జ్యోతిర్మయి బసు
| జ్యోతిర్మయి బసు | |||
| పదవీ కాలం 1967–1982 | |||
| ముందు | సుధాంసు భూషణ్ దాస్ | ||
|---|---|---|---|
| తరువాత | అమల్ దత్తా | ||
| నియోజకవర్గం | డైమండ్ హార్బర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1920 డిసెంబరు 18 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1982 జనవరి 12 (వయస్సు 61)[1] జైపూర్, రాజస్థాన్ | ||
| రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ||
| జీవిత భాగస్వామి | అనిమా బసు | ||
| సంతానం | 1 కొడుకు | ||
| మూలం | http://164.100.47.132/LssNew/biodata_1_12/1734.htm | ||
జ్యోతిర్మయి బసు (18 డిసెంబర్ 1920 - 12 జనవరి 1982) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]జ్యోతిర్మయి బసు భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1967లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1971 లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి అంబర్ ప్రసాద్ బందోపాధ్యాయపై 73,336 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జ్యోతిర్మయి బసు 1977 లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి బిరేన్ మహాంతిపై 1,56,404 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1980 లోక్సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి ఇషాక్ పై 1,45,932 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Ananth V. Krishna (2011). India Since Independence: Making Sense of Indian Politics. First Impressions. ISBN 978-8131734650.
- ↑ "Diamond harbour Lok Sabha Election till 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 2024. Archived from the original on 13 July 2025. Retrieved 13 July 2025.
- ↑ "Diamond Harbour Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 17 July 2025. Retrieved 17 July 2025.