టిరోంగ్ అబోహ్
| టిరోంగ్ అబోహ్ | |||
| పదవీ కాలం 2014 – 2019 మే 21 | |||
| ముందు | యుమ్సేమ్ మాటే | ||
|---|---|---|---|
| తరువాత | చకత్ అబోహ్ | ||
| నియోజకవర్గం | ఖోన్సా వెస్ట్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1978 జనవరి 20 అరుణాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
| మరణం | 2019 మే 21 (వయసు: 41)[1] బోగపాణి, తిరప్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
| జీవిత భాగస్వామి | చకత్ అబోహ్ | ||
| సంతానం | 1 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
టిరోంగ్ అబోహ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]టిరోంగ్ అబోహ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఖోన్సా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి పిపిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి యుమ్సేమ్ మాటేపై 1,908 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[2][3][4] ఆయన ఆ తరువాత నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో ఎన్‌పిపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఫవాంగ్ లోవాంగ్ పై 1,055 ఓట్లతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, తిరప్ జిల్లాలోని బోగపాని ప్రాంతంలో 2019 మే 21న గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తిరోంగ్ అబోహ్, ఆయన కుమారుడు సహా 11 మంది మరణించారు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "NPP's maiden win in Arunachal Pradesh overshadowed by MLA death" (in Indian English). The Hindu. 24 May 2019. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "19 Newcomers Win Arunachal Assembly Poll" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 May 2014. Retrieved 20 May 2025.
- ↑ "Arunachal CM appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). India Today. 18 September 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal CM Pema Khandu appoints 26 MLAs as parliamentary secretary" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2016. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
- ↑ "Arunachal Pradesh: NPP MLA Tirong Aboh, son among 11 shot dead by unknown assailants" (in ఇంగ్లీష్). India Today. 21 May 2019. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Arunachal Pradesh MLA, son among 11 killed in ambush" (in Indian English). The Hindu. 21 May 2019. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.