జౌన్‌పురి రాగం
| థాట్ | ఆసావరి |
|---|---|
| రోజులో రాగం పాడే సమయం | రెండవ ప్రహర్ (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు) |
| ఆరోహణ | స ర మ ప ధ ని స'[1] |
| అవరోహణ | స' ని ధ ప మ గ ర స[1] |
| పకడ్ | మ ప ని ధ ప, ధ మ ప గ, ర మ ప |
| వాది | ధైవతం (ధ)[1] |
| సమవాది | గాంధారం (గ)[1] |
జౌన్‌పురి రాగం (Raga Jaunpuri) హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలోని రాగం, ఇది ఆసావరి ఠాట్ కు చెందినది. కొందరు సంగీత విద్వాంసులు, ముఖ్యంగా ఓంకారనాథ్ ఠాకూర్, దీనిని శుద్ధ ఋషభ ఆసావరితో తేడా లేనిదిగా పరిగణిస్తారు.[2] దీని మధురమైన స్వరాలు కారణంగా కర్ణాటక సంగీతంలో కూడా ఈ రాగం విశేష ఆదరణ పొందింది. దక్షిణ భారతదేశంలో అనేక కృతులు జౌన్‌పురి రాగంలో స్వరపరచబడ్డాయి.[3] ఈ రాగం పేరు గుజరాత్‌లోని జావన్‌పూర్ లేదా ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ వంటి ప్రాంతాల పేర్లతో సంబంధం కలిగి ఉండవచ్చని భావిస్తారు.[3]
చరిత్ర
[మార్చు]జౌన్‌పురి రాగాన్ని జౌన్‌పూర్ సుల్తాన్ హుసైన్ షార్కీ సృష్టించినట్లు చెబుతారు.
నిర్మాణం
[మార్చు]ఈ రాగానికి పకడ్ (ప్రధాన స్వర ప్రయోగం): మ ప ని ధ ప, మ ప గ, ర మ ప
ఈ రాగాన్ని సాధారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఆలపిస్తారు.[1]
కర్ణాటక సంగీతంలో
[మార్చు]నిర్మాణం, లక్షణం
[మార్చు](ఈ రాగంలో ఉపయోగించే స్వరాలు: షడ్జము, చతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, కైశికి నిషాదము, శుద్ధ ధైవతము)
కర్ణాటక సంగీతంలో జోన్పురిను 20వ మేళకర్త రాగం అయిన నటభైరవికు చెందిన ఒక జన్య రాగంగా పరిగణిస్తారు.
ప్రముఖ కృతులు
[మార్చు]జౌన్‌పురి రాగం విషాదం, గాంభీర్యం, భక్తి భావాలను వ్యక్తపరచడానికి అనుకూలంగా ఉంటుంది.[3]
కృతులు
[మార్చు]| కృతి | కర్త |
|---|---|
| మాధవాలోకనం | స్వాతి తిరునాళ్ రామ వర్మ |
| హరి చిత్త సత్య | పురందర దాసు |
| ఎప్పో వరువారో | గోపాలకృష్ణ భారతీ |
| సపశ్యత్ కౌసల్యా | పంచపాకేశ శాస్త్రి |
| రామ భక్త హనుమాన్ | సుగుణ పురుషోత్తమన్ |
| కంద గుహ షణ్ముఖ | మహారాజాపురం సంతానం |
| రామ మంత్రవ జపిసో | పురందర దాసు |
| ఆసై ముఖం మరందు పోచే | సుబ్రహ్మణ్య భారతీ |
| పారుకుల్లే నల్ల నాడు | సుబ్రహ్మణ్య భారతీ |
| సద్గురు వచ్చోను | సంత్ తుకారాం |
| ఆండవన్ దర్శనమే | ముత్తయ్య భాగవతార్ |
| తాయిడతిల్ | ముత్తయ్య భాగవతార్ |
| వలై మనోన్మణి | ముత్తయ్య భాగవతార్ |
| మంగళ రూపిణియే | ముత్తయ్య భాగవతార్ |
| మావూర్ వళర్ మహారాణి | ముత్తయ్య భాగవతార్ |
| చిదానందదం శ్రీనివాసం | కళ్యాణి వరదరాజన్ |
| మురుగనై భజి మనమే | పాపనాసం శివన్ |
| అవతారం చేశిద్దువీరే | అరుణాచల కవి |
| బారో కృష్ణయ్య చివరి చరణం | కనక దాసు |
| శరవణ భవ | తెలియదు |
| పాంపవే నా (జావళి) | తిప్పన్న ఆర్య |
| భుజత్ శ్యామ్ కౌన్ తూ గోరీ | సూరదాస్ |
| దశరథ సుత | వనమామలై జీయర్ స్వామి |
| కైతరుణ జ్యోతి | అరుణగిరినాథర్ |
| మలసై కోపం | అరుణగిరినాథర్ |
| శివనార్ మనం కుళిర | అరుణగిరినాథర్ |
| వెంకలం బాణం | అరుణగిరినాథర్ |
| తొక్కర్కుడిల్ | అరుణగిరినాథర్ |
| పెరుక్క సంజలిత్తు | అరుణగిరినాథర్ |
| ఓలమిట్టిరైత్తెళుంతు | అరుణగిరినాథర్ |
| తోలోడు మూఢియ | అరుణగిరినాథర్ |
| అవమరువిన | అరుణగిరినాథర్ |
| నీలంగోల్ | అరుణగిరినాథర్ |
| వింధధిన్ ఊరి | అరుణగిరినాథర్ |
పాటలు
[మార్చు]తెలుగు
[మార్చు]| పాట | సినిమా | సంగీత దర్శకుడు | గాయకులు |
|---|---|---|---|
| కలయే జీవితమన్న (పద్యం) | శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం | పెండ్యాల నాగేశ్వరరావు | పి. సుశీల |
| ఏలా నాపై దయ చూపవు | విప్ర నారాయణ | ఎస్. రాజేశ్వరరావు | పి. భానుమతి |
| ఎచటికోయి నీ పయనం | అమరశిల్పి జక్కన్న | ఎస్. రాజేశ్వరరావు | ఘంటసాల |
గమనికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 "Raag Jaunpuri – Indian Classical Music – Tanarang.com". www.tanarang.com. Archived from the original on 5 August 2020. Retrieved 12 February 2021.
- ↑ Rajan Parrikar, Asavari and Associates Archived 8 జూలై 2015 at the Wayback Machine
- 1 2 3 Mani, Charulatha. "A Raga's journey – Jaunty Jonpuri". The Hindu. Archived from the original on 29 September 2015. Retrieved 21 July 2015.