Jump to content

ఝుమైర్

వికీపీడియా నుండి
ఝుమైర్ నృత్య ప్రదర్శన
ఆస్సాం టీ-గిరిజనులు ప్రదర్శిస్తున్న ఝుమైర్ నృత్యం
శైలిజానపద నృత్యం
కాల సంతకంవృత్తాకార సమూహ ఆకృతి
వాయిద్యంఢోల్, మండర్, నగారా, వేణువు, పాయెల్
మూలంచోటా నాగ్‌పూర్ పీఠభూమి

ఝుమైర్ లేదా ఝుమర్ భారతదేశంలోని రాష్ట్రాలు అయిన ఝార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆస్సాం, బీహార్ , పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఒక జానపద నృత్యం.[1][2][3][4] ఇది సదాన్ ప్రజలు అనే ఇండో-ఆర్యన్ జాతి సమూహానికి చెందిన సాంప్రదాయ నృత్యం, ముఖ్యంగా చోటా నాగ్‌పూర్ పీఠభూమి ప్రాంతంలో ప్రాచుర్యం పొందింది.[5][6][7] ఇది ఆదివాసీ సమాజాలచే కూడా ప్రదర్శించబడుతుంది , ప్రధానంగా పంట కోత కాలంతో సంబంధం కలిగి ఉంటుంది.[8]

ఝుమైర్ నృత్యంలో ఉపయోగించే వాద్యపరికరాలలో మండర్, ఢోల్, నగారా , బాంసురి ఉన్నాయి.[5] ఈ నృత్యంలో కళాకారులు ఒక వరుసలో నిలబడి చేతులు పట్టుకుని, జంట పద్యాలను పాడుతూ, శరీరాన్ని ఊగిస్తూ, చేతులు చరుస్తూ, కొన్నిసార్లు సమయానుసారం దూకుతూ ప్రదర్శిస్తారు.[9]

ఇది పంటకాలం, గిరిజన వర్గాల ఆనంద కరమైన జీవితానికి సంబంధించిన వేడుక.ఈ నృత్య రూపాన్ని మానవ హారం నిర్మాణంగా ప్రదర్శిస్తారు, నృత్యకారులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వృత్తాకారంలో కదులుతారు.ధోల్(డోలు), కర్తాల్(కర్ తాళ్/ చిడతలు), బాన్సురి(పిల్లన గ్రోవి), సాంగి వంటి వాయిద్యాల ద్వారా రూపొందించబడిన శ్రావ్యమైన రాగాలతో ఈ నృత్యం ఉంటుంది.ఝుమైర్‌ను స్త్రీలు కూడా చేస్తారు, స్త్రీలు చేసినప్పుడు దానిని జననీ ఝుమైర్ అని పిలుస్తారు.ఈ నృత్యం యొక్క యుద్ధ రూపాన్ని మర్దన జుమైర్ అంటారు.[10]ఈనృత్య శైలిలో ప్రదర్శకులు వరుసగా నిలబడి చేతులు పట్టుకోవడం, ద్విపదలు పాడడం, వారి శరీరాలను ఊపడం, చేతులతో చప్పట్లు కొట్టడం(కర తాళ ధ్వనులు), అప్పుడప్పుడు కుప్పిచ్చి గెంతడంను వంటివి ఉంటాయి.[11]

రకాలు

[మార్చు]

ఝుమైర్ / ఝుమర్ నృత్యం ప్రాంతానుసారం భిన్న శైలుల్లో ప్రదర్శించబడుతుంది.[12][5] చోటా నాగ్‌పూర్ ప్రాంతంలో ఝుమర్‌కు అనేక రకాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి:

ప్రముఖ కళాకారులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Jhumar of the West Bengal highlands". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2022-03-25.
  2. "Jhumur Song: a Geo – Environmental Analysis - Ignited Minds Journals". ignited.in (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-10-07. Retrieved 2022-03-25.
  3. "Jhumur and Nachni in the Folk Songs of Purulia". hdl:10603/300904.
  4. Sinha, Manik Lal (1974). Jhumar of the West Bengal highlands. Sangeet Natak Akademi, New Delhi.
  5. 5.0 5.1 5.2 "Out of the Dark". democratic world.
  6. "talk on nagpuri folk music at ignca". daily Pioneer. Archived from the original on 2019-03-28. Retrieved 2019-02-19.
  7. Manish Ranjan (2022). JHARKHAND GENERAL KNOWLEDGE 2021. Prabhat Prakashan. ISBN 9789354883002.
  8. "अब नहीं दिखती फाग और झूमर नृत्य, खो रही है अपनी धाक". prabhatkhabar. 29 March 2021. Retrieved 6 April 2022.
  9. Gupta, Shobhna (2002). Dances of India (in ఇంగ్లీష్). Har-Anand Publications. ISBN 978-81-241-0866-6.
  10. "Folk Dances of jharkhand". testbook.com. Retrieved 2024-02-17.
  11. Gupta, Shobhna (2002). Dances of India (in ఇంగ్లీష్). Har-Anand Publications. ISBN 978-81-241-0866-6.
  12. Stephen Blum; Philip Vilas Bohlman; Daniel M. Neuman (1993). Ethnomusicology and Modern Music History. University of Illinois Press. pp. 224–. ISBN 978-0-252-06343-5.
  13. "करम महोत्सव में बोले विधायक लंबोदर महतो, भाषा व संस्कृति है झारखंड की मूल पहचान". prabhatkhabar. 17 September 2021. Retrieved 6 April 2022.
  14. "मनसा पूजा पर देवगांव में झूमर संध्या का आयोजन, संतोष व उर्मिला ने समां बांधा, झूमे दर्शक". lagatar. 20 September 2021. Archived from the original on 7 October 2022. Retrieved 6 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=ఝుమైర్&oldid=4816533" నుండి వెలికితీశారు