జ్యోతుల నెహ్రూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1940
ఇర్రిపాక గ్రామం, జగ్గంపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సంతానం జ్యోతుల నవీన్‌

జ్యోతుల నెహ్రూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జగ్గంపేట నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన అనంతరం 2013లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లో చేరాడు.

జ్యోతుల నెహ్రూ 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు పై 15,932 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] ఆయన తరువాత అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా పని చేశాడు. జ్యోతుల నెహ్రూ 12 ఏప్రిల్ 2016న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లో చేరాడు.

జ్యోతుల నెహ్రూ 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబు చేతిలో 23365 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆయన తరువాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసి 2 ఏప్రిల్ 2021 ఆ పదవికి రాజీనామా చేశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 May 2014). "దశాబ్దం తరువాత జగ్గంపేటలో జ్యోతుల పాగా". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  2. The Hans India (3 April 2021). "Kakinada: TDP vice-president Jyothula Nehru resigns" (in ఇంగ్లీష్). Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.