ఝులన్ గోస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఝులన్ గోస్వామి
Jhulan Goswami (10 March 2009, Sydney).jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు ఝులన్ నిషిత్ గోస్వామి
జననం (1982-11-25) 25 November 1982 (age 40)
చక్దాహా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఇతర పేర్లు బాబుల్, చక్దాహా ఎక్స్‌ప్రెస్‌
ఎత్తు 5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగ్ శైలి కుడి చేతి బ్యాట్టింగ్
బౌలింగ్ శైలి కుడి చేతి మీడియం ఫాస్ట్
పాత్ర బౌలర్
International information
టెస్టు అరంగ్రేటం (cap 52) 14 జనవరి 2002 v ఇంగ్లాండ్
చివరి టెస్టు 30 సెప్టెంబర్ 2021 v ఆస్ట్రేలియా
ODI debut (cap 61) 6 జనవరి 2002 v ఇంగ్లాండ్
చివరి వన్డే 19 మార్చి 2022 v ఆస్ట్రేలియా
ఒ.డి.ఐ. షర్టు నెం. 25
టి20ఐ లో ప్రవేశం(cap 3) 5 ఆగష్టు 2006 v ఇంగ్లాండ్
చివరి టి20ఐ 10 జూన్ 2018 v బాంగ్లాదేశ్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
బెంగాల్ మహిళ క్రికెట్ జట్టు
2018 - ప్రస్తుతం ట్రయిల్ బ్లె్జర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళ టెస్ట్ మ్యాచ్ మహిళ వన్డే మహిళ టీ20
మ్యాచులు 12 199 68
సాధించిన పరుగులు 291 1226 405
బ్యాటింగ్ సగటు 24.25 14.77 10.94
100 పరుగులు/50 పరుగులు 0/2 0/1 0/0
ఉత్తమ స్కోరు 69 57 37 నాటౌట్
వేసిన బాల్స్ 2,266 9,741 1,351
వికెట్లు 44 250 56
బౌలింగ్ సగటు 17.36 21.83 21.94
ఇన్నింగ్స్ లో వికెట్లు 3 2 1
మ్యాచులో 10 వికెట్లు 1 0 0
ఉత్తమ బౌలింగు 5/25 6/31 5/11
క్యాచులు/స్టంపింగులు 5/– 68/– 23/–
Source: ESPNcricinfo, 19 మార్చి 2022 {{{year}}}

ఝులన్‌ గోస్వామి భారత మహిళా క్రికెట జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆమె మహిళ క్రికెట్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన మొదటి మహిళా బౌలర్‌గా[1] మరియు భారత్‌ తరపున 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.[2] ఝులన్‌ గోస్వామి జీవితం ఆధారంగా 'చక్దాహా ఎక్స్‌ప్రెస్‌' పేరుతో[3] అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది.[4]

రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ నుండి 22 మార్చి 2012న పద్మశ్రీ పురస్కారం అందుకుంటూ

క్రికెట్ కెరీర్[మార్చు]

జులన్ గోస్వామి పంతొమ్మిదేళ్ల వయసున్నప్పుడు బెంగాల్ క్రికెట్ జట్టుకి ఎంపికైంది. ఆమె ఆ తర్వాత ఈస్ట్ జోన్, ఎయిర్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించింది. ఈస్టన్కి, ఎయిర్ ఇండియాకి మధ్య జరిగిన మ్యాచ్లో ఆమె పది ఓవర్లలో పదమూడు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి, భారత సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఝులన్ గోస్వామి 2002లో భారత జాతీయ జట్టుకి ఎంపికైన ఇంగ్లండ్ తో తన తొలి మ్యాచ్ ఆడింది. ఆమె 2006లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పది వికెట్లు తీసి ఒక మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించి, 2011లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 31 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.

జులాన్ గోస్వామి మహిళల క్రికెట్‌లో 300కి పైగా వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్. ఆమె అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మోతంగా 350 వికెట్లు తీసింది. వన్డే క్రికెట్‌లో 250 వికెట్లు తీసిన ప్రపంచంలోనే ఏకైక బౌలర్.[5] ఆమె మొత్తం 199 వన్డేల్లో 250 వికెట్లు, 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టింది.

అవార్డులు[మార్చు]

 • 2007 – 'ఐసీసీ విమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’
 • కెప్టెన్ - భారత మహిళా క్రికెట్ జట్టు (2008–2011)
 • 2010 – అర్జున అవార్డు
 • 2012 – పద్మశ్రీ పురస్కారం[6][7]

మూలాలు[మార్చు]

 1. Sakshi (12 March 2022). "చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్‌". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
 2. TV9 Telugu (19 March 2022). "ఝులన్ గోస్వామి మరో రికార్డు.. ఆ లిస్టులో ప్రపంచంలోనే తొలి బౌలర్‌." Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
 3. Sakshi (19 September 2017). "వెండితెరపై మహిళా క్రికెటర్‌ బయోపిక్‌". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
 4. Andhra Jyothy (13 January 2020). "ప్రముఖ మహిళా క్రికెటర్ పాత్రలో కోహ్లీ భార్య". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
 5. Sakshi (19 March 2022). "టీమిండియా బౌలర్‌ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.
 6. "Padma Awards". pib. 25 January 2012. Retrieved 31 January 2013.
 7. Eenadu (16 March 2022). "సరిలేరు.. నీకెవ్వరూ". Archived from the original on 19 March 2022. Retrieved 19 March 2022.