టాటా బిర్లా మధ్యలో లైలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాటా బిర్లా మధ్యలో లైలా
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
రచనఎస్. ఎస్. పి యూనిట్ (కథ),
బ్రహ్మం (మాటలు)
నిర్మాతబెక్కెం వేణుగోపాల్,
సోమా విజయ్ ప్రకాష్ (సమర్పణ)
నటవర్గంశివాజీ, లయ
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీలు
2006 అక్టోబరు 13 (2006-10-13)
నిడివి
140 నిమిషాలు
భాషతెలుగు
బడ్జెట్10 కోట్లు

టాటా బిర్లా మధ్యలో లైలా 2006లో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో విడుదలైన హాస్య చిత్రం.[1] ఇందులో శివాజీ, లయ, కృష్ణ భగవాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతాన్నందించింది. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.

కథ[మార్చు]

మామా అల్లుళ్ళైన టాటా బిర్లాలు ఇద్దరూ తోడుదొంగలు. ఇద్దరూ కలిసి ఓ సహకార బ్యాంకులో దొంగతనం చేస్తారు. కానీ అవి చెల్లని నోట్లని తెలుస్తుంది. వాటిని తీసుకుని దూరంగా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పారేద్దామని వెళతారు. అక్కడ ఓ కాంట్రాక్టు కిల్లర్ ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంటాడు. పొరపాటున అతనిమీద రాయి దొల్లి స్పృహ కోల్పోతాడు. టాటా అతని దగ్గరున్న ఫోన్ తీసుకుని మాట్లాడితే అవతలి కంఠం వాళ్ళు చెప్పిన పని చేస్తే ముప్ఫై లక్షలు డబ్బు ఇస్తామని చెబుతారు. వాళ్ళు ఆ కిల్లర్ ని ఇంట్లో బంధిస్తారు.

తారాగణం[మార్చు]

శ్రీనివాసరెడ్డి

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "టాటా బిర్లా మధ్యలో లైలా సినిమా సమీక్ష". indiaglitz.com. India Glitz. 12 October 2006. Retrieved 27 June 2018.

బయటి లంకెలు[మార్చు]