జ్యోతిర్మయి సిక్దార్
జ్యోతిర్మయి సిక్దార్ | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| లోక్‌సభ సభ్యురాలు | |||||||||||||||||||||||||||
| In office 2004–2009 | |||||||||||||||||||||||||||
| అంతకు ముందు వారు | సత్యబ్రత ముఖర్జీ | ||||||||||||||||||||||||||
| తరువాత వారు | తపస్ పాల్ | ||||||||||||||||||||||||||
| నియోజకవర్గం | కృష్ణానగర్ | ||||||||||||||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||||||
| జననం | 1969 December 11 నదియా, పశ్చిమ బెంగాల్ | ||||||||||||||||||||||||||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2020) | ||||||||||||||||||||||||||
| ఇతర రాజకీయ పదవులు | సిపిఐ (ఎం) (2004-2009) | ||||||||||||||||||||||||||
| జీవిత భాగస్వామి |
అవతార్ సింగ్ (m. 1994) | ||||||||||||||||||||||||||
| సంతానం | అవరజ్యోతి సింగ్[1] | ||||||||||||||||||||||||||
| తల్లిదండ్రులు | గురుదాస్ సిక్దర్, నిహర్బలా సిక్దర్ | ||||||||||||||||||||||||||
| నివాసం | కోల్‌కతా | ||||||||||||||||||||||||||
| కళాశాల | దేబగ్రామ్ DK బాలికల పాఠశాల, దేబగ్రామ్ SA విద్యాపీఠ్ | ||||||||||||||||||||||||||
| Sports career | |||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||
జ్యోతిర్మయి సిక్దర్ (జననం 11 డిసెంబర్ 1969) భారతదేశానికి చెందిన మాజీ క్రీడాకారిణి, రాజకీయ నాయకురాలు. ఆమె ఖేల్ రత్న అవార్డు పొందిన మొదటి మహిళా అథ్లెట్.
ఆమె మిడిల్-డిస్టెన్స్ రన్నర్, 1995 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీటర్లను గెలుచుకుంది. ఆమె 1998 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 800 మీ, 1500 మీటర్ల ఈవెంట్లలో కాంస్య పతకాన్ని & 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో రెండు ఈవెంట్లలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆమె 1995లో అర్జున అవార్డు, 1998–1999 సంవత్సరానికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును, 2003లో పద్మశ్రీ అందుకుంది.[2]
రాజకీయ జీవితం
[మార్చు]జ్యోతిర్మయి సిక్దర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సత్య బ్రత ముఖర్జీపై 20387 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[3] ఆమె 2009 లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తపస్ పాల్ చేతిలో 77,386 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
జ్యోతిర్మయి సిక్దర్ 2020 జూన్ 09న సీపీఐ(ఎం) పార్టీని వీడి కోల్‌కతాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Track to range, a mother-son story". The Telegraph. 27 November 2019. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Jyotirmoyee Sikdar to receive Padma Shri". The Times of India. 27 January 2003. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Jyotirmoyee Sikdar" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "Former left leader Jyotirmoyee Sikdar joins BJP hours after Amit Shah addressed Bengal" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 9 June 2020. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
- ↑ "West Bengal: Ex-CPM MP Jyotirmoyee Sikdar joins BJP" (in ఇంగ్లీష్). The Week. 2020. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.