టిబెట్ ఐదు వేళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టిబెట్ ఐదు వేళ్లు అనేది, మావో జెడాంగ్‌ ప్రవచించాడని చెప్పే చైనా విదేశాంగ విధానం. [1] టిబెట్‌ను చైనా కుడి చేతిగా ఈ విధానం పరిగణిస్తుంది. లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ లను ఆ చేతికి ఉండే ఐదు వేళ్లుగా భావిస్తుంది. ఈ ప్రాంతాలను "విముక్తి" చేసే బాధ్యత చైనాకు ఉందని ఈ విధానం చెబుతుంది. [2] [3] అధికారిక ప్రకటనలలో చైనా ఎప్పుడూ దీన్ని చర్చించలేదు. కాని దాని ఉనికి పైన లేదా పునరుజ్జీవనం పైనా బయటి నుండి ఆందోళనలు తలెత్తాయి. 2017 నాటి భారత చైనా సరిహద్దు ప్రతిష్టంభన తరువాత, చైనా కమ్యూనిస్ట్ పార్టీ బాకా పత్రిక ఒకదానిలో వచ్చిన ఒక కథనం ఈ విధానం ఉనికిని ధ్రువీకరించింది.

నేపథ్యం[మార్చు]

ఒకప్పటి చైనా సామ్రాజ్యం టిబెట్ పై తన వాదనకు పొడిగింపుగా నేపాల్, సిక్కిం, భూటాన్ లపై కూడా ఆధిపత్యం ఉందని ప్రకటించింది. [4] 1908 లో టిబెట్‌లో ఉన్న చైనా సామ్రాజ్యపు రెసిడెంటు ఈ వాదనలను నొక్కిచెప్పాడు. నేపాల్, టిబెట్ "చైనా ఆధ్వర్యంలో సోదరుల మాదిరిగా ఐక్యంగా ఉండాలని, పరస్పర మంచి కోసం సామరస్యంగా పనిచేయాలనీ" అతడు నేపాల్ అధికారులకు లేఖ రాశాడు. బ్రిటిషు వ్యతిరేకత నేపథ్యంలో చైనా వాదనను నొక్కిచెప్పడంలో భాగంగా చైనా, టిబెట్, నేపాల్, సిక్కిం, భూటాన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న "ఐదు రంగుల సమ్మిళితం" గురించి అతడు సూచించాడు. [5] 1939 లో, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్, భూటాన్, నేపాల్‌లను చైనా సామంత రాజ్యాలుగా పేర్కొన్నాడు.

చైనాపై సైనిక విజయం సాధించాక సామ్రాజ్యవాద దేశాలు, చైనాకు చెందిన భూభాగంతో పాటు దాని సామంత రాజ్యాలను కూడా బలవంతాన ఆక్రమించారు. కొరియా, తైవాన్, ర్యుక్యు ద్వీపాలు, పెస్కడోరెస్, పోర్ట్ ఆర్థర్ లను జపాన్ ఆక్రమించగా, బర్మా, భూటాన్, నేపాల్, హాంగ్‌కాంగ్ లను ఇంగ్లాండు తీసుకుంది. ఫ్రాన్సు అన్నాన్ ను లాక్కుంది. పిపీలికం లాంటి చిన్న దేశం పోర్చుగల్ కూడా మకావును మన నుండి లాగేసుకుంది. అదే సమయంలో వాళ్ళు చైనా స్వంత భూభాగాన్ని కూడా లాక్కున్నారు. చైనా విపరీతమైన నష్టపరిహారం చెల్లించేలా చేసారు. ఆ విధంగా చైనా సామ్రాజ్యంపై తీవ్రమైన దెబ్బ కొట్టారు [6]

మూలం[మార్చు]

"ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ టిబెట్" విధానం 1940 లలో మావో చేసిన ప్రసంగాలకు ఆపాదించారు. [7] [2] [8] కానీ అధికారిక చైనా ప్రకటనలలో ఎప్పుడూ చర్చించలేదు. [9] టిబెట్‌ను చైనా కుడిచేతిగానూ, లడఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్) దాని ఐదు వేళ్లు గానూ ఈ విధానంభావించింది. 1954 లో, టిబెట్‌లోని చైనా అధికారులు "సిక్కిం, భూటాన్, లడఖ్, NEFA లను విముక్తి చేస్తాం, వీటిని భారత సామ్రాజ్యవాదులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు" అని పేర్కొన్నారు. : 55  అదే సంవత్సరంలో చైనా ప్రభుత్వం, పాఠశాల విద్యార్థుల కోసం "ఆధునిక చైనా సంక్షిప్త చరిత్ర" అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఇందులో 1840, 1919 మధ్య "సామ్రాజ్యవాద శక్తులు" తీసుకున్న భూభాగాలను చూపించే మ్యాపు ఉంది. అవి "చైనా భాగాలే, వాటిని తిరిగి సాధించాలి" అని రాసారు. ఈ పటంలో లడఖ్, నేపాల్, భూటాన్, సిక్కిం, ఈశాన్య భారతదేశం యావత్తూ ఉన్నాయి . ఆ సమయంలో పెకింగ్ (ప్రస్తుతం బీజింగ్ అని పిలుస్తారు) లో పనిచేసిన భారత దౌత్యవేత్త త్రిలోకి నాథ్ కౌల్, తన జ్ఞాపకాలలో కూడా దీన్ని ఉదహరించాడు. బిఎస్కె గ్రోవర్, ఈ పటం కేవల ప్రచారమో "పనిలేని ప్రగల్భాలో" కాదనీ, "పెకింగ్ ఆశయాలకు తీవ్రమైన ప్రతిబింబం" అనీ అన్నాడు.

"ఐదు వేళ్ల" వాదనలు 1958 నుండి 1961 వరకు పెకింగ్, లాసా రేడియోల్లో "దృఢంగానూ, తరచు గానూ" నొక్కిచెబుతూండేవారు. : 96  1959 జూలైలో లాసాలో జరిగిన ఒక సామూహిక సమావేశం సందర్భంగా, చైనీస్ లెఫ్టినెంట్ జనరల్ జాంగ్ గువోహువా ఇలా చెప్పాడు: "భూటాన్, సిక్కిం లడఖ్ ప్రజలు టిబెట్ లో ఒక సమైక్య కుటుంబంగా ఉంటారు. వారు ఎల్లప్పుడూ టిబెట్ లోను, తద్వారా చైనా మాతృభూమి లోనూ భాగమే. వారు మరోసారి ఐక్యమై కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని బోధించాలి. " [9] [lower-alpha 1]

21 వ శతాబ్దపు విధానంలో దీని ఔచిత్యం[మార్చు]

చైనీస్ బహిరంగ ప్రకటనలలో ఈ విధానాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. [9] ప్రస్తుతం అధికారికంగా ఇది నిద్రాణంగా ఉంది. చైనీస్ వాదనలు అరుణాచల్ ప్రదేశ్‌కు, అక్సాయి చిన్ ప్రాంతానికీ మాత్రమే పరిమితమై ఉన్నాయి. [13] అయితే, అది తిరిగి తలెత్తుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి. [14] డోక్లాం వద్ద 2017 భారత చైనా సరిహద్దు ప్రతిష్టంభన తరువాత, కున్జోంగ్ (సిసిపి యొక్క జియాంగ్సు ప్రావిన్షియల్ పార్టీ స్టాండింగ్ కమిటీకి చెందిన బాకా పత్రిక) [15] లోని ఒక కథనం "ఐదు వేళ్లు" నిర్మాణాన్ని ప్రస్తావించింది. నాన్జింగ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు లియు లిటావో రాసిన ఈ వ్యాసంలో టిబెటన్ స్వాతంత్ర్య ఉద్యమానికి భారతదేశం రహస్యంగా మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ ఈ ప్రాంతంలో టిబెట్ యొక్క సాంస్కృతిక, ఆర్ధిక ప్రాముఖ్యతే దీనికి కారణమని అతడు సూత్రీకరించాడు. భారతదేశం "ఐదు వేళ్లను లాక్కున్నప్పటికీ", ఈ "ఐదు వేళ్ళ" పై టిబెట్ సంస్కృతి కలగజేసే "అపకేంద్ర బలం" కారణంగా "అరచేయి" లేకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నియంత్రించడం అసాధ్యమని కూడా అతడు పేర్కొన్నాడు. ఈ ప్రాంతాలతో చైనా పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పెరిగేకొద్దీ, ఈ ప్రాంతాలలో చైనా ప్రభావం భారతదేశ ప్రభావాన్ని అధిగమిస్తుంది. దానిని "చాలావరకు" తొలగించేస్తుంది అని కూడా ఆ వ్యాసం పేర్కొంది

సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ నాయకుడు లోబ్సాంగ్ సంగే ఈ విధానాన్ని డోక్లాం ప్రతిష్ఠంభనతో లంకె పెట్టాడు. [16] 2020 భారత చైనా కొట్లాటల వెనక ఉన్న కారణం కూడా ఇదేనని సంగే, [17] అధీర్ రంజన్ చౌదరి (లోక్ సభ లో భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు ), [18] శేషాద్రి చారి (భారతీయ జనతా పార్టీ మాజీ విదేశీ వ్యవహారాల సెల్ అధిపతి ), [19] ఎంఎం ఖాజురియా (జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) లు అన్నారు. [20]

వ్యాఖ్యాత సౌరవ్ ఝా ప్రకారం - "ఐదు వేళ్లు" విధానం హిమాలయాల చారిత్రక భౌగోళికం నుండి ఉద్భవించింది. ఇది టిబెట్‌కు దక్షిణ ప్రాంతాలకూ మధ్య ద్వి-దిశాత్మక ప్రాదేశిక వాదనలకు వీలు కలిగిస్తుంది. ఇది ట్రాన్స్-హిమాలయ శక్తుల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తుంది. ఇది "చివరికి సైనిక సామర్ధ్య సమతుల్యతతో నిగ్రహించబడుతుంది". దీర్ఘకాలిక చైనా-భారతీయ సరిహద్దు వివాదానికి కారణం ఇదే. [21]

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. ఈ ప్రసంగం 1959 జూలై 17 న లాసా లో జరిగిన బహిరంగ సమావేశంలో టిబెట్ లోని చైనా రాయబారి ఝాంగ్ గువోహువా చేసాడని చెబుతారు. "చైనా టుడే" పత్రికలో ఈ ప్రసంగంపై వచ్చిన నివేదికలో ఈ భాగాన్ని తొలగించారు. కానీ "ది డెయిలీ టెలిగ్రాఫ్" పత్రిక కలింపాంగ్ ప్రతినిధి జార్జ్ ఎన్. ప్యాటర్సన్ పంపిన నివేదికలో ఉంది. దాన్ని "హిందూస్థాన్ టైమ్స్" పత్రికలో కూడా ప్రచురించారు.[10][11] "భారత ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ ఈ విషయాన్ని చైనా వద్ద ప్రస్తావించినపుడు టిబెట్‌ను ఏ ప్రాతిపదికపై ఆక్రమించారో ఈ సరిహద్దు రాజ్యాలపై క్లెయిములకు ప్రాతిపదిక కూడా అదే అని వాళ్ళు ముతగ్గా సమాధానం చెప్పారు" అని ప్యాటర్సన్ నివేదించాడు. [12]

మూలాలు[మార్చు]

  1. "India, China and the Nathu La India, China and the Nathu La Understanding Beijing's Larger Strategy towards the Region" (PDF). Institute of Peace & Conflict Studies.
  2. 2.0 2.1 Haidar, Suhasini (18 June 2020). "History, the standoff, and policy worth rereading". The Hindu (in Indian English). Retrieved 19 June 2020.
  3. Theys, Sarina (25 January 2018). "Running hot and cold: Bhutan-India-China relations". South Asia @ LSE blog. Retrieved 3 July 2020.
  4. Jain, Girilal (1960). "Threat to India's Integrity". Panchsheela and After: A Re-Appraisal of Sino-Indian Relations in the Context of the Tibetan Insurrection. Asia Publishing House. p. 158.
  5. Jain, Girilal (1959). "Consequences of Tibet". India meets China in Nepal. Asia Publishing House. pp. 105–106.
  6. Schram, Stuart R. (1969). "China and the Underdeveloped Countries". The Political Thought of Mao Tse-tung. Praeger Publishers. pp. 257–258.
  7. Muni, S. D. (2009). "The Nehruvian Phase: Ideology Adjusts with Realpolitik". India's Foreign Policy: The Democracy Dimension. Foundation Books. p. 31. ISBN 9788175968530.
  8. Srivastava, Sanjay (19 June 2020). "India-China Face-off : क्या है चीन की 'फाइव फिंगर्स ऑफ तिब्बत स्ट्रैटजी', जिससे भारत को रहना होगा अलर्ट" (in హిందీ). News18 India. Retrieved 19 June 2020.
  9. 9.0 9.1 9.2 Grover, B. S. K. (1974). Sikkim and India: Storm and Consolidation. Jain Brothers. pp. 152–153.
  10. Desai, B. K. (1959), India, Tibet and China, Bombay: Democratic Research Service, p. 30, archived from the original on 27 ఆగస్టు 2017
  11. "Delhi Diary, 14 August 1959", The Eastern Economist; a Weekly Review of Indian and International Economic Affairs, Volume 33, Issues 1–13, 1959, p. 228, archived from the original on 27 ఆగస్టు 2017
  12. George N. Patterson, China's Rape of Tibet (PDF), George N. Patterson web site, archived from the original (PDF) on 27 August 2017, retrieved 23 August 2017
  13. Bradsher, Henry S. (1969). "Tibet Struggles to Survive". Foreign Affairs. 47 (4): 752. doi:10.2307/20039413. ISSN 0015-7120.
  14. Jha, Purushottam (19 June 2020). "China – A desperate state to change the narratives and contexts". The Times of India. Retrieved 19 June 2020.
  15. "群众杂志社". Baidu Baike (in చైనీస్). Retrieved 17 July 2020.
  16. Basu, Nayanima (17 October 2017). "'Doklam is part of China's expansionist policy'". Business Line (in ఇంగ్లీష్). Retrieved 19 June 2020.
  17. Siddiqui, Maha (18 June 2020). "Ladakh is the First Finger, China is Coming After All Five: Tibet Chief's Warning to India". CNN-News18. Retrieved 19 June 2020.
  18. Chowdhury, Adhir Ranjan (17 June 2020). "Chinese intrusion in Ladakh has created a challenge that must be met". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 20 June 2020.
  19. Chari, Seshadri (12 June 2020). "70 yrs on, India's Tibet dilemma remains. But 4 ways Modi can achieve what Nehru couldn't". ThePrint. Retrieved 20 June 2020.
  20. Khajooria, M. M. (5 June 2020). "Maos' open palm & its five fingers". State Times. Retrieved 20 June 2020.
  21. Jha, Saurav (30 May 2020). "India must stand firm". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 19 June 2020.