ఝర్నా ధారా చౌదరి
ఝర్నా ధారా చౌదరి | |
|---|---|
ঝর্ণা ধারা চৌধুরী | |
| జననం | 1938 అక్టోబరు 15 లక్ష్మీపూర్ జిల్లా, తూర్పు బెంగాల్, బ్రిటిష్ ఇండియా |
| మరణం | 2019 జూన్ 27 (వయసు: 80) |
| వృత్తి | సామాజిక కార్యకర్త |
| పురస్కారాలు | ఎకుషే పదక్ (2015) పద్మశ్రీ పురస్కారం (2013) |
ఝర్నా ధారా చౌదరి (1938 అక్టోబరు 15 - 2019 జూన్ 27) బంగ్లాదేశ్ సామాజిక కార్యకర్త.[1][2]
ప్రారంభ జీవితం
[మార్చు]ఝర్నా ధారా చౌదరి 1938 అక్టోబరు 15న బ్రిటిష్ ఇండియా తూర్పు బెంగాల్ లక్ష్మీపూర్ జిల్లాలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ప్రోమోత్ చౌదరి, ఆశాలతా చౌదరి.[3] నోఖాలి అల్లర్ల సమయంలో వారి ఇల్లు తగలబడడంతో తన కుటుంబంతో కలిసి ఆమె అస్సాంకు వలసపోయింది.[4] అల్లర్లు ముగిసిన తర్వాత ఆమె తిరిగి వచ్చి, శాంతి మిషన్ కోసం ఈ ప్రాంతానికి వచ్చిన మహాత్మా గాంధీ నుండి ప్రేరణ పొందింది.[4]
కెరీర్
[మార్చు]1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ సమయంలో, హింసాకాండ నుండి భారతదేశానికి వెళ్ళిన సుమారు 5 వందల మంది బాలికలకు ఆమె సహాయం చేసింది.[5]
1990లో నోఖాలి జిల్లా చత్ఖిల్ ఉపజిల్లా లోని జయాగ్ గ్రామంలో గాంధీ ఆశ్రమం ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించింది. అక్కడ ఆశ్రమం ట్రస్ట్ కార్యదర్శిగా ఆమె పనిచేసింది.
2013లో, ఝర్నా ధారా చౌదరి భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నది.[6]
బంగ్లాదేశ్ లో సామాజిక సేవలకు ఆమె చేసిన కృషికి గాను రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన ఏకుషే పదక్ ను అందుకున్నది.[7]
2016లో, గాంధీ ఆశ్రమం ట్రస్ట్ క్యాంపస్ లో గాంధీ మెమోరియల్ స్కూల్ ఏర్పాటును ఆమె పర్యవేక్షించింది, దీనికి భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన గాంధీ హెరిటేజ్ సైట్స్ మిషన్ నిధులు సమకూర్చింది.[8][9]
అవార్డులు
[మార్చు]మరణం
[మార్చు]ఝర్నా ధారా చౌదరి 2019 జూన్ 27న బంగ్లాదేశ్ ఢాకాలో మరణించింది.[14] 2019 జూన్ 1న మెదడులో రక్తస్రావం కావడంతో ఆమె స్క్వేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది.[15] ఆమె చివరి కర్మలు ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో జరిగాయి.[16] ప్రజలు తమ నివాళులు అర్పించడానికి మరుసటి రోజు సెంట్రల్ షహీద్ మినార్ వద్ద ఉంచారు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ সংবাদদাতা, নিজস্ব. নোয়াখালি গাঁধী আশ্রমের সচিব ঝর্নাধারা প্রয়াত. www.anandabazar.com (in Bengali). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-02.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- 1 2 "Jharna Dhara Chowdhury". The Daily Star (in ఇంగ్లీష్). 2016-02-05. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-02.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ সংবাদদাতা, নিজস্ব. নোয়াখালি গাঁধী আশ্রমের সচিব ঝর্নাধারা প্রয়াত. www.anandabazar.com (in Bengali). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-02.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ "Jharna Dhara Chowdhury conferred Padma Shri Award". Bangladesh Business News. January 26, 2013. the original నుండి 13 June 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 19, 2015.
- ↑ "14 honoured with Ekushey Padak 2015". The Daily Star. February 9, 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: February 19, 2015.
- ↑ "Kumari Jharna Dhara Chowdhury". Jamnalal Bajaj Foundation. 2015. the original నుండి August 19, 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: October 13, 2015.
- ↑ "Gandhian activist Jharna Dhara Chowdhury passes away". Daily Sun. the original నుండి 2019-06-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-01-04.
- ↑ সংবাদদাতা, নিজস্ব. নোয়াখালি গাঁধী আশ্রমের সচিব ঝর্নাধারা প্রয়াত. www.anandabazar.com (in Bengali). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-02.
- 1 2 "Jharna Dhara Chowdhury passes away - Front Page". The Daily Observer. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-01-02.