టిబెట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cultural/historical Tibet (highlighted) depicted with various competing territorial claims.
Red.svg Solid orange.svg Solid yellow.svg టిబెట్ కాందిశీకుల దావా ప్రకారం చారిత్రక టిబెట్
Solid orange.svg Solid yellow.svg Light green.PNG Solid lightblue.png పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) వారి టిబెట్ ప్రాంతాలు
Solid yellow.svg Light green.PNG టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం (యదార్థ అధీనం)
Light green.PNG భారతదేశం చే క్లెయిమ్ చేయబడ్డ ప్రాంతం అక్సాయ్ చిన్
Solid lightblue.png PRC చే క్లెయిమ్ చేయబడ్డ (TAR) టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతం
Solid blue.svg టిబెట్ సాంస్కృతిక ప్రాంతాల, చారిత్రాత్మక ఇతర ప్రదేశాలు

టిబిట్ మధ్యేసియా లోని ఒక పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన 'టిబెట్ వాసుల' నివాసప్రాంతం. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 4,900 మీటర్లు లేదా 16,000 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా "ప్రపంచపు పైకప్పు" గా ప్రసిధ్ధి. భౌగోళికంగా యునెస్కో మరియు ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా[1] ల ప్రకారం ఇది మధ్యేసియా ప్రాంతం, కానీ చాలా విద్యాసంఘాలు దీనిని దక్షిణాసియా ప్రాంతంగా గుర్తిస్తారు.

7 వ శతాబ్దం సాంగ్ త్సాన్ గాంపో రాజు కాలంలో దీని చాలా ప్రాంతాలు ఏకీకృతం చేయబడ్డాయి. 1751 లో చైనా ను 1644 మరియు 1912 ల మధ్య ఏలిన ఖింగ్ ప్రభుత్వం దలైలామా ను టిబెట్ ఆధ్యాత్మిక రాజకీయ నాయకుడిగా నియమించింది, ఇతను ప్రభుత్వాన్ని ('కషాగ్') నడిపాడు.[2] 17వ శతాబ్దంనుండి 1951 వరకు దలైలామా మరియు అతని అధికారులు రాజపాలనా మరియు ధార్మిక పాలనాధికారాలను సాంప్రదాయిక టిబెట్ మరియు రాజధాని లాసా పై కలిగి వుండిరి.[3]

చరిత్ర[మార్చు]

టిబెట్టు దేశస్థులు మంగోలియా జాతికి చెందుతారు. వీరికి మతమంటె అమితమయిన గౌరవము, మూఢ విశ్వాసము కూడా. ప్రతీ ప్రదేశంలోనూ భూతాలు సంచరిస్తుంటాయని వారినమ్మకం. వాటిని ప్రాలదద్రోవటానికి ఓం మణి పద్మేహం అని మత్రోచ్చారణ చేస్తారుట. ఈమంత్రం వారి ప్రార్థన యొక్క బీజం. ఇక్కడ మత గురువుల్ని లామా లంటారు. ప్రధాన మతాధికారి దలైలామా. ఇతనే సర్వాధికారి, రాజ్యపాలన యందు కూడా,దలైలామా అంటే టిబెట్టు వారికి చాలాగౌరవము.ఒక దలైలామా మరణించిన తరువాత, సర్వాధికారము వహించడానికి తగిన శిశువును మతాధికారులు వెదకి దలైలామాగా ఎన్నుకుంటారు. మరణించిన దలైలామా యొక్క ఆత్మ ఈశిశువులో ప్రవేశిస్తుందని వీరి నమ్మకం. ఆరోజు నుంచి ఆశిశువుకు సర్వ విద్యలని నేర్పడం మొదలుపెడతారు. దలైలామ టిబెట్టు ముఖ్య పట్టణమయిన లాసా లో ఉంటారు. లాసా పట్టణం బ్రహ్మ పుత్రానది (సాన్-పొ) లోయకు ఉత్తరంగా ఉన్నది. దలైలామా నివసించే భవన్నాన్ని పొటాలా అంటారు. ఇది 900 అడుగుల యెత్తు ఉండి విసాలంగా ఉంటుంది. టిబెట్టు వారికి మొదట్లొ విదేశీయులంటే అనుమానం. తెల్లవారంటే మరిన్నూ. వారి మతాన్ని, దేశాన్ని సర్వ నాశనంచేసి, దేవతలు సంచరించే ఆప్రదేశాల్ని అపవిత్రం చేస్తారని అపోహ పడెవారు. 18వ శతాబ్దాన్న వారెన్ హేస్టింగ్స్ కొంతమంది పాశ్చాత్యుల్ని లాసా పంపాడు, టిబెట్టు వారితో మైత్రికోరుతు. అది అంతగా ఫలించలేదు. తరువాత 1904లో సర్ ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ నాయకత్వం మీద బ్రిటీషు దళం లాసా చేరబోయింది.టిబెట్టు సైనికులు ఎదుర్కొన్నారు. బ్రిటీషువారు అగ్ని వర్షం కురిపించడంతో టిబెట్టు సైనికులు చెల్లా చెదురై, కల్నల్ యంగ్ హస్బెండ్ కి దారి ఇచ్చేసారు. కల్నల్ లాసాచేరి పొటాలా భవనం మీదనుంచి ఒకసాయంత్రం మంచు శిఖరాల అలలలో మునిగిపోతున్న సూర్యుణ్ణి అవలోకిస్తుంటే, తనలో యేదో హఠాత్తుగా మార్పు వచ్చి జ్ఞాన సంబదమయిన అనుభవాన్ని పొంది తాను చేసిన పనికి పశ్చాతాపం పడ్డట్టు అతని అనుభవాలలో రాసుకున్నాడు. అప్పట్నుంచి టిబెట్టు వారు పాశ్చాత్యుల్ని రానిస్తున్నరు అని చెబుతారు.1933సం.లో 13వ దలైలామా చనిపోయాక ఇప్పటి 14వ దలలామాని టిబెట్టు మత గురువులు ఎన్నుకొన్నారు. హిమాలయాలు ఖనిజాలకి ఆటపట్టు. టిబెట్టులో బంగారంగనులు విశేషముగా ఉన్నాయి.

క్రీ.శ.1వ శతాబ్దంలో యూఎచీ అనే జాతి వారు మధ్య ఆసియా నుంచి భారతదేశంపైకి దండెత్తి వచ్చి దేశంలో స్థిరపడ్డారు. వారిలో ఒక తెగకు చెందిన కుషాన్ వంశస్థులు భారతదేశ చక్రవర్తిత్వాన్ని పొందారు. వీరిలో ఒకరు భారతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన కనిష్కుడు మధ్య ఆసియాలోని కాష్ ఘర్, యార్ ఖండ్ మొదలైన ప్రాంతాలను జయించారు. ఆయన మతాభిమానంతోనే మధ్యఆసియాలో మహాయాన బౌద్ధమతం విస్తరణ చెందింది. అక్కడ నుంచే బౌద్ధం చైనాకు చేరింది[4].

ఇవీ చూడుము[మార్చు]

బయటి లింకులు[మార్చు]

PRC పరిపాలన మరియు పాలసీలకు, టిబెట్ లో వ్యతిరేకతలు[మార్చు]

PRC పరిపాలన మరియు పాలసీలు, టిబెట్ లో[మార్చు]

అరాజకీయ[మార్చు]

  • [1]
  • Wang Jiawei, "The Historical Status of China's Tibet", 2000, pp. 170–3
  • ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Grunfeld అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  • రామారావు, మారేమండ (1947). [www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972 భారతీయ నాగరికతా విస్తరణము] Check |url= scheme (help) (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014. 
"http://te.wikipedia.org/w/index.php?title=టిబెట్&oldid=1420780" నుండి వెలికితీశారు