జో అచ్యుతానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహ చిత్రం

జో అచ్యుతానంద, ఒక ప్రాచుర్యం పొందిన కీర్తన, జోల పాట. ఈ కీర్తనను అన్నమాచార్యులు రచించారు.

ఈ కీర్తనను ధీరశంకరాభరణం జన్యమైన నవరోజు రాగం, ఖండచాపు తాళం లో గానం చేస్తారు.[1]

కీర్తన[మార్చు]

జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల

భారతీయ సంస్కృతి[మార్చు]

పూర్తి పాఠం[మార్చు]

మూలాలు[మార్చు]