Jump to content

టిగ్రాన్ కజ్మల్యాన్

వికీపీడియా నుండి
టిగ్రాన్ కజ్మల్యాన్
జననం (1963-04-08) 1963 ఏప్రిల్ 8 (వయసు 61)
వృత్తిచిత్ర దర్శకుడు, కథా రచయిత, ఆర్ట్ డైరక్టరు, ప్రొడక్షన్ డిజైనర్

టిగ్రాన్ కజ్మల్యాన్ (క్సమల్యాన్ అని కూడా అంటారు) ఒక స్యతంత్రమైన ఆర్మేనియన్ చిత్రనిర్మాత, రచయిత, నిర్మాత.

విద్య

[మార్చు]
  • 1979-1984 - యెరెవాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం, ఫిలాలజీ డిపర్టుమెంటు
  • 1990-1992 - మాస్కో హైయష్ట్ కోర్సెస్ ఫర్ ఫిలిం డైరెక్టర్స్, రష్యా
  • 1994, 1998 - అంతర్జాతీయ రచన కోర్సులు, రాయిటర్స్, బి.బి.సి., లండన్, యు.కె.

రాజకీయ, సామాజిక చరిత్ర

[మార్చు]

1988-1990 మధ్యలో అర్మేనియాతో కార్బాగ్ ఏకీకరణం కోసం ఖార్బాగ్ జాతీయ విముక్తి ఉద్యమంలో పాల్గొన్నారు. 1991-1993 మధ్య అతను ఆర్మేనియా, అంతర్జాతీయ మీడియాలకు యుద్ధ కరస్పాండెంట్ గా నగర్నోలో పనిచేశారు. అలాగే కె.ఎన్.ఆర్ సుప్రీం కౌన్సిల్ జెయోర్గీ పెతట్రోస్యాన్ కు అసిస్టెంటు చైర్మనుగా ఉన్నారు. 1993-1996 వరకు అమెరికాలోని ఆర్మేనియా శాసనసభలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా పనిచేశారు. ఇది వాషింగ్టన్ డి.సి. లోని ఆర్మేనియన్ డయాస్పోరా సమూహం. ఆర్మేనియాలోని యు.డి.ఎన్.పి కు 1997-1998లో కజ్మల్యాన్ ను డిప్యూటీ డైరెక్టర్ గా నియమించారు. యెరెవాన్ సినిమా స్టూడియో మూసివేతకు ముందు 1998-2005 లో జనరల్ మేనేజరుగా పనిచేశారు. .2009 లోజిరియార్ సెఫిలియాన్, అలెగ్జాండర్ యెనికోమిషియాల్ లతో కలిసి సర్దరాపాట్ ఉద్యమాన్ని లేవనెత్తారు, దానికి తర్వాత ప్రిపార్లమెంటుగా నామకరణం.

2012 లో ప్రారంభమైన మాష్టాట్స్ పార్కు ఉద్యమంలోని ముఖ్యమైన నాయకులలో కిజ్మల్యాన్ ఒకరు. 2014లో ఉక్రేనియన్ సంక్షోభం, ప్రాంతీయ అభివృద్ధిపై రష్యా తన సహకారాన్ని విడవడంతో కిజ్మల్యాన్ ప్రెపార్లమెంటు ఉద్యమం నుండి తప్పించుకున్నారు. పుతిన్, అతని కె.జి.బి పాలనలో ఆర్మేనియా హతమవడంతో పాటు వాళ్ళ కాలనీగా మార్చుకున్నారని కిజ్మల్యాన్ ఒక వ్యతిరేక రాడికల్ క్రెమ్లిన్ లో చెప్పారు. 2016 లో ప్రో-వెస్ట్రన్ రాజకీయ ఉద్యమైన స్వాతంతంలో అతను పరూర్య్ హాయ్రిక్యాన్ తో చేరారు. అతను 2012, 2014, 2015 లో జరిగిన ర్యాలీలలో పోలీసుకతో అసభ్యంగా ప్రవర్తించడం వలన, అతనిపై మూడు కేసులు ఉన్నవి.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం ఆంగ్ల శీర్షిక ఫార్మాటు అవార్డులు
1991 ది లెస్సన్ 35 మి.మి, బ్లా/వై, 10 ని, ఫీచర్ 1993లో జరిగిన మొదటి ఆర్మేనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక బహుమతి
1996 బ్లాక్&వైట్ 35 మి.మి, బ్లా/వై, 30 ని, ఫీచర్
1990 టర్కీలో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ అంతళ్య అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్ర్శించారు; రెగెంస్ బర్గర్ చిన్న చిత్రాల ఫెస్టివల్ లో రెండవ బహుమతి.
1998 సాకర్ ఆఫ్ 1973 బీటా-ఎస్.పి., 24 ని, డాక్యుమెంటరీ
1998 డెత్ ఆఫ్ కింగ్
బీటా-ఎస్.పి., 24 ని, డాక్యుమెంటరీ 2000లో జరిగిన యాల్టా అంతర్జాతీయటి.వి. ఫెస్టివల్ లో ప్రత్యేక జ్యూరీ బహుమతి.
2000 పైర్లెక్విన్ ఆర్ లైటర్ దెన్ ఎయిర్ 35 మి.మి, 100 ని, కలరు, బ్లా/వై, ఫీచర్  2001లో జరిగిన ఇస్తాంబుల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జ్యూరీ ప్రత్యేక బహుమతి;
2001లో రష్యాలో జరిగిన "కినిషాక్" ఫిలిం ఫెస్టివల్ లో "ఉత్తమ నటుడు" పురస్కారం; మిన్స్క్, బెలారస్, 2001లో జరిగిన "లిస్తాపాడ్" ఫిలిం ఫెస్టివల్ లో మాజిక్ మూవీ ప్రైజ్.
2001 వెల్వెట్ రివల్యూషన్ # 88 బీటా-ఎన్.పి, 22 ని, డాక్యుమెంటరీ
2001 5165 బీటా-ఎన్.పి, 27 ని, డాక్యుమెంటరీ
2001 సిస్టర్ ఆఫ్ మెర్సీ బీటా-ఎన్.పి, 27 ని, డాక్యుమెంటరీ
2001 వన్స్ అప్-ఆన్ ఏ టైం ఇన్ ఆర్మేనియా బీటా-ఎన్.పి,44 ని, సంగీత ఫీచర్
2002 మరీనా వి./ వజైనా ఎం. డి.వి.డి, 15 ని యానిమేషన్
2003 33 మినిట్స్ అబౌట్ పెలేషియాన్ డి.వి.డి, 33 ని, డాక్యుమెంటరీ
2003 రూబెన్ హాక్వెర్ద్యాన్, ద పోస్ట్మాన్ డి.వి.డి, 58 ని, డాక్యుమెంటరీ
2004 అరామ్ ఖచాతుర్యాన్ సెంచిరీ డి.వి.డి, 35 ని, డాక్యుమెంటరీ ప్రపంచంలోనే ఉత్తమమైన మల్టీ-మీడియా సంస్కృతి ప్రాజెక్ట్ అవార్డు 2005;
బహ్రేన్-ట్యునీషియా మల్టీ-మీడియా పోటీ, 2005
2004 లవంబర్ 35 మి.మి, బ్లా/వై, 97 min, ఫీచర్
2005 ఆర్మిన్ వేగ్నర్, జెనోసైడ్ ఫోటోగ్రాఫర్ డి.వి.డి, 34 ని, బ్లా/వై, డాక్యుమెంటరీ
2006 ద స్ప్లింటర్ డి.వి, 34 ని, డాక్యుమెంటరీ
2006 ఫ్రం ఆర్ట్శాఖ్ టూ జవాఖ్, ఫ్రం అరాక్స్ టూ కురా రివర్ డి.వి, 42 ని, డాక్యుమెంటరీ
2007 యెరెవాన్స్ గ్రేటెష్ట్ సీక్రెట్ డి.వి, 44 ని, డాక్యుమెంటరీ
2008 సర్దారపాట్ డెజా వు డి.వి, 68 ని, డాక్యుమెంటరీ
2008 ఒపేరా డి.వి, 10 ని, డాక్యుమెంటరీ
2009 పోట్రెయిట్ ఆఫ్ జీసస్ ఎలైవ్ డి.వి, 49 ని, డాక్యుమెంటరీ
2009 ఆర్మేనియా మైనస్ ఎ1 ప్లస్ డి.వి, 23 ని, డాక్యుమెంటరీ
2010 టిగ్రానకర్ట్ డి.వి, 96 ని, డాక్యుమెంటరీ
2010 టూ అరరట్
డి.వి, 32 ని, డాక్యుమెంటరీ