జ్ఞానేశ్వరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్ఞానేశ్వర్
Dnyaneshwar2.jpg
జననంజ్ఞానేశ్వర్
1275 CE
ఆలంది, మహారాష్ట్ర
బిరుదులు/గౌరవాలుసంత్, దేవ్, మౌలా[1]
గురువునివృత్తినాథుడు
తత్వంవర్కారీ, హిందూ
సాహిత్య రచనలుజ్ఞానేశ్వరి, అమృతానుభవం, చాంగ్ దేవ్ పాశశ్తి, హరిపథం, అభంగాలు

జ్ఞానేశ్వరుడు (1275–1296) [2] మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, తత్వవేత్త, నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి. భగవద్గీత మీద ఆయన రచించిన జ్ఞానేశ్వరి అనే గ్రంథం, అమృతానుభవం అనే గ్రంథం మరాఠీ సాహిత్యంలో మైలురాళ్ళుగా పరిగణిస్తారు.

జీవిత విశేషాలు[మార్చు]

జ్ఞానేశ్వరుడు మహారాష్ట్రను 13 వ శతాబ్దంలో యాదవ రాజైన రామదేవర పరిపాలిస్తున్న కాలంలో జన్మించాడు. [3] 1296లో ఢిల్లీ సుల్తానులు ఆ రాజ్యం మీద దాడి చేసేవరకు ప్రశాంతంగా, సుసంపన్నంగా ఉండేది.[4][5] యాదవ రాజుల పాలనలో కళలు, సైన్సు మొదలైన రంగాలు బాగా అభివృద్ధి సాధించాయి. భారతదేశం నలుమూలల నుంచి అనేకమంది పండితులు ఆ రాజ్యానికి విచ్చేసేవారు.[6] కానీ అదే సమయంలోనే ప్రజల్లో మతమౌఢ్యం, సాంఘిక దురభిమానం, మూఢ నమ్మకాలు లాంటివి పెరిగి గ్రామదేవతలకు మూగజీవాలను బలి ఇవ్వడం ఎక్కువైంది.[7] జ్ఞానేశ్వరుడు తను రాసిన జ్ఞానేశ్వరి అనే గ్రంథంలో ఈ మూఢాచారాలను విమర్శించాడు.[8] బి.పి బహీరత్ అనే పండితుని ప్రకారం ఆ కాలంలో మరాఠీలో రచనలు చేసిన తొలి తత్వవేత్త జ్ఞానేశ్వరుడు.[9]

మూలాలు[మార్చు]

వివరణ

ఉదాహరణలు

  1. Berntsen 1988, p. 143.
  2. Mokashi 1987, p. 39.
  3. Bahirat 2006, p. 1.
  4. Ranade 1933, p. 25.
  5. Michell & George 1999, p. 5.
  6. Bahirat 2006, p. 2.
  7. Bahirat 2006, pp. 3–4.
  8. Bahirat 2006, pp. 4–5.
  9. Bahirat 2006, pp. 2–3.

పుస్తకాలు