టాక్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాక్సీ
దర్శకత్వంహరీష్ సజ్జా
నిర్మాతహరిత సజ్జా
తారాగణంవసంత్ సమీర్ పిన్నమరాజు, అల్మాస్ మోటివాలా,సూర్య శ్రీనివాస్
ఛాయాగ్రహణంఉరుకుండా రెడ్డి
కూర్పుటి.సి.ప్రసన్న
సంగీతంమార్క్.కే.రాబిన్
నిర్మాణ
సంస్థ
హెచ్ అండ్ హెచ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2023 మార్చి 10
దేశం భారతదేశం
భాషతెలుగు

టాక్సీ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. హెచ్ అండ్ హెచ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జా నిర్మించిన ఈ సినిమాకు హరీష్ సజ్జా దర్శకత్వం వహించాడు. వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సినిమాను 2023 మార్చి 10న విడుదలైంది.[1]

కథ[మార్చు]

ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) స్నేహితులు, సన్నిహితులు నుంచి అప్పులు చేసి తెచ్చి మరీ తన సంస్దను డెవలప్ చేస్తుంటాడు కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటం, చివరకు అప్పులపాలవుతాడు.ఈ క్రమంలో ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు), ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటారు. అసలు వీళ్లిద్దరని టార్గెట్ చేయటానికి కారణం ఏమిటి ? ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? చివరకు ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

 • వసంత్ సమీర్ పిన్నమరాజు
 • అల్మాస్ మోటివాలా
 • సూర్య శ్రీనివాస్
 • సౌమ్య మీనన్
 • ప్రవీణ్ యండమూరి
 • సద్దాం హుస్సేన్
 • నవీన్ పండిత

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
 • నిర్మాత: హరిత సజ్జా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్ సజ్జా
 • సంగీతం: మార్క్.కే.రాబిన్[3]
 • సినిమాటోగ్రఫీ: ఉరుకుండా రెడ్డి
 • ఎడిటర్: టి.సి.ప్రసన్న
 • ఫైట్స్: బి.జె. శ్రీధర్
 • పాటలు: కృష్ణకాంత్
 • సహ నిర్మాత: బిక్కి విజయ్ కుమార్

మూలాలు[మార్చు]

 1. Eenadu (10 March 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
 2. Sakshi (10 March 2023). "సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'టాక్సీ' రివ్యూ". Retrieved 11 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 3. Sakshi (12 November 2021). "సిద్‌ శ్రీరామ్‌ పాడిన వేవేల తారలే.. సాంగ్‌ విన్నారా?". Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=టాక్సీ&oldid=3858598" నుండి వెలికితీశారు