Jump to content

టకార్ మార్డే

వికీపీడియా నుండి
టకార్ మార్డే

పదవీ కాలం
1999 – 2014
ముందు టకార్ డోని
తరువాత పక్ంగా బాగే
నియోజకవర్గం డంపోరిజో

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం కర్దు మార్డే[1]
వృత్తి రాజకీయ నాయకుడు

టకార్ మార్డే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు డంపోరిజో శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హోం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశాడు.[2][3]

ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక బోర్డు డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

టకార్ మార్డే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 శాసనసభ ఎన్నికలలో డంపోరిజో శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అరుణాచల్ కాంగ్రెస్ అభ్యర్థి టకార్ డోని పై 1,892 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి టకార్ డోనిపై 155 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

టకార్ మార్డే 2009 శాసనసభ ఎన్నికలలో డంపోరిజో శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లోంపాక్ పాక్సోక్ పై 5,758 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పక్ంగా బాగే చేతిలో 1,357 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha polls: Residence of Congress candidate in Arunachal Pradesh gutted in fire". The Economic Times. 17 April 2014. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  2. "Former Arunachal minister arrested for obstructing traffic police". Arunachal24. 6 December 2017. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  3. "Four days on, Arunachal Pradesh CM Dorjee Khandu still missing" (in ఇంగ్లీష్). India Today. 3 May 2011. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  4. "16 Arunachal ministers, Parliamentary secretaries lose in assembly polls". The Economic Times. 17 May 2014. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.