాఫ్ | ||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||
భారత హాకీ జట్టు | |||||||||||||||||||||||
సాధించిన పతకాలు
|
జోసెఫ్ "జో" యాంటిక్ (13 మార్చి 1931 – 12 జూలై 2016) ఒక భారతీయ మైదాన హాకీ క్రీడాకారుడు. ఇతడు 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1]
విశేషాలు
[మార్చు]జోసెఫ్ సికిందరాబాదులో 1931, మార్చి 13న జన్మించాడు. ఇతడు 1960లో రోమ్ నగరంలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో భారత హాకీ జట్టులో సెంటర్-హాఫ్ పొజిషన్‌లో డిఫెండర్‌గా ఆడాడు. ఈ ఒలింపిక్స్‌లో భారత జట్టు రజత పతకం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. అంత వరకూ ఒలింపిక్ క్రీడలలో భారత హాకీ జట్టు వరుసగా బంగారు పతకాలను సాధించింది. ఈ క్రీడలలో పాకిస్తాన్ జట్టు ప్రథమస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా స్పెయిన్ మూడవ స్థానంలో నిలిచి కాంస్యాన్ని చేజిక్కించుకుంది. 1962లో జకార్తాలో జరిగిన 4వ ఆసియా క్రీడలలో కూడా ఇతడు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించి రజత పతకాన్ని అందించాడు.
ఇతడు బాంబే IX, పశ్చిమ రైల్వే, ఇండియన్ రైల్వే జట్ల తరఫున అనేక జాతీయ స్థాయి హాకీ పోటీలలో పాల్గొన్నాడు. 1973 నుండి కోచ్‌గా మారి భారతజట్టుకు ప్రపంచ కప్ శిబిరంలో శిక్షణను ఇచ్చాడు. పశ్చిమ రైల్వే జట్టుకు కూడా శిక్షకుడిగా ఉన్నాడు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న ఒమన్ జట్టుకు జాతీయ కోచ్‌గా పనిచేశాడు. ఆ జట్టుకు 2 సంవత్సరాలు కోచ్‌గా వ్యవహరించాడు.
మరణం
[మార్చు]ఇతడు తన 85 యేళ్ళ వయసులో 2016, జూలై 12న ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వయో సంబంధమైన సమస్యలతో మరణించాడు.[2] ఇతనికి విలియమ్ అనే కుమారుడు, రీటా అనే కుమార్తె ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Joseph Anthony Antic". Sports Reference LLC. Archived from the original on 30 June 2017. Retrieved 12 May 2012.
- ↑ ఎడిటర్ (13 July 2016). "Rome hockey Olympian Joe Antic passes away". స్పోర్ట్స్ స్టార్. Retrieved 22 January 2025.