Jump to content

ఝాన్సీ (గాయని)

వికీపీడియా నుండి

ఝాన్సీ
జననం
జాతీయతభారతీయురాలు
చదువుసేంద్రీయ రసాయన శాస్త్రంలో పీజీ
వృత్తిజానపద గాయని, రైతు, విద్యార్థిని
పేరుపడ్డదిజానపద గీతాలు, ఉద్యమ గీతాలు
తల్లిదండ్రులుసైదులు, హేమలత

ఝాన్సీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని కోమటికుంట గ్రామానికి చెందిన భారతీయ జానపద గాయని. ఉద్యమ గీతాలు, పల్లె పాటలు పాడటంలో ప్రసిద్ధురాలు. వ్యవసాయంతో పాటు సంగీతం పట్ల ఆసక్తి కనబరుస్తూ తనదైన శైలిలో జానపద గీతాలను పాడి ప్రజాదరణ పొందింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ఝాన్సీ తల్లిదండ్రులు సైదులు, హేమలత. వీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. నలుగురు సంతానంలో ఝాన్సీ చిన్న కుమార్తె. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తూ, చదువుతో పాటు వ్యవసాయాన్నీ కొనసాగించింది.[2]

విద్యాభ్యాసం

[మార్చు]

పాఠశాల దశలోనే పాటలు పాడటంలో ఆసక్తి కనబరచిన ఝాన్సీ, కార్యక్రమాల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకుంది. డిగ్రీలో 10/10 జీపీఏ సాధించి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సేంద్రీయ రసాయన శాస్త్రంలో మాస్టర్స్ చేస్తోంది. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగం సాధించడమే లక్ష్యమని చెబుతోంది.[2]

సంగీత జీవితం

[మార్చు]

మూడో తరగతి నుంచే జానపద గీతాలు, ఉద్యమ గీతాలు పాడడం ప్రారంభించింది. ఆమె పాటలు సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. బాలకార్మికులు, రైతులు, బతుకమ్మ వంటి సామాజిక అంశాలపై పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తోంది. ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ తన గానాన్ని అభినందించారని చెప్పింది ఝాన్సీ.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఝాన్సీ తన కుటుంబానికి వ్యవసాయ పనుల్లో అండగా ఉంటూనే, గానరంగంలో ముందుకు సాగుతోంది. తన తల్లిదండ్రుల కోసం తానే స్వయంగా పాటలు రాసి పాడిందని చెబుతోంది. “ఎంతటి స్థాయికి చేరినా అభిరుచులను మాత్రం వీడను” అని పేర్కొంది.[2]

మూలాలు

[మార్చు]
  1. Bharat, E. T. V. (14 ఆగస్టు 2024). "YUVA : ప్రకృతి పరవశించేలా గానం- సాగులో కన్నవాళ్లకు సాయం - ఈ జానపద గానకోకిల గాథ మీరూ తెలుసుకోవాల్సిందే - Special Story On Folk Singer". ETV Bharat News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 నవంబరు 2025.
  2. 1 2 3 4 "Special Story On Folk Singer Jhansi". నమస్తే తెలంగాణ. 31 అక్టోబరు 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 నవంబరు 2025.