జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
Զվարթնոց Միջազգային Oդանավակայան
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంఅంతర్జాతీయ
యజమానిజనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఆర్మేనియా
కార్యనిర్వాహకత్వంఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC
సేవలుయెరెవాన్
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
ఎయిర్ హబ్ఆర్మేనియా ఎయిర్‌కంపెనీ
ఎత్తు AMSL2,838 ft / 865 m
అక్షాంశరేఖాంశాలు40°08′50″N 044°23′45″E / 40.14722°N 44.39583°E / 40.14722; 44.39583
వెబ్‌సైటుwww.zvartnots.aero
పటం
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం is located in Armenia
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
Location of airport in Armenia
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
09/27 3,850 12,631 తారు/కాంక్రీటు
గణాంకాలు (2017)
ప్రయాణీకుల సంఖ్య24,48,250
Soure:EUROCONTROL వద్ద ఆర్మేనియన్ AIP [1]

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్మేనియన్:Զվարթնոց միջազգային օդանավակայան, (IATA: EVN, ICAO: UDYZ) జ్వర్ట్నాట్స్ సమీపంలో ఆర్మేనియా రాజధాని యెరెవాన్‌కు దక్షిణదిశలో 15 కి.మీల దూరంలో నెలకొని వుంది. ఇది ఆర్మేనియా దేశపు ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా పరిగణించబడుతున్నది. ఇది ఆ దేశపు అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం.

చరిత్ర[మార్చు]

పాత టర్మినల్ యొక్క దృశ్యం (ఎడమ), కొత్త అరైవల్స్ హాల్ (కుడి)

ఈ విమానాశ్రయం 1961లో తన కార్యకలాపాలను ఆరంభించింది.[2] 1970లో నిర్వహించిన పోటీలో ఎం.ఖచిక్యన్, ఎ.తర్ఖన్యన్, ఎస్.కలష్యన్,ఎం.బఘ్దసర్యన్‌లు మొదటి టర్మినల్‌ను డిజైన్ చేయడానికి ఎన్నికైనారు. సోవియట్ యూనియన్ ప్రాంతీయ రవాణా అవసరాలకు అనుగుణంగా కొత్త టర్మినల్ ఏరియా అభివృద్ధితో ఈ విమానాశ్రయం 1980లలో నవీకరించబడింది.

ఆర్మేనియా 1990లలో సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వతంత్రదేశంగా ప్రకటించుకున్న తర్వాత సరుకు రవాణా అభివృద్ధి కావడంతో 1998లో ఈ విమానాశ్రయంలో మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కల కొత్త కార్గో టర్మినల్ నిర్మాణం జరిగింది.[3] కార్పొరేషన్ అమెరికా అనే అర్జెంటీనా కంపెనీ యాజమాన్యంలో ఉన్న ఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC అనే సంస్థతో 2001లో విమానాశ్రయం నిర్వహణ కొరకు 30 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC రన్‌వేను, టాక్సీ వేస్‌ను, ర్యాంపును నవీకరించింది. 2006లో క్రొత్త అరైవల్స్ హాల్‌ను ప్రారంభించారు. తరువాత 2011లో డిపార్చర్స్ & అరైవల్స్ టర్మినల్‌ను, 1000 వాహనాలు సామర్థ్యం ఉన్న కార్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 2013 జనవరి 30న దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఎమర్జింగ్ మార్కెట్స్ ఎయిర్‌పోర్ట్స్ అవార్డ్ (EMAA) వేడుకల్లో జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి "కామన్‌వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS)లో ఉత్తమ ఎయిర్‌పోర్ట్" అవార్డ్ లభించింది.[4]

విహంగ వీక్షణం[మార్చు]

ఈ విమానాశ్రయానికి ఆంటొనొవ్ An-225, బోయింగ్ 747-400, ఎయిర్‌బస్ A380 వంటి విమానాలను నిలిపే సామర్థ్యం ఉంది.[3][5][6] ఈ విమానశ్రయపు రన్‌వే రెండవ కేటగరీ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టంతో అనుసంధానించ బడి ఉంది. దానివల్ల 30 మీటర్ల గరిష్ట పరిమితి, 350 మీటర్ల దృగ్గోచరంతో విమానాలను నడుపవచ్చు.[7]

చెక్-ఇన్ హాల్
డిపార్చర్స్ హాల్

ఈ విమానాశ్రయంలో కొత్తగా ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టం (FIDS), బ్యాగేజీల కొరకు ఆటొమేటెడ్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం, చెక్-ఇన్, ప్యాసింజర్ కంట్రొల్, 150 సర్వైలెన్స్ కెమెరాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయంలో ప్రవేశానికి ప్రి కంట్రోల్ (వేలిముద్రలు, బోర్డింగ్ పాస్), పాస్‌పోర్ట్ కంట్రోల్, ఎక్స్‌రే కంట్రోల్ అనే మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

విమానాలు వాటి గమ్యస్థానాలు[మార్చు]

విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఏజియన్ ఎయిర్‌లైన్స్ ఏథెన్స్
నిర్ణీత సమయంలో: హెరాక్లియాన్, రోడ్స్, థెస్సాలోనికి
ఎయిరోఫ్లాట్ మాస్కో
ఎయిర్ అరేబియా షార్జా
ఎయిర్ కైరో షర్ం ఎల్ షేక్
నిర్ణీత సమయంలో: హర్గడ
ఎయిర్ ఫ్రాన్స్ పారిస్ చార్లెస్ డి గల్లె
ఎయిర్ మాల్టా నిర్ణీత సమయంలో: మాల్టా
ఎ.ఎం.సి.ఎయిర్‌లైన్స్ నిర్ణీత సమయంలో: హర్గడ,[8]షర్ం ఎల్ షేక్[8]
ఆర్కియా టెల్ అవీవ్ - బెన్ గురియాన్
ఆర్మేనియా ఎయిర్ కంపెనీ బాగ్దాద్, బీరట్,ఎర్బిల్,లియాన్, మినరల్నె వొడి, టెల్ అవీవ్ - బెన్ గురియాన్, వొరొనెజ్,
నిర్ణీత సమయంలో: అరెక్సాస్, హెరక్లియాన్, కోస్, లర్నకా, నైస్, రోడ్స్, రిమిని, సులేమానియా, థెస్సాలోనికి, టివత్, వర్నా, వెనిస్[9]
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ వియన్నా
బెలావియా మిన్‌స్క్
బ్రుసెల్స్ ఎయిర్‌లైన్స్ బ్రుసెల్స్[10]
బల్గేరియా ఎయిర్ నిర్ణీత సమయంలో: బర్గస్, వర్నా
బల్గేరియన్ ఎయిర్ ఛార్టర్ నిర్ణీత సమయంలో: బర్గస్[9]
ఛామ్‌ వింగ్స్ డమాస్కస్
చెక్ ఎయిర్‌లైన్స్ ప్రేగ్[11]
ఈజిప్ట్ ఎయిర్ నిర్ణీత సమయంలో: షర్ం ఎల్ షేక్ [12]
ఫ్లై దుబాయ్ దుబాయ్
ఫ్లై ఈజిప్ట్ నిర్ణీత సమయంలో: హర్గడ[9]
జార్జియన్ ఎయిర్‌వేస్ బిలిసి
జర్మేనియా బెర్లిన్
కరుణ్ ఎయిర్‌లైన్స్ నిర్ణీత సమయంలో: అహ్వజ్, ఇస్‌ఫహాన్
కిష్ ఎయిర్ నిర్ణీత సమయంలో: షిరాజ్, టెహరాన్
కొరియన్ ఎయిర్ నిర్ణీత సమయంలో: సియోల్
LOT పోలిష్ ఎయిర్‌లైన్స్ వార్సా[13]
మహన్ ఎయిర్ టెహరాన్
మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ బీరట్
నార్ద్‌విండ్ ఎయిర్‌లైన్స్ మినరల్నె వొడి, మాస్కో[14] సోచి
కతర్ ఎయిర్‌వేస్ దోహా
రెడ్ వింగ్స్ ఎయిర్‌లైన్స్ మాస్కో[15]
S7 ఎయిర్‌లైన్స్ మాస్కో, నొవొసిబిర్స్క్
SCAT ఎయిర్‌లైన్స్ అక్తవ్, ఆస్తానా
తబన్ ఎయిర్ నిర్ణీత సమయంలో: ఇస్‌ఫహాన్, మషద్, సరి, షిరాజ్, తబ్రిజ్
తారోం బుకారెస్ట్[16]
తుర్క్‌మెనిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఆష్గబత్,[17] ఫ్రాంక్‌ఫర్ట్[17]
ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కీవ్ - బోరిస్పిల్
నిర్ణీత సమయంలో: ఒడెస్సా
యూరల్ ఎయిర్‌లైన్స్ క్రాస్‌నోడర్, మాస్కో, ప్లాటొవ్, సెయింట్ పీటర్స్‌బర్గ్, సమర, సోచి,యెకటరిన్‌బర్గ్
యుట్‌ఎయిర్ మాస్కో[18]
నిర్ణీత సమయంలో: సర్గట్ [19]

కార్గో[మార్చు]

విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఉక్రయిన్ ఎయిర్ అలయన్స్ బిలిసి

రవాణా, గణాంకాలు[మార్చు]

సంవత్సరం 2005[20] 2006[21] 2007[21] 2008 2009[22] 2010[22] 2011[23] 2012[24] 2013[25] 2014[25] 2015[26] 2016[27] 2017
మొత్తం ప్రయాణీకుల సంఖ్య 1,111,400 1,125,698 1,387,002 1,480,000 1,447,397 1,612,016 1,600,891 1,691,815 1,691,710 2,045,058 1,879,667 2,105,540 2,448,250
వెళ్లే ప్రయాణీకుల సంఖ్య 546,000 562,825 698,614 751,310 729,835 816,866 807,953 845,700 830,000 1,019,765 944,373 1,048,153 1,218,340
వచ్చే ప్రయాణీకుల సంఖ్య 547,400 562,873 688,388 628,690 717,562 795,150 792,944 846,115 861,710 1,025,293 935,294 1,057,387 1,229,910
మొత్తం సరుకుల రవాణా (టన్నులలో) 9,119 9,276 10,004 10,774 8,400 8,800 10,014 12,251 10,361 10,345 10,123 18,269 22,324
ఎగుమతి సరుకులు(టన్నులు) 3,701 4,080 3,515 4,000 3,100 3,300 4,741 6,687 6,109 6,450 6,607 13,784 16,983
దిగుమతి సరుకులు(టన్నులు) 5,418 5,196 6,489 6,700 5,200 5,500 5,273 5,564 4,252 3,895 3,516 4,485 5,341
విమానాల రాకపోకలు 6,897 6,746 7,953 8,624 8,699 9,783 9,858 10,392 8,721 10,409 9,012 9,266 10,621

ఉపరితల రవాణా[మార్చు]

టర్మినల్ బయట అనేక రకాలైన టాక్సీ సర్వీసులు ఉన్నాయి. కానీ జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక టాక్సీ సర్వీసు ఎయిర్‌పోర్ట్ టాక్సీ పేరుతో నడుపబడుతున్నది. ఈ సర్వీసు విమానాశ్రయం నుండి ఏ వైపుకైనా, అన్ని ప్రదేశాల నుండి విమానాశ్రయానికి ప్రయాణీకులను చేరుస్తుంది.

2017లో ఎయిర్ పోర్టు నుండి యెరెవాన్ డౌన్‌టౌన్‌కు బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సదుపాయం ఉదయం 7 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు ప్రతి అరగంటకు, రాత్రి 10 గంటలనుండి ఉదయం 7 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు నడుపబడుతుంది.[28]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "EAD Basic - Error Page". Retrieved 7 June 2015.
 2. "About us - Zvartnots". Retrieved 25 February 2017.
 3. 3.0 3.1 administrator. "Airports". Archived from the original on 27 జూన్ 2015. Retrieved 29 జూన్ 2018.
 4. "Armenia's Zvartnots named best airport in CIS". PanARMENIAN.Net. Retrieved 7 June 2015.
 5. "Armats.am – Aerodrome ground Movement and Aircraft Parking Chart" (PDF). Armats.com. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2016. Retrieved 6 జనవరి 2018.
 6. Airport website – Handles any type of modern commercial aircraft Archived 10 మే 2008 at the Wayback Machine
 7. "armats". Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 7 June 2015.
 8. 8.0 8.1 One, Studio. "Ուղիղ չվերթներ Եգիպտոսից Երևան". Archived from the original on 1 అక్టోబరు 2017. Retrieved 29 September 2017.
 9. 9.0 9.1 9.2 "Ամռանն ընդառաջ մի շարք ուղղություններով ոչ կանոնավոր չվերթներ կիրականացվեն".
 10. "Brussels Airlines sets sail for Armenia in 2017".
 11. "Czech Airlines launches Prague-Yerevan-Prague regular flights".
 12. "EGYPTAIR plans Armenia charters in S18". routesonline.com. 23 February 2018. Retrieved 23 February 2018.
 13. "LOT Polish Airlines Restores 4 Cancelled Routes from Jan 2016 :: Routesonline". Airlineroute.net. Retrieved 2017-02-25.
 14. "Yerevan Armenia | airport | arrivals". Zvartnots.am. Archived from the original on 2017-02-25. Retrieved 2017-02-25.
 15. Liu, Jim (2 March 2018). "Red Wings plans Armenia launch from March 2018". Routesonline. Retrieved 2 March 2018.
 16. "Tarom files preliminary new routes info in 2018". routesonline.com. Retrieved 2018-05-23.
 17. 17.0 17.1 Liu, Jim (29 December 2017). "Turkmenistan Airlines adds Yerevan – Frankfurt from late-Dec 2017". Routesonline. Retrieved 29 December 2017.
 18. "Базовый перевозчик Внуково авиакомпания "ЮТэйр" анонсирует планы на весенне-летний сезон". Corp.vnukovo.ru. Archived from the original on 2016-07-10. Retrieved 2017-02-25.
 19. Liu, Jim (24 April 2018). "UTair adds seasonal Surgut routes from June 2018". Routesonline. Retrieved 24 April 2018.
 20. General Department of Civil Aviation of Armenia – 2005–2006 Statistics Archived 31 మే 2011 at the Wayback Machine
 21. 21.0 21.1 General Department of Civil Aviation of Armenia – 2006–2007 Statistics Archived 31 మే 2011 at the Wayback Machine
 22. 22.0 22.1 "Overall passenger transportation via Zvartnots airport reached 1.6mln in 2010". PanARMENIAN.Net. Retrieved 7 June 2015.
 23. "Zvartnots Airport serviced over 1,6 million passengers in 2011". PanARMENIAN.Net. Retrieved 7 June 2015.
 24. "Zvartnots Airport posts passenger traffic of 1,7 mln in 2012". PanARMENIAN.Net. Retrieved 7 June 2015.
 25. 25.0 25.1 administrator. "Statistics 2013-2014". Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 29 జూన్ 2018.
 26. General Department of Civil Aviation of Armenia – 2014–2015 Statistics Archived 26 జనవరి 2016 at the Wayback Machine
 27. "Վիճակագրություն". Aviation.am. Archived from the original on 26 జనవరి 2016. Retrieved 29 జూన్ 2018.
 28. "Yerevan: New Schedule for Zvartnots Airport Express Bus - Hetq - News, Articles, Investigations" (in ఇంగ్లీష్). Archived from the original on 2018-01-13. Retrieved 2018-01-13.

బయటి లింకులు[మార్చు]