టిటాలియా ఒప్పందం
సంతకించిన తేదీ | 1817 ఫిబ్రవరి 10 |
---|---|
స్థలం | టెటులియా ఉపజిల్లా, రంగ్‌పూర్ జిల్లా, బంగ్లాదేశ్ |
స్థితి | నేపాల్ ఆక్రమించుకున్న సిక్కిం భూభాగాన్ని సిక్కిం తిరిగి పొందింది |
సంతకీయులు | కంపెనీ తరఫున బార్ ల్యాటర్, సిక్కిం తరఫున నజీర్ చైనా టెంజిన్, మాచా టియెన్‌బా, లామా డుచిమ్ లోంగడూలు |
కక్షిదారులు | |
భాష | ఇంగ్లీషు |
టిటాలియా ఒప్పందం సిక్కిం రాజ్యపు చోగ్యాల్ (చక్రవర్తి) కు, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ (EIC) కీ మధ్య కుదిరిన ఒప్పందం. 1817 ఫిబ్రవరిలో కెప్టెన్ బారే లాటర్ చర్చలు జరిపి కుదిర్చిన ఈ ఒప్పందంతో, బ్రిటిష్ వారు సిక్కిం భద్రతకు హామీ ఇచ్చింది. అలాగే, శతాబ్దాలుగా నేపాలీల అధీనంలో ఉన్న సిక్కిం భూమిని తిరిగి సిక్కింకు ఇచ్చింది. ఈ ఒప్పందం వెంటనే 1814-1816 లో ఆంగ్లో-నేపాల్ యుద్ధం జరిగింది. ప్రతిగా సిక్కిం, బ్రిటిషు వారికి టిబెట్ సరిహద్దు వరకు వాణిజ్య హక్కులు, ప్రయాణ హక్కులు ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలో టెటులియా ఉపాజిలాగా పిలువబడే టిటాలియాలో కుదిరింది. 1894 నాటి సిక్కిం గెజిట్‌లో హెచ్‌హెచ్ రిస్లే, "టిటాలియా ఒప్పందం ద్వారా బ్రిటిష్ ఇండియా, సిక్కింలో లార్డ్స్ పారామౌంట్ స్థానాన్ని పొందింది. ఆ రాజ్యంలో ప్రధాన ప్రభావాన్ని చూపే హక్కు వివాదరహితమై పోయింది." అని రాసాడు.
నిబంధనలు
[మార్చు]కంపెనీ ఏజెంటుగా కెప్టెన్ బారే లాటర్, సిక్కిం తరఫున నజీర్ చైనా టెన్జిన్, మచా తీన్‌బా, లామా డుచిమ్ లాంగడూ అనే ముగ్గురు సిక్కిం అధికారులు సంతకం చేశారు. ఆర్టికల్ 1 కింద ఒప్పందపు ప్రాథమిక ఉద్దేశ్యం - గతంలో నేపాల్‌లోని గూర్ఖా రాజ్యం స్వాధీనం చేసుకున్న భూమిని సిక్కింకు తిరిగి ఇవ్వడం. మేచి నదికి తూర్పున, తీస్తా నదికి పశ్చిమాన ఉన్న ఈ భూమిని 1814-16 ఆంగ్లో-నేపాల్ యుద్ధం తరువాత 1816 సుగౌలీ ఒప్పందం ప్రకారం గూర్ఖాలు కంపెనీకి అప్పగించారు.
బదులుగా, సిక్కిం చోగ్యాల్, గూర్ఖాల పట్ల దురాక్రమణకు దూరంగా ఉండటానికి, సిక్కింకు పొరుగువారితో ఏదైనా వివాదం ఏర్పడితే, బ్రిటిషు వారు మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించాడు. బ్రిటిష్ వారికి సైనిక మద్దతు, బ్రిటిషు న్యాయస్థానం నుండి పరారీలో ఉన్నవారిని, క్రిమినల్ లేదా సివిల్ అయినా, సిక్కింలో అరెస్టు చేస్తారు, సిక్కిం గుండా రవాణా చేసే అన్ని కంపెనీ వస్తువులపై పన్నులుండవు.
ప్రభావం
[మార్చు]ఈ ఒప్పందంతో సిక్కిం, ఇంగ్లీషు-చైనీయుల దౌత్యానికి ఒక వాహకంగా మారిపోయింది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]- సిక్కిం చరిత్ర
- ఒప్పందాల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ Arora, Vibha (2008). "Routing the Commodities of Empire through Sikkim (1817-1906)". Commodities of Empire: Working Paper No.9 (PDF). Open University. p. 6. ISSN 1756-0098.