టాప్ హీరో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టాప్ హీరో
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం బాలకృష్ణ,
సౌందర్య
సంగీతం ఎస్. వి. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ శ్రీ చిత్ర క్రియేషన్స్
భాష తెలుగు

టాప్ హీరో 1994 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో బాలకృష్ణ, సౌందర్య నాయకా నాయికలుగా నటించారు.

కథ ప్రారంభంలోనే ఒక శాడిస్టు పిల్లలని బంధించి తన కోరికలు నెరవేర్చమంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటాడు. టాప్ హీరోగా పిలవబడే బాలు అతన్ని తెలివిగా పోలీసులకు పట్టిస్తాడు. జలరాక్షసుడు అనే వ్యక్తి మధుసూదన రావు ఇంట్లో గుమాస్తా గా పనిచేసే గుర్నాధం ని ఏవో టేపుల గురించి అడుగుతుంటాడు. కానీ మధుసూదన రావు మతిస్థిమితం కోల్పోయి ఉంటాడు. మదుసూధన రావు భార్య రోహిణి. రోహిణి తన తమ్ముడు వీరదాసు ఒకసారి ఏదో నేరం మీద జైలుకు పంపించి ఉంటుంది. అతడు తిరిగొచ్చి రోహిణి కుటుంబాన్ని నాశనం చేసి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు.

రోహిణి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం బాలు సహాయం కోరుతుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుని అనాథయైన బాలుని ఆమె ఆదుకుని ఉంటుంది. ఆమె అసహాయతను అర్థం చేసుకున్న బాలు ఆ కుటుంబంలోకి పెద్ద కొడుకుగా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మధుసూదనరావు కూడా ఒకసారి బాలు నిర్లక్ష్యం వల్లనే ఒక ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయాడని తెలుస్తుంది. కానీ రోహిణి మాత్రం ఆయన మేడ మీద నుంచి కిందపడిపోయి మతిస్థిమితం కోల్పోయాడని చెబుతుంది. ఆమె ఎందుకు అలా అబద్ధం చెబుతుందో తెలుసుకోవాలనుకుంటాడు బాలు. నెమ్మదిగా ఇంట్లో వాళ్ళందరినీ సరైన దారిలో పెడతాడు బాలు. జల రాక్షసుడు గతంలో ఒక పోలీసు ఆఫీసరును హత్య చేయడం మధుసూదన రావు చూస్తాడు. అతన్నుంచి ఆ ఫోటోలు తీసుకోవడం కోసం లారీ గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే మధుసూదన రావు ఆ ఫోటో రీలు ఎక్కడో దాచేస్తాడు. బాలు సహాయంతో ప్రాణాలతో బయటపడతాడు. కానీ జలరాక్షసుడు అతనికి తెలివి వస్తే ఫోటోలు సంపాదించి ఆ తర్వాత మధుసూదనరావును చంపేస్తానని రోహిణిని బెదిరిస్తాడు. దాంతో ఆమె అతనికి తెలివి రానీయకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటుంది. బాలు రోహిణికి నచ్చజెప్పి మంచి మందులు వాడి అతనికి పిచ్చి తగ్గేలా చేస్తాడు. జలరాక్షసుడికి ఈ సంగతి తెలిసి మధుసూదనరావును అపహరించాలని చూస్తాడు. చివరకు బాలు అతడి ఆట కట్టించి మధుసూదనరావును కాపాడటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
1. బీడీలు తాగండి బాబులు సిరి వెన్నెల ఎస్వీ. కృష్ణారెడ్డి బాలు, చిత్ర
2. భామా నీ చీర కట్టు చూపులన్ని జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎస్వీ. కృష్ణారెడ్డి బాలు, చిత్ర
3. జాము రాతిరి కాసుకో జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎస్వీ. కృష్ణారెడ్డి బాలు, చిత్ర
4. హేయ్ ముద్దు పాపా ఓ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎస్వీ. కృష్ణారెడ్డి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
5. సామజవరగమన హేయ్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎస్వీ. కృష్ణారెడ్డి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
ఒక్కసారి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.వి.కృష్ణారెడ్డి ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "టాప్ హీరో తెలుగు సినిమా". teluguone.com. Retrieved 19 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=టాప్_హీరో&oldid=4031801" నుండి వెలికితీశారు