టామ్ హాంక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టామ్ హాంక్స్
2019 లో టామ్ హాంక్స్
జననం
థామస్ జెఫ్రీ హాంక్స్

(1956-07-09) 1956 జూలై 9 (వయసు 67)
కాంకార్డ్, కాలిఫోర్నియా, అమెరికా
పౌరసత్వం
  • అమెరికా
  • గ్రీస్[1]
విద్య
  • షాబాట్ కాలేజ్
  • కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ, శాక్రమెంటో
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • సమంతా లూయిస్
    (m. 1978; div. 1987)
  • రీటా విల్సన్
    (m. 1988)
పిల్లలు4

టామ్ హాంక్స్ అని పిలిచే థామస్ జెఫ్రీ హాంక్స్ (జ. 1956 జులై 9) ఒక అమెరికన్ నటుడు. హాస్య, నాటకీయత తో కూడిన పాత్రలకు పేరు గాంచాడు. ఈయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నటుడు. ఈయనను అమెరికా సాంస్కృతిక రాయబారిగా పరిగణిస్తారు.[2] హాంక్స్ సినిమాలు అమెరికాలో 4.9 బిలియన్ డాలర్లు, ప్రపంచ వ్యాప్తంగా 9.96 బిలియన్ డాలర్లు ఆర్జించాయి.,[3] ఉత్తర అమెరికాలో ఎక్కువ వసూళ్ళు సాధించిన వారిలో ఈయనది నాలుగో స్థానం.[4] ఆయనకు చాలా పురస్కారాలు, గౌరవాలు దక్కాయి. 2002 లో ఆయనకు అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (AFI) జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. 2014 లో కెన్నడీ సెంటర్ ఆనర్, 2016 లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం, ఫ్రెంచి లీజియన్ ఆఫ్ ఆనర్ పురస్కారాలు ఇందులో ముఖ్యమైనవి.[5][6] 2020 లో గోల్డెన్ గ్లోబ్ సెసిల్ బి. డిమిల్లే అవార్డు అందుకున్నాడు.[7]

హాంక్స్ వరసగా వచ్చిన హాస్యచిత్రాలలో ప్రధాన పాత్రధారినా నటించి మంచి గుర్తింపు పొందాడు. స్ప్లాష్ (1984), ది మనీ పిట్, బిగ్, ఎ లీగ్ ఆఫ్ దెయిర్ ఓన్ మొదలైనవి అతనికి పేరు తెచ్చిన చిత్రాలు. 1993 లో వచ్చిన ఫిలడెల్ఫియా చిత్రంలో గే లాయరుగా నటించినందుకు, 1994 లో వచ్చిన ఫారెస్ట్ గంప్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించినందుకుగాను వరసగా రెండు సంవత్సరాలు ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.[8] హాంక్స్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో కలిసి అయిదు చిత్రాలకు పనిచేశాడు. అవి సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ (1998), క్యాచ్ మి ఇఫ్ యు కెన్ (2002), ది టర్మినల్ (2004), బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ (2015), ద పోస్ట్ (2017). హాంక్స్ ఎక్కువగా రాన్ హోవర్డ్, నోరా ఎఫ్రాన్, రాబర్ట్ జెమెకిస్ తో సినిమాలు చేశాడు.

హాంక్స్ నటించిన వాటిలో స్లీప్‌లెస్ ఇన్ సియాటిల్ (1993), యు హావ్ గాట్ మెయిల్ (1998) లాంటి రొమాంటిక్ కామెడీ చిత్రాలు, అపోలో 13 (1995), ద గ్రీన్ మైల్ (1999), కాస్ట్ అవే (2000), రోడ్ టు పర్డిషన్ (2002), క్లౌడ్ అట్లాస్ (2012) లాంటి డ్రామా చిత్రాలు, చార్లీ విల్సన్ వార్ (2007), కెప్టెన్ ఫిలిప్స్ (2013), సేవింగ్ మిస్టర్ బ్యాంక్స్ (2013), సల్లీ (2016), ఎ బ్యూటిఫుల్ డే ఇన్ ద నెయిబర్‌హుడ్ (2019), న్యూస్ ఆఫ్ ద వరల్డ్ (2020), ఎల్విస్ (2022) లాంటి జీవిత చరిత్ర సినిమాలు ఉన్నాయి.

టెలివిజన్ రంగంలో ఆయన నిర్మించిన లిమిటెడ్ సిరీస్, టివి చిత్రాలకు గాను ఏడు ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకున్నాడు. వీటిలో ఫ్రం ద ఎర్త్ టు ద మూన్ (1998), బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ (2001), జాన్ ఆడమ్స్ (2008), గేం చేంజ్ (2012) ప్రధానమైనవి. 2013 లో నోరా ఎఫ్రాన్ రూపొందించిన లక్కీ గై అనే నాటకానికి గాను నాటకరంగ ఉత్తమ నటుడిగా టోనీ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. "PM meets Tom Hanks, now a Greek citizen". Ekathimerini. July 26, 2020.
  2. Phillips, Kendall R. (2004). Framing Public Memory. University of Alabama Press. p. 214. ISBN 9780817313890.
  3. "Tom Hanks Movie Box Office Results". Box Office Mojo. Retrieved January 25, 2019.
  4. Lisa, Andrew (October 22, 2020). "50 Highest-Grossing Actors of All Time". Yahoo! Finance. Retrieved March 23, 2021.
  5. "President Obama Names Recipients of the Presidential Medal of Freedom". whitehouse.gov. November 16, 2016. Retrieved November 16, 2016 – via National Archives.
  6. Mikelbank, Peter (May 17, 2016). "Tom Hanks to Receive France's Highest Honor for His Work Highlighting World War II". People. Retrieved January 6, 2017.
  7. "Tom Hanks Injects Class Into Golden Globes With Cecil B. DeMille Speech, Extolling Film Craft And 'Love Boat'". Deadline Hollywood. January 6, 2020. Retrieved January 22, 2023.
  8. Weiner, Rex (March 28, 1995). "Tom Hanks Joins Back-to-Back Oscar Elite". Variety. Retrieved June 22, 2017.