Jump to content

జ్యోతిర్మయ్ కర్

వికీపీడియా నుండి

జ్యోతిర్మయ్ కర్ (జననం 1957) పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త.[1] ఆయన పూర్వ మేదినీపూర్ జిల్లాలోని పటాష్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పశ్చిమ బెంగాల్ శాసనసభకు మాజీ సభ్యుడు. ఆయన 2011, 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఆయన పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాకు చెందినవాడు. ఆయన దివంగత కాళికింకర్ కార్ కుమారుడు. అతను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ఎంఏ పూర్తి చేసి 1968లో మొదటి ర్యాంక్ లో ఉత్తీర్ణత సాధించాడు.[1] అతను లెక్చరర్ గా పనిచేసాడు. అతని భార్య గృహిణి.[1]

కెరీర్

[మార్చు]

2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన పటాష్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచాడు. ఆయన 103,567 ఓట్లు పొంది, తన సమీప ప్రత్యర్థి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన మఖన్ లాల్ నాయక్ ను 29,888 ఓట్ల తేడాతో ఓడించాడు.[2][3][4] 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందాడు.[5][2][6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Jyotirmoy Kar(All India Trinamool Congress(AITC)):Constituency- PATASHPUR(PURBO MEDINIPUR) - Affidavit Information of Candidate". www.myneta.info. Retrieved 2025-04-20.
  2. 2.0 2.1 "WEST BENGAL ELECTION 2022: PATASHPUR ASSEMBLY SEAT". Hindustan Times. 4 June 2024. Retrieved 21 April 2025.
  3. "West Bengal Assembly election 2021, Patashpur profile: TMC's Jyotirmoy Kar won constituency in past two elections". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-17. Retrieved 2025-04-20.
  4. Live, A. B. P. "Patashpur Election Results 2021 LIVE, Vote Counting, Leading, Trailing , Winners West bengal Patashpur Constituency Election News LIVE". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2025-04-20.
  5. "Patashpur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2025-04-20.
  6. "Patashpur Election Result 2021 Live Updates: Winner, Loser, Leading, Trailing, MLA, Margin". News18 (in ఇంగ్లీష్). Retrieved 2025-04-20.