ఝాబౌ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jhabua జిల్లా

झाबुआ जिला
Madhya Pradesh రాష్ట్రంలో Jhabua యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Jhabua యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
డివిజన్Indore
ముఖ్యపట్టణంJhabua
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలుRatlam
విస్తీర్ణం
 • మొత్తం3 కి.మీ2 (1,460 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1
 • సాంద్రత270/కి.మీ2 (700/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత44.45 per cent
 • లింగ నిష్పత్తి989
సగటు వార్షిక వర్షపాతం800 మి.మీ
జాలస్థలిఅధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో ఝాభౌ జిల్లా (హిందీ:झाबुआ जिला) ఒకటి. ఝాభౌ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

భౌగోళికం[మార్చు]

ఝాబౌ జిల్లా మధ్యప్రదేశ్ పశ్చిమ భాగంలో ఉంది. జిల్లా సరిహద్దులో పంచమల్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంలోని వదోదరా జిల్లా, రాజస్థాన్ రాష్ట్రంలోని బన్‌స్వారా జిల్లా, మరియు అలిరాపూర్ జిల్లా, ధార్ జిల్లా మరియు రట్లం జిల్లాలు ఉన్నాయి.[1] జిల్లా వైశాల్యం 3,782 చ.కి.మీ.జిల్లా భూభాగం ఎత్తుపల్లలుగా ఉంటుంది. వార్షిక వర్షపాతం 800 మి.మీ. జిల్లా 5 తాలూకాలు మరియు 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా (మండలాలు) విభజించబడి ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఝాబౌ జిల్లా 2008 మేలో 2 జిల్లాలుగా (ఝాభౌ మరియు అలిరాజ్పూర్) విభజించబడింది.

  • అలీరజ్పుర్ 6 బ్లాక్స్ ఉన్నాయి :- జొబత్, ఉదైగర్హ్, భబ్ర, సొందవ మరియు కత్థివద కొత్త జిల్లా, అలిరజ్పుర్.
  • జబువా జిల్లాలో 7 బ్లాకులు ఉన్నాయి :- హబూ, మెఘ్నగర్, రనపుర్, రామ, తంద్ల మరియు పెత్లవద్.
Bhil tribe girls in Jhabua district

ఆర్ధికం[మార్చు]

ఝాబౌ జిల్లా అత్యధిక కరువు బాధిత ప్రాంతంగా గుర్తుంచబడింది. ఝాబౌ జిల్లాలో నిస్సారమైన భూములు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని స్త్రీలు చక్కని వెదురు వస్తువులు, బొమ్మలు, పూసల మాలలు మరియు ఇతర వస్తువులు వంటి సంప్రదాయ వస్తులు తయారు చేస్తారు. అలాగే ఇతర గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేస్తుంటారు. పురుషులు టీర్ కంథి, ధనుర్భాణాలు వారి చిహ్నంగా ధరిస్తుంటారు. అది వారి శూరత్వం - స్వీయరక్షణకు గుర్తుగా ఉంటుంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఝాబౌ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,024,091,[3]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. మొంటనా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 440 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 285 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30.58%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 959:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 44.45%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
  • 2001 గణాంకాలను అనుసరించి (అలిరాజ్పూర్ విడిదీయబడిన తరువాత) మొత్తం జనసంఖ్యలో 91% గ్రామీణ ప్రజలున్నారు. వీరిలో 85.60% గిరిజనప్రజలు ఉండగా 3 % ప్రజలు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు.[1] అలిరాజ్పూర్ విడిదీయబడక ముందు జిల్లాలో స్త్రీ: ప్రుషుల నిష్పత్తి 990:1000. జనసాంధ్రత చ.కి.మీకి 206.

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
అనుసరించి - జనసంఖ్య 784,286
గ్రామీణ జనసంఖ్య 91%
గిరిజన ప్రజల శాతం 85.6%
ఇందులో పురుషుల సంఖ్య 396,141
స్త్రీలసంఖ్య 388,145
స్త్రీ పురుష నిష్పత్తి 960: 1000

.[6]

ప్రజలు[మార్చు]

ఝాబౌ జిల్లాలో ఆదివాసి ప్రజలు అధికంగా ఉన్నారు. అందువలన జిల్లాలో నిరక్షరాశ్యత మరియు పేదరికం అధికంగా ఉన్నాయి. జిల్లాలో 50% కంటే అధికంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. జిల్లాలో భిల్లు మరియు భిలియా ప్రజలు అధికంగా జిల్లా లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్నారు.

భాషలు[మార్చు]

జిల్లాలో భిల్లు భాషలలో ఒకటైన బరేలి రాథ్వి భాష 64,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని ఉపయోగిస్తుంటారు. [7] అలాగే భిల్లై భాష 11,50,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[8]

అక్షరాశ్యత[మార్చు]

జిల్లాలో అక్షరాస్యత 36.9%. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్షరాస్యతాపరంగా ఝాబౌ జిల్లా అత్యంత తక్కువగా ఉంది..[9]

సంస్కృతి[మార్చు]

జిల్లా కేంద్రం ఝాబౌ నుండి 8 కి.మీ దూరంలో ఉన్న దియోఝిరి గ్రామంలో పురాతన ఆలయం మరియు ఝిరి (నిరంతర ప్రవాహం ఉన్న సెలయేరు) ఉన్నాయి. సెలయేటి జలాలతో ఒక కుండం ఏర్పడింది. వైశాఖపూర్ణిమ నాడు ఈ ఆలయంలో ఉత్సవం నిర్వహిస్తారు. గ్రిగేరియన్ కేలండర్ అనుసరించి ఈ ఉత్సవం ఏప్రిల్ మాసంలో నిర్వహించబడుతుంది. జిల్లాలోని ఖతివద పెద్ద సైజు మామిడి కాయల ఉత్పత్తికి ప్రాముఖ్యత కలిగి ఉంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Jhabua". District administration. Retrieved 2010-08-20.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Montana 989,415 line feed character in |quote= at position 8 (help)
  6. "Population, decadal growth rate, sex ratio and density – States/Union territories and Districts : 2001". Table 1. Education for all in India, Source:Registrar General of India, Government of India, New Delhi. Retrieved 2010-08-12.
  7. M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
  8. M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: Extra text (link)
  9. "Seminar On Progress Of Literacy In India: What The Census 2001 Preveals Niepa, New Delhi, October 05, 2002". India’s Literacy Panorama. educationforallinindia.com. Retrieved 2010-08-17.

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] List of places in Jhabua

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఝాబౌ&oldid=1985407" నుండి వెలికితీశారు