టికు తల్సానియా
టికు తల్సానియా | |
|---|---|
| జననం | 1954 జూన్ 7 బొంబాయి , బొంబాయి రాష్ట్రం , భారతదేశం |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1976–ప్రస్తుతం |
| ఎత్తు | 168 cm (5 ft 6 in) |
| భాగస్వామి | దీప్తి తల్సానియా |
| పిల్లలు | 2 |
టికు తల్సానియా (జననం 7 జూన్ 1954) భారతదేశానికి చెందిన సినిమా నటుడు.[1] ఆయన 1984లో యే జో హై జిందగీతో టెలివిజన్ లో, 1986లో 'ప్యార్ కే దో పాల్ సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించి అనంతరం 'హమ్ హై రహీ ప్యార్ కే' (1993), 'అందాజ్ అప్నా అప్నా' (1994), 'కూలీ నం. 1' (1995), 'రాజా హిందుస్తానీ' (1996), 'జుడ్వా' (1997), 'బడే మియాన్ చోటే మియాన్' (1998), 'రాజు చాచా' (2000), 'హంగామా' (2003), 'ధమాల్' (2007) లాంటి హిట్ సినిమాలో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]
టికు తల్సానియా చివరిగా 2024లో 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' నటించాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]టికు తల్సానియా దీప్తిని వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు సంగీత దర్శకుడు రోహన్ తల్సానియా, కుమార్తె నటి శిఖా తల్సానియా ఉన్నారు.[4][5]
నటన జీవితం
[మార్చు]టెలివిజన్
[మార్చు]టికు తల్సానియా 1984లో యే జో హై జిందగీతో టెలివిజన్ సీరియల్స్‌లో నటించడం ప్రారంభించి ఆ తర్వాత 1990లలో యే దునియన్ గజాబ్ కీ , జమానా బాదల్ గయా, ఏక్ సే బద్ కర్ ఏక్ లాంటి హిట్ టీవీ షోలలో కనిపించాడు.
సినిమాలు
[మార్చు]టికు తల్సానియా 1986లో రాజీవ్ మెహ్రా దర్శకత్వం వహించిన 'ప్యార్ కే దో పాల్ సినిమాతో తన బాలీవుడ్ కెరీర్‌ని ప్రారంభించి దిల్ హై కే మంత నహీన్ , ఉమర్ 55 కి దిల్ బచ్‌పన్ కా , బోల్ రాధా బోల్ , అందాజ్ అప్నా అప్నా, మిస్టర్ లాంటి సినిమాల్లో హాస్యనటుడిగా తన పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ సినిమాలో తన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]ప్రధాన వ్యాసం: టికు తల్సానియా ఫిల్మోగ్రఫీ
మూలాలు
[మార్చు]- ↑ "Tiku Talsania: I am never tired of acting". The Times of India. 22 January 2015. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Tiku Talsania's life beyond the arc lights: Biking, adventure sports and more" (in ఇంగ్లీష్). The Indian Express. 10 June 2021. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Veteran Hindi actor Tiku Talsania suffers heart attack, critical: reports" (in Indian English). The Hindu. 11 January 2025. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Hindi cinema has given me more than I expected: Shikha Talsania" (in ఇంగ్లీష్). The Hans India. 15 September 2021. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ "Shikha Talsania on nepotism: Initially no one knew I was Tiku Talsania's daughter and he made no calls for me" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 6 October 2020. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.