జౌ
| జౌ | |
|---|---|
| జో, జౌహామ్, జోహామ్, జోకామ్ | |
జోలై అక్షరమాలలో 'జో లై' | |
| స్థానిక భాష | మణిపూర్, భారతదేశం |
| ప్రాంతం | టోన్‌జాంగ్: చిన్ రాష్ట్రం, చిన్ కొండలు; భారతదేశంలో: మిజోరం, మణిపూర్, చందేల్, సింగ్‌హాట్ సబ్‌డివిజన్, సుంగ్నూ ప్రాంతం; చురాచంద్‌పూర్ జిల్లాలు; అస్సాం. |
| స్వజాతీయత | జౌ |
స్థానికంగా మాట్లాడేవారు | 88,000 (2012)e25 |
| లాటిన్ లిపి, జౌలై అక్షరమాల[2] | |
| భాషా సంకేతాలు | |
| ISO 639-3 | zom |
| Glottolog | zouu1235 |
| ELP | Zome |
జౌ (జో అని కూడా రాస్తారు, జోహామ్ లేదా జోకామ్ అని కూడా పిలుస్తారు) అనేది పశ్చిమ బర్మాలో పుట్టి, ఈశాన్య భారతదేశంలోని మిజోరం, మణిపూర్ రాష్ట్రాలలో మాట్లాడే ఈశాన్య కుకి-చిన్ భాషలశాఖకు చెందిన ఒక భాష.[1]
జౌ (ఎక్కువగా "జో") అనే పదాన్ని కొన్నిసార్లు కుకి-చిన్-మిజో ప్రజలు మాట్లాడే భాషలకు సాధారణ రూపంగా ఉపయోగిస్తారు.
ధ్వనిశాస్త్రం
[మార్చు]కింది రకమైన వ్యత్యాసాలు చూపే పదాంశాలు లేదా పాక్షికంగా సమానమైన పదాల ఆధారంగా 23 జౌ హల్లుల వర్ణాలను నిర్ధారించవచ్చు. ఈ 23 వర్ణాలు కాకుండా, 1 హల్లు అరువు తెచ్చుకున్న వర్ణంగా ఉంది (ఉదా. /r/), ఇది కేవలం ఇతర భాషల నుండి వచ్చిన పదాలలో అతి అరుదైన సందర్భాలలో మాత్రమే కనిపిస్తుంది (ఉదా. /rəŋ/ "రంగు" లోని /r/). ఈ హల్లులతో పాటు, జౌ భాషలో 7 అచ్చులు ఉన్నాయి: i, e, a, ɔ, o, u, ə.[3]
| ఓష్ఠ్య | దంత్య/ వర్త్స్య |
తాలవ్య | కంఠ్య | స్వరపేటికా | ||
|---|---|---|---|---|---|---|
| స్పర్శాలు | శ్వాసాలు | [[|p]] | [[|t]] | [[|c]] | [[|k]] | [[|ʔ]] |
| మహా ప్రాణాలు | [[|pʰ]] | [[|tʰ]] | [[|kʰ]] | |||
| నాదాలు | [[|b]] | [[|d]] | [[|ɟ]] | [[|g]] | ||
| స్పర్శోష్మాలు | [[|tʃ]] | |||||
| ఊష్మాలు | శ్వాసాలు | [[|v]] | [[|s]] | [[|h]] | ||
| నాదాలు | [[|z]] | |||||
| నాసిక్యాలు | [[|m]] | [[|n]] | [[|ŋ]] | |||
| పార్శ్వికాలు | [[|l]] | |||||
| కంపితాలు | ([[|r]]) | |||||
| అంతస్థాలు | [[|w]] | [[|j]] | ||||
| పూర్వ | మధ్య | పశ్చాత్ | |
|---|---|---|---|
| సంవృత | [[|i]] | [[|u]] | |
| అర్ధ సంవృత | [[|e]] | [[|ə]] | [[|o]] |
| అర్ధ వివృత | [[|ɔ]] | ||
| వివృత | [[|a]] |
రాత విధానం
[మార్చు]జౌ భాషను తరచుగా క్రిస్టియన్ మిషనరీ జె.హెచ్. కోప్ రూపొందించిన లాటిన్ లిపిలో రాస్తారు. 1952లో, చురాచంద్‌పూర్‌కు చెందిన ఎమ్. సియాహ్జాథాంగ్ ' జోలై ' లేదా ' జౌలై ' పేరిట ఒక ప్రత్యామ్నాయ లిపిని రూపొందించారు. ఇది కొన్ని అబుగిడా లక్షణాలు కలిగిన ఒక అక్షరమాల విధానం. ఈ లిపిని ఉపయోగించే సమాజం పెరుగుతోంది—జౌ సాంస్కృతిక, రాజకీయ, సాహిత్య సంస్థలు 1970ల నుండి ఈ లిపిని స్వీకరించడం ప్రారంభించాయి. ఇటీవల మణిపూర్ ప్రభుత్వం సియాహ్జాథాంగ్, ఈ లిపి రెండింటికీ మద్దతు ఇచ్చింది.[4][5]
అచ్చులు
[మార్చు]- a - [a]
- aw - [ɔ]
- e - [e/ə]
- i - [i~j]
- o - [o]
- u - [u~w][6]
హల్లులు
[మార్చు]- b - [b]
- ch - [c]
- d - [d]
- g - [g]
- h - [h], పదాంశం చివరలో [ʔ]
- j - [ɟ]
- k - [k]
- kh - [kʰ]
- l - [l]
- m - [m]
- n - [n]
- ng - [ŋ]
- p - [p]
- ph - [pʰ]
- r - [r]
- s - [s]
- t - [t]
- th - [tʰ]
- v - [ʋ]
- z - [z][6]
వ్యాకరణం
[మార్చు]క్రియలు
[మార్చు]జౌ క్రియా పదాలను కింద ఇచ్చిన విధంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు: ధాతువు (1), ధాతువు (2), ధాతువు (3):[7]
| ధాతువు 1 | ధాతువు 2 | ధాతువు 3 | ధాతువు 4 |
| piê-ఇవ్వు | pie? | pe- | pieh |
| puo-మోయు | puo? | po- | pua- |
సంఖ్యలు
[మార్చు]జౌ సంఖ్యలను ఈ క్రింది విధంగా లెక్కిస్తారు:[8]
| సంఖ్య | జౌ | ఇంగ్లీష్ | హిందీ |
|---|---|---|---|
| 0 | be̋m | zero | शून्य śūnya |
| 1 | khàt | one | एक ek |
| 2 | nì | two | दो do |
| 3 | thum | three | तीन tīn |
| 4 | li | four | चार cār |
| 5 | nga | five | पाँच pā̃c |
| 6 | gùh | six | छह chah |
| 7 | sagí | seven | सात sāt |
| 8 | giét | eight | आठ āṭh |
| 9 | kuó | nine | नौ nau |
| 10 | sàwm, sôm | ten | दस das |
| 11 | sàwm leh khàt | eleven | ग्यारह gyārah |
| 12 | sàwm leh nì | twelve | बारह bārah |
| 13 | sàwm leh thum | thirteen | तेरह terah |
| 14 | sàwm leh li | fourteen | चौदह caudah |
| 15 | sàwm leh nga | fifteen | पंद्रह pandrah |
| 16 | sàwm leh gùh | sixteen | सोलह solah |
| 17 | sàwm leh sagí | seventeen | सत्रह satrah |
| 18 | sàwm leh giét | eighteen | अठारह aṭhārah |
| 19 | sàwm leh kuó | nineteen | उन्नीस unnīs |
| 20 | sàwmnì | twenty | बीस bīs |
| 30 | sàwmthum | thirty | तीस tīs |
| 40 | sàwmli | forty | चालीस cālīs |
| 50 | sàwmnga | fifty | पचास pacās |
| 60 | sàwmgùh | sixty | साठ sāṭh |
| 70 | sàwmsagí | seventy | सत्तर sattar |
| 80 | sàwmgiét | eighty | अस्सी assī |
| 90 | sàwmkuò | ninety | नव्वे navve |
| 100 | zȁ | hundred | सौ sau |
| 1,000 | sa̋ng, tȕl | one thousand | हज़ार hazār |
| 10,000 | si̋ng, tȕlsàwm, sa̋ngsàwm | ten thousand | दस हज़ार das hazār |
| 100,000 | nuòi, tȕlzà, sa̋ngzà | one hundred thousand, one lakh | लाख lākh |
| 1,000,000 | nuòisàwm, sa̋ngtȕl, tȕltȕl | one million | दस लाख das lākh |
| 10,000,000 | thȅn, vâibêlsié, kráwl | ten million | करोड़ karoṛ |
| 100,000,000 | thȅnzà, kráwl sàwm | one hundred million | दस करोड़ das karoṛ |
భాషా సంబంధాలు
[మార్చు]ఈశాన్య కుకి-చిన్ భాషలలో ఒకటైన జౌ భాష, మిజోరంలోని సంపర్క భాష అయిన దుహ్లియన్ (లుషై) లేదా మిజో భాష (దుహ్లియన్ లేదా లుషైలో దీని స్వదేశీ పేరు మిజో తౌంగ్) వంటి మధ్య భాషలతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంది.
భారతదేశంలో మాట్లాడే జౌ భాష, పైతే ప్రజల పైతే భాషను పోలి ఉంటుంది, అయితే పైతే భాషలో ఉన్న పదాంశాంత స్వరపేటికా విరామాలు (గ్లోటల్ స్టాప్స్) జౌ భాషలో ఉండవు.[9][10]
భౌగోళిక విస్తృతి
[మార్చు]ఈ భాష మాట్లాడే ప్రాంతం అత్యంత విస్తృత స్థాయిలో ఉన్నప్పుడు, మయాన్మార్, భారతదేశం, బాంగ్లాదేశ్ ప్రాంతాల్లో సుమారు 60,000 చదరపు మైళ్ళు (160,000 చ.కి.మీ) విస్తరించి ఉండేది.[11] అయితే రాజకీయ సరిహద్దులు, విభిన్న చర్చల కారణంగా కొన్ని ఆధారాలలో ఈ ప్రాంత వైశాల్యం మార్పులకు గురైంది.[12]
మయాన్మార్‌లో
[మార్చు]దీనిని చిన్ రాష్ట్రం, టిడ్డిమ్, చిన్ కొండలు ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. 1950ల నుండి జో మాట్లాడే చిన్ రాష్ట్రంలో బర్మీస్ భాష వినియోగం పెరిగింది.[13] మైన్మార్ లోని కింది టౌన్‌షిప్‌లలో జౌ భాష మాట్లాడతారని ఎథ్నోలాగ్ నివేదించింది:
- చిన్ రాష్ట్రం: టోన్‌జాంగ్, హాఖా, టెడిమ్ టౌన్‌షిప్‌లు
- సగైంగ్ డివిజన్: కలే, ఖంపట్, తము టౌన్‌షిప్‌లు
భారతదేశంలో
[మార్చు]- మణిపూర్
- చందేల్ జిల్లా: సింగ్‌హాట్ సబ్‌డివిజన్, సుంగ్నూ సచిహ్ / కానా ప్రాంతం
- చురాచంద్‌పూర్ జిల్లా
- మిజోరం
- అస్సాం[14]
బాంగ్లాదేశ్‌లో
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Haokip, Pauthang (2011). Socio-linguistic Situation in North-east India. Concept Publishing Company. p. 55. ISBN 978-8180697609.
- ↑ "Zoulai". Omniglot.com. Archived from the original on 28 డిసెంబరు 2021. Retrieved 28 డిసెంబరు 2021.
- ↑ Singh, Yashawanta; Himmat, Lukram (ఫిబ్రవరి 2013). "Zou Phonology" (PDF). Language in India. 13 (2): 683–701. Archived (PDF) from the original on 23 నవంబరు 2018. Retrieved 19 ఫిబ్రవరి 2019.
- ↑ Pandey, Anshuman (29 సెప్టెంబరు 2010). "Introducing the Zou Script" (PDF). Archived (PDF) from the original on 18 జూలై 2019. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ Ian James; Mattias Persson (మార్చి 2012). "Script for Zou". skyknowledge.com. Archived from the original on 14 ఆగస్టు 2018. Retrieved 19 ఫిబ్రవరి 2019.
- 1 2 "Zou language, script, and pronunciation". Omniglot. Archived from the original on 6 జూలై 2019. Retrieved 6 జూలై 2019.
- ↑ Philip Thanglienmang Tungdim (2012). "A Descriptive Grammar of the Zo Language". Academia. Archived from the original on 25 మార్చి 2019. Retrieved 22 మార్చి 2019.
- ↑ Thangliènmâng Tungdim, Philip (2011). Zo-English-Hindi Kizìlna Lȁibú [Self-tutor book of Zo-English-Hindi]. New Delhi: Zou Cultural-cum-Literature Society India. ISBN 978-81-920282-0-0. Archived from the original on 21 జూన్ 2023. Retrieved 20 ఆగస్టు 2019.
- ↑ Bareh, Hamlet (2001). "Zou". Encyclopaedia of North-East India: Manipu. Mittal. pp. 260ff. ISBN 978-81-7099-790-0. Retrieved 22 నవంబరు 2010.
- ↑ "Their language is called Zou which is similar to the language spoken by the Paite. Unlike the Zou, the Paite possess the terminal glottal stop 'h'. For example, a word for 'good' is hoih in Paite while it changes into hoi in the Zou language. Sannemla (Zou folksongs) are also popular among the Paite, although they are rendered in their individual dialect bearing the characteristic phonetic differences." Singh, Kumar Suresh; Horam, M. & Rizvi, S. H. M. (1998). People of India: Manipur. Anthropological Survey of India by Seagull Books. p. 253. ISBN 978-81-7154-769-2.
- ↑ Encyclopaedia of South-Asian tribes - Volume 8 - Page 3436 Satinder Kumar - 2000 "According to the 1981 census, 12,515 persons speak the Zou language"
- ↑ Gopalakrishnan, Ramamoorthy (1996). Socio-political framework in North-East India. New Delhi: Vikas Publishing House. p. 150. OCLC 34850808.
But against the background of all such conflict the Zomi National Congress went a step further in its argument for a Zomi identity by claiming Thado language as Zomi language. In the Kuki-Chin group of tribes, numerical strength has played ...
- ↑ Nang Khen Khup (2007). Evaluating the Impact of Family Devotions Upon Selected Families from the Zomi Christian Community of Tulsa (Thesis). Oral Roberts University. p. 7. OCLC 645086982.
The Zomi language is descended from the Tibeto-Burman language domain. Though each tribal group speaks its own dialect, Burmese is widely used in Zoland (Chinland) due to Burmanization of military regime for over five decades
- ↑ Shyamkishor, Ayangbam. "In Search of Common Identity: A Study of Chin-Kuki-Mizo Community in India" (PDF). International Journal of South Asian Studies: A Biannual Journal of South Asian Studies. 3 (1): 131–140. Archived from the original (PDF) on 21 మార్చి 2012. Retrieved 3 ఫిబ్రవరి 2014.
- ↑ Loncheu, Nathan (2013). Dena, Lal (ed.). Bawmzos: A Study Of The Chin-Kuki-Zo Tribes Of Chittagong. New Delhi: Akansha Publishing House. ISBN 978-81-8370-346-8.
- ↑ Reichle, Verena (1981). Bawm language and lore: Tibeto-Burman area. Europäische Hochschulschriften series 21, Linguistik: volume 14. Bern, Switzerland: P. Lang. ISBN 978-3-261-04935-3.
మరింత పఠనం
[మార్చు]- DeLancey, Scott (1987). "Part VIII: Sino-Tibetan languages". In Comrie, Bernard (ed.). The World's Major Languages. New York: Oxford University Press. pp. 797–810. ISBN 978-0-19-520521-3.
- Thang, Khoi Lam (2001). A phonological reconstruction of Proto-Chin (PDF) (MA thesis). Chiang Mai: Payap University. Archived from the original (PDF) on 2 సెప్టెంబరు 2018.
- Button, Christopher Thomas James (2009). A Reconstruction of Proto Northern Chin in Old Burmese and Old Chinese Perspective (PDF) (Ph.D. dissertation). London: University of London. Archived from the original (PDF) on 30 మే 2020.
- Button, Christopher Thomas James (2011). Proto Northern Chin. STEDT monograph. Vol. 10. Berkeley: University of California, Berkeley. ISBN 978-0-944613-49-8.