టివానాకు సామ్రాజ్యం
Tiwanaku polity Tiahuanaco | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| c. 600–c. 1000 | |||||||||||||
Map of the Tiwanaku Civilization | |||||||||||||
| రాజధాని | Tiwanaku, Bolivia | ||||||||||||
| Common languages | Puquina[1] | ||||||||||||
| Historical era | Middle Horizon | ||||||||||||
• Established | c. 600 | ||||||||||||
• Disestablished | c. 1000 | ||||||||||||
| |||||||||||||
| Today part of | Bolivia Peru Chile Argentina | ||||||||||||
టివానాకు రాజవంశం (టియాహువానాకో లేదా టియాహువానాకు) అనేది దక్షిణ టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలో ఉన్న పశ్చిమ బొలీవియాలోని ఒక కొలంబసు పూర్వ రాజ్యవ్యవస్థ. టివానాకు అత్యంత ముఖ్యమైన ఆండియను నాగరికతలలో ఒకటి. దీని ప్రభావం ప్రస్తుత పెరూ, చిలీ వరకు విస్తరించి సుమారు సా.శ 600 నుండి 1000 వరకు కొనసాగింది. దీని రాజధానిగా టివానాకు అనే స్మారక నగరం ఉంది. ఇది దక్షిణ టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలోని రాజ్యవ్యవస్థ ప్రధాన ప్రాంతం మధ్యలో ఉంది. ఈ ప్రాంతంలో ఎత్తైన పొలాల మీద పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవి బహుశా రాజధానిలోని పట్టణ జనాభాకు మద్దతు ఇచ్చి ఉండవచ్చు. ఈ పొలాలను ఒక అధికారిక రాజ్యం (మీద నుండి క్రిందికి) లేదా స్థానిక స్వయంప్రతిపత్తి కలిగిన సంఘాల సమాఖ్య ద్వారా (క్రింది నుండి పైకి) నిర్వహించారా అనే దాని మీద పరిశోధకుల మధ్య చర్చ జరుగుతోంది (జానూసెకు 2004:57-73లో ఈ చర్చ సమీక్షను చూడండి). తరువాతి ఇంకా సామ్రాజ్యంతో పోలికల ఆధారంగా టివానాకు ఒకప్పుడు విస్తారమైన సైనిక సామ్రాజ్యంగా భావించబడింది. అయితే ఇటీవలి పరిశోధనలు తివానాకును ఒక సామ్రాజ్యంగా లేదా ఒక రాజ్యంగా వర్గీకరించడం తప్పుదారి పట్టించేది కావచ్చని సూచిస్తున్నాయి. పురాతన రాజ్యాలు. సామ్రాజ్యాలను నిర్వచించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే అనేక లక్షణాలు తివానాకులో లేవు: ఏ తివానాకు ప్రదేశంలోనూ రక్షణ నిర్మాణాలు, ఆయుధ సాంకేతికతలో మార్పులు లేవు. రాజకుటుంబ సమాధులు లేదా పాలక రాజవంశానికి లేదా అధికారిక సామాజిక సోపానక్రమానికి సంబంధించిన ఇతర ఆధారాలు లేవు. రాజ్యం నిర్వహించే రహదారులు లేదా సైనిక స్థావరాలకు సంబంధించిన ఆధారాలు లేవు, మార్కెట్లు కూడా లేవు.[2]
తివానాకు అనేది శక్తివంతమైన వంశాల బహుళ-సాంస్కృతిక నెట్వర్కు, ఇది పెద్ద స్మారక చిహ్నాలను నిర్మించడానికి ప్రజలను ఏకం చేసింది. ఈ సామూహిక విందులు ప్రజలను శక్తివంతమైన వేడుకలలో ఏకం చేశాయి. బహుశా ఇదే వందల కిలోమీటర్ల దూరం నుండి ప్రజలను ఆకర్షించిన కేంద్ర చోదక శక్తి. వారు వ్యాపారం చేయడానికి, నైవేద్యాలు సమర్పించడానికి, దేవతలను గౌరవించడానికి లామాల బృందాలలో భాగంగా అక్కడికి ప్రయాణించి ఉండవచ్చు.[3] టివానాకు ఆండీసు పర్వత ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా, ఖండంలోని అతిపెద్ద కొలంబియను పూర్వ నగరాలలో ఒకటిగా ఎదిగింది. సుమారు 800వ సంవత్సరం నాటికి దాని జనాభా 10,000 నుండి 20,000 గరిష్ట స్థాయికి చేరుకుంది.
దక్షిణ టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలోని ప్రధాన కేంద్రం వెలుపల, పెరూ తీరంలో టివానాకు కాలనీలు ఉండేవి. అక్కడ ఉన్నత ప్రాంతాల ప్రజలు టివానాకు దేవాలయాలు, కుండలను అనుకరించారు. ఉత్తర చిలీలోని శ్మశానవాటికలలో టివానాకు శైలిలో విస్తృతమైన సమాధి వస్తువులు లభించాయి. ఈ ప్రాంతాలతో స్పష్టమైన సంబంధాలు ఉన్నప్పటికీ, టివానాకు నాయకులు మధ్యలో ఉన్న భూభాగం లేదా ప్రజలను నియంత్రించారనడానికి తక్కువ ఆధారాలు ఉన్నాయి; అంటే దాని భూభాగం అవిచ్ఛిన్నంగా లేదు. కొన్ని ముఖ్యమైన మినహాయింపులతో, టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతం వెలుపల టివానాకు ప్రభావం "మృదువైన శక్తి" రూపంలో ఉండేది. అది శక్తివంతమైన, విస్తృతమైన, శాశ్వతమైన సాంస్కృతిక ఆధిపత్యంగా వికసించింది.
టివానాకు నగరం సముద్ర మట్టానికి సుమారు 3,800 మీ(12,500అ) మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రాచీన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాజధాని నగరంగా నిలిచింది. [4]

ఉదయము
[మార్చు]టివానాకు ప్రదేశం చివరి నిర్మాణ కాలంలో సుమారు 110వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆ సమయంలో దక్షిణ టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలో అనేక పెరుగుతున్న నివాసాలు ఉండేవి. 450, 550 సంవత్సరాల మధ్య పెద్ద నివాసాలు వదిలివేయబడ్డాయి. దీంతో టివానాకు ఈ ప్రాంతంలో అత్యంత ప్రముఖ కేంద్రంగా మిగిలిపోయింది.సుమారు 600వ సంవత్సరం నుండి దాని జనాభా వేగంగా పెరిగింది. బహుశా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి భారీ వలసల కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. అదనంగా ఈ ప్రాంతంలోని నగరంలో పెద్ద భాగాలు నిర్మించబడ్డాయి లేదా పునరుద్ధరించబడ్డాయి. కొత్తగా పెద్దగా చెక్కిన ఏకశిలలు స్థాపించబడ్డాయి, దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఒక ప్రామాణికమైన బహుళ-రంగుల కుండల శైలి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబడింది. [5]
టివానాకు ప్రభావం దాని అలంకరించబడిన సిరామిక్సు ఉనికి ద్వారా స్పష్టంగా నమోదు చేయబడింది. ఇది యుంగాసు ప్రాంతంలోకి విస్తరించింది. పెరూ, బొలీవియా, ఉత్తర అర్జెంటీనా, చిలీలోని అనేక ఇతర సంస్కృతులను ప్రభావితం చేసింది. టివానాకులోని కొన్ని విగ్రహాలు ఇతర ప్రాంతాల నుండి తీసుకురాబడ్డాయి. అక్కడ ఆ రాళ్లను టివానాకు దేవతల కంటే తక్కువ స్థానంలో ఉంచారు. [6]పురావస్తు శాస్త్రవేత్తలు టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలో, వెలుపల ఉన్న పెద్ద సంఖ్యలో ప్రదేశాలలో టివానాకు సిరామిక్సును నమోదు చేశారు.
ఇది టివానాకు చిహ్నాలు, వాటికి జోడించబడిన అధికార సందేశాల విస్తృత ప్రభావాన్ని రుజువు చేస్తుంది. క్రీ.శ. 600, 800 మధ్య జనాభా వేగంగా పెరిగింది. ఈ ప్రదేశం దక్షిణ ఆండీసులో ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా మారింది. [7] విలియం హెచ్. ఇస్బెలు ఇలా పేర్కొన్నారు: "క్రీ.శ. 600, 700 మధ్య టియాహువానాకో ఒక నాటకీయ పరివర్తనకు గురైంది. ఇది పౌర నిర్మాణానికి కొత్త స్మారక ప్రమాణాలను నెలకొల్పింది. నివాస జనాభాను గణనీయంగా పెంచింది". ప్రారంభ అంచనాల ప్రకారం సుమారు 6.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ నగరంలో 15,000 నుండి 30,000 మంది ప్రజలు ఉన్నారు. ఇటీవలి సర్వేలు ఈ ప్రదేశం గరిష్ట పరిమాణాన్ని 3.8, 4.2 చదరపు కిలోమీటర్ల మధ్య, జనాభాను 10,000 నుండి 20,000 మధ్య అంచనా వేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో శాశ్వత జనాభాకు బదులుగా ప్రజలు పని బృందాలు, ఉత్సవాలలో పాల్గొనడానికి సుదీర్ఘ పర్యటనలు చేసినందున టివానాకులో ప్రజల సంఖ్య బహుశా కాలాన్ని బట్టి నాటకీయంగా హెచ్చుతగ్గులకు లోనైంది.
దక్షిణ టిటికాకా సరస్సు పరీవాహక ప్రాంతంలోని మిగిలిన భాగంలో వందలాది చిన్న నివాసాలు కనుగొనబడ్డాయి. వాటిలో కొన్ని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైనవి లుకుర్మాటా, క్వేయా కుంటు, కిరావి, వాకా కాలా, సోనాజి, కాలా ఉయుని, ఖోంఖో వాంకనే ఉన్నాయి.
కాలనీలు - వలసలు
[మార్చు]టివానాకు వలసలు ఆల్టిప్లానో ప్రాంతం వెలుపల పెరూలోని మోక్వెగ్వా లోయ వరకు విస్తరించాయని పాల్ గోల్డుస్టెయిను వంటి పురావస్తు శాస్త్రవేత్తలు చూపించారు. 750 సంవత్సరం తర్వాత చెన్ చెన్ ప్రదేశంలో ఓమో ప్రదేశ సముదాయంలో టివానాకు ఉనికి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఒక ఆచార కేంద్రం నిర్మించబడింది. ఓమో స్థావరాల వద్ద జరిపిన తవ్వకాలలో టివానాకుకు విలక్షణమైన ఆలయం, మెట్ల దిబ్బ వంటి నిర్మాణ శైలికి సంబంధించిన గుర్తులు కనిపించాయి. [8]ఓమో ప్రదేశానికి, టివానాకు ప్రధాన ప్రదేశానికి మధ్య సమాధులలో కనిపించిన ఒకే రకమైన కృత్రిమ కపాల వైకల్యానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఈ వాదనకు ఉపయోగిస్తున్నారు. [9]
టివానాకు 300 కిలోమీటర్ల దూరం వరకు అనేక కాలనీలను స్థాపించింది. బాగా పరిశోధించబడిన వాటిలో ఒకటి పెరూలోని మోక్వెగ్వా లోయలో ఉన్న కాలనీ ఇది టిటికాకా సరస్సు నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రీ.శ. 400, 1100 మధ్య కాలంలో వర్ధిల్లింది. ఈ కాలనీ ఒక వ్యవసాయ, గనుల తవ్వకం కేంద్రంగా ఉండి రాగి, వెండిని ఉత్పత్తి చేసింది. [10]చిలీలోని అజపా లోయలో కూడా చిన్న కాలనీలు స్థాపించబడ్డాయి.
జనాభా పెరిగేకొద్దీ వృత్తిపరమైన అవకాశాలు అభివృద్ధి చెందాయి. ప్రజలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలలో నైపుణ్యం సాధించడం ప్రారంభించారు. కుండలు, ఆభరణాలు, వస్త్రాలలో పనిచేసే కళాకారుల సంఖ్య పెరిగింది. తర్వాతి ఇంకాల మాదిరిగానే, టివానాకుకు వాణిజ్య లేదా మార్కెటు సంస్థలు తక్కువగా ఉండేవి. దానికి బదులుగా ఆ సంస్కృతి ఉన్నత వర్గాల పునఃపంపిణీ మీద ఆధారపడింది. [11]టివానాకును ఒక అధికారిక రాజ్యంగా చూసే ఈ దృక్కోణంలో ఉన్నత వర్గాల వారు ఆర్థిక ఉత్పత్తిని నియంత్రించారు. కానీ ప్రతి సామాన్యుడికి వారి వారి విధులను నిర్వర్తించడానికి అవసరమైన అన్ని వనరులను అందించాలని వారి నుండి ఆశించబడింది. ఎంపిక చేయబడిన వృత్తులలో వ్యవసాయదారులు, పశుపోషకులు మొదలైనవారు ఉన్నారు. వృత్తుల ఇటువంటి విభజనతో పాటు శ్రేణీకృత సామాజిక వర్గీకరణ కూడా ఉంది. [12]ఉన్నత వర్గాల వారు అన్ని ప్రాంతాల నుండి పొందిన అదనపు ఆహార నిల్వల మీద నియంత్రణ ద్వారా తమ హోదాను పొందారు. ఆ తర్వాత వారు దానిని ప్రజలందరికీ పునఃపంపిణీ చేశారు. టివానాకుకు లామా మందల మీద నియంత్రణ చాలా ముఖ్యమైనదిగా మారింది. ప్రధాన, ప్రతిష్టాత్మక వస్తువులను రవాణా చేయడానికి ఈ జంతువులు అత్యవసరం.
వ్యవసాయం
[మార్చు]

సరస్సు, పొడి పీఠభూముల మధ్య టివానాకు ఉన్న ప్రదేశం చేపలు, అడవి పక్షులు, మొక్కలు, ముఖ్యంగా లామాల వంటి ఒంటె జాతి జంతువుల కోసం పశుపోషణ మైదానాల వంటి కీలక వనరులను అందించింది.[13] టివానాకు ఆర్థిక వ్యవస్థ టిటికాకా సరస్సు వనరులను ఉపయోగించుకోవడం, లామాలు, అల్పాకాల పెంపకం, ఎత్తైన పొలాల వ్యవస్థలలో వ్యవస్థీకృత వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. టివానాకు ప్రజలు లామా మాంసం, బంగాళాదుంపలు, క్వినోవా, బీన్సు, మొక్కజొన్నలను తినేవారు. ఎత్తైన ప్రాంతాలలో వాతావరణం మారుతూ ఉండటం వలన ఆహారాన్ని నిల్వ చేయగల సామర్థ్యం ముఖ్యమైంది. ఇది గడ్డకట్టి ఎండబెట్టిన బంగాళాదుంపలు, ఎండబెట్టిన మాంసం కోసం సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి దారితీసింది.
సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న టిటికాకా బేసిను, టిటికాకా సరస్సు ఉండటం వలన ఊహించదగిన, సమృద్ధిగా వర్షపాతం కురిసే ఈ ప్రాంతంలో అత్యంత ఉత్పాదకత కలిగిన పర్యావరణం కలిగి ఉంది.[14] ఈ జలాశయం వెచ్చని ఉష్ణోగ్రతను, మరింత తేమతో కూడిన వాతావరణాన్ని అందిస్తుంది. తూర్పున ఆల్టిప్లానో చాలా పొడి, శుష్క భూభాగం. టిటికాకా బేసిను కూడా సహజసిద్ధమైన నీటి బుగ్గల నుండి టివానాకు నది వంటి పెద్ద నదుల వరకు అనేక నీటి వనరులతో ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తుంది. నీటి వనరుల సమృద్ధి టివానాకు నాగరికత అభివృద్ధికి కీలకం. ఎందుకంటే అవి సారవంతమైన భూమిని పెద్ద మొత్తంలో అందించాయి. దీనిని టివానాకు సంస్కృతి ఎత్తైన పొలాలు, మెట్ల సాగు, కోచాల వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులను ఉపయోగించి వ్యవసాయ భూములుగా అభివృద్ధి చేసి విస్తరించింది.
ఎత్తైన పొలాలు
[మార్చు]టివానాకు సంస్కృతి అనేక విలక్షణమైన వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేసింది. "వరద-ఎత్తైన పొలం" వ్యవసాయం ('సుకా కుల్లు')గా పిలువబడే ఈ పొలాలను ప్రాంతీయ వ్యవసాయంలో నీటిపారుదల పొలాలు, పచ్చిక బయళ్ళు, మెట్ల పొలాలు, కృత్రిమ చెరువులతో పాటు విస్తృతంగా ఉపయోగించారు. కటారి, టివానాకు నదుల నుండి నీటిని ఎత్తైన పొలాలకు నీటిపారుదల కోసం ఉపయోగించారు. ఇవి 130 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. టిటికాకా బేసినులో ఈ పొలాలు 5–20 మీటర్ల వెడల్పు, 200 మీటర్ల పొడవు గల పెద్ద నాటడం వేదికలుగా ఉండేవి.
కృత్రిమంగా పెంచిన మొక్కలు నాటే దిబ్బలను నీటితో నిండిన కాలువలతో వేరు చేశారు. ఈ కాలువలు పెరుగుతున్న పంటలకు తేమను అందిస్తాయి. కానీ అవి పగటిపూట సౌర వికిరణం నుండి వేడిని కూడా గ్రహిస్తాయి. ఈ వేడి అత్యంత చల్లని రాత్రులలో క్రమంగా విడుదలవుతుంది. ఆ ప్రాంతంలో ఉండే తీవ్రమైన మంచు నుండి ఉష్ణ ఇన్సులేషనును అందిస్తుంది.[15] ఇలాంటి భూభాగ నిర్వహణకు సంబంధించిన ఆనవాళ్లు ల్లానోసు డి మోక్సోసు ప్రాంతంలో (మోక్సోసు అమెజోనియను వరద మైదానాలు) కనుగొనబడ్డాయి. కాలక్రమేణా ఈ కాలువలను తినదగిన చేపల పెంపకానికి కూడా ఉపయోగించారు. చిన్న నీటి మొక్కల నుండి ఏర్పడిన కాలువ బురదను ఎరువుగా ఉపయోగించడం కోసం తవ్వితీసేవారు. ఇది పంటలకు నిరంతరం పోషకాలు సమృద్ధిగా ఉన్న మట్టిని అందించింది.
శ్రమతో కూడుకున్నప్పటికీ 'సుకా కుల్లు' పద్ధతి అద్భుతమైన దిగుబడిని ఇస్తుంది. ఈ ప్రాంతంలో సాంప్రదాయ వ్యవసాయం సాధారణంగా హెక్టారుకు 2.4 మెట్రికు టన్నుల బంగాళాదుంపలను పండిస్తే, ఆధునిక వ్యవసాయం (కృత్రిమ ఎరువులు, పురుగుమందులతో) హెక్టారుకు సుమారు 14.5 మెట్రికు టన్నుల దిగుబడిని ఇస్తుంది. కానీ 'సుకా కుల్లు' వ్యవసాయం హెక్టారుకు సగటున 21 టన్నుల దిగుబడిని ఇస్తుంది.ఆధునిక వ్యవసాయ పరిశోధకులు 'సుకా కుల్లు' పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టారు. ముఖ్యంగా 1980వ దశకంలో యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన అలను కొలాటా, ఓస్వాల్డో రివెరా పునఃసృష్టించిన ప్రయోగాత్మక సుకా కుల్లు పొలాలు, 1988లో సంభవించిన మంచు కారణంగా ప్రాంతంలోని మిగిలిన పంటలో 70-90% నాశనమైనప్పటికీ వాటి ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే తగ్గుదల చవిచూశాయి. [16]
ప్రయోగాలలో ఆకట్టుకునే దిగుబడులు సాధ్యమైనప్పటికీ, ఈ పొలాలు బంగాళాదుంప పరాన్నజీవులకు గురవుతాయి. వాటిని నిరంతరం ఉపయోగిస్తే, సాంప్రదాయ వర్షాధార పొలాల కంటే తక్కువ సమర్థవంతంగా ఉంటాయి. ఇది బాండీ (2005) వంటి స్వతంత్ర పరిశోధకులు ఎత్తైన పొలాలు వాస్తవానికి అధిక ఉత్పాదకత కలిగినవి కావని సూచించడానికి దారితీసింది. 1990లలో ప్రయోగాలు. అభివృద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్థానిక ప్రజలు వాటిని ఉపయోగించడం కొనసాగించలేదని వారు పేర్కొన్నారు.[17] బదులుగా ఇతర పొలాల కంటే ముందుగానే వీటిలో నాట్లు వేసి, పంట కోయగలిగినందున వాటిని పెద్ద ఎత్తున సాగు చేయడానికి ఉపయోగించారు. ఇది తప్పనిసరిగా సంవత్సరానికి రెండు పంటలకు వీలు కల్పించింది: ఒకటి విందులు ఇవ్వడానికి, మరొకటి రోజువారీ వినియోగం కోసం. ఈ శ్రమ ప్రణాళికను సమన్వయం చేయడం టివానాకులోని ప్రముఖ కుటుంబాలకు ఒక కీలకమైన కార్యకలాపం, ఎందుకంటే వారు తమ సొంత పొలాలతో పాటు ఎత్తైన పొలాలలో పనిచేయడానికి స్వచ్ఛంద సేవకులను ఆకర్షించాల్సి వచ్చింది.
మెట్ల సాగు క్షేత్రాలు
[మార్చు]
టివానాకు ప్రజలు ఉపయోగించిన మరో సాంకేతికత కొండలు, పర్వతాల వాలు మీద మెట్ల సాగు క్షేత్రాల నిర్మాణాల వాడకం. ఈ మెట్ల సాగు క్షేత్రాలు పర్వతాలలోని ఎత్తైన ప్రదేశాలలో ఉన్న జలాశయాల నుండి ఏడాది పొడవునా నీటిని అందించడంలో బాగా ఉపయోగపడ్డాయి.[14] ఈ మెట్ల సాగు క్షేత్రాలు కొండ వాలులను మెట్ల వంటి నిర్మాణాలగా మార్చాయి. ఇవి చిన్న, పరిమిత ప్రాంతంలో వ్యవసాయానికి స్థలాన్ని పెంచడంలో, అధిక ఎత్తులో మంచు నుండి పంటను రక్షించడంలో, అన్నింటికంటే ముఖ్యంగా, నీటిని నిలుపుకోవడంలో బాగా ఉపయోగపడ్డాయి. [18]నేడు ఈ పొలాలు ఆధునిక వ్యవసాయం ద్వారా మార్పులకు గురయ్యాయి.[18] దున్నడం కోసం, సరిహద్దులను సర్దుబాటు చేయడం కోసం మెట్ల వంటి నిర్మాణం గోడలను తొలగించారు. ఇది కోత పెరగడానికి, వాలుగా ఉన్న భూభాగంగా మారడానికి దారితీసింది.[18]
కోచా
[మార్చు]టివానాకు ప్రజలు ఉపయోగించిన మరో సాంకేతికత 'కోచాలు'. ఇవి కాలువల వ్యవస్థ ద్వారా అనుసంధానించబడిన చిన్న బేసినులుగా కూడా పిలువబడే లోతైన భూభాగ ప్రాంతాలు.[14] వీటిని వ్యవసాయ క్షేత్రాలుగా, పశువుల మేత ప్రాంతాలుగా, నీటి రిజర్వాయర్లుగా ఉపయోగించేవారు. ఇవి నేటికీ ప్రకృతి దృశ్యంలో సమూహాలుగా కనిపిస్తాయి. వాటి లోతైన స్వభావం నీరు నిలవడానికి వీలు కల్పించింది. కరువు కాలాలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది. ఎందుకంటే ఈ చిన్న బేసినులు కొంత తేమను నిలుపుకుంటాయి.[14] కొన్నిసార్లు ఈ నిర్మాణాలను ఒకే సమయంలో బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు.[19]
పతనం
[మార్చు]సుమారు 1000వ సంవత్సరం నాటికి టివానాకు రాజ్యపు అతిపెద్ద కాలనీ (మోకెగ్వా), రాజధాని పట్టణ కేంద్రం కొన్ని దశాబ్దాలలోనే వదిలివేయబడటంతో టివానాకు సిరామికు వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయింది.[20] టివానాకు రాజ్యానికి ముగింపు తేదీని కొన్నిసార్లు 1150 వరకు పొడిగిస్తారు. కానీ ఇది కేవలం ఎత్తైన పొలాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. పట్టణ నివాసాన్ని లేదా సిరామికు ఉత్పత్తిని కాదు. ఒక ప్రతిపాదిత వివరణ ఏమిటంటే తీవ్రమైన కరువు కారణంగా ఎత్తైన పొలాల సాగు పద్ధతులు నిరుపయోగంగా మారాయి. ఆహార మిగులు తగ్గింది. దానితో పాటు ఉన్నత వర్గాల అధికారం కూడా క్షీణించి అది రాజ్య పతనానికి దారితీసింది.అయితే ఈ వాదన సవాలు చేయబడింది.[21] ఇప్పుడు కరువు పతనం జరిగిన తర్వాత మాత్రమే పాక్షికంగా మరింత మెరుగైన సాంస్కృతిక, వాతావరణ కాలక్రమాలు ప్రారంభమైందని సూచిస్తున్నాయి. [20][22]
ఇది తివానాకు పతనానికి అంతర్గత సామాజిక పరిణామాలు దారితీశాయని సూచించే ప్రత్యామ్నాయ సిద్ధాంతాలకు మరింత మద్దతు ఇస్తుంది. రాజధానిలోని కొన్ని ప్రాంతాలు ఉద్దేశపూర్వక విధ్వంసానికి గురైనట్లు సంకేతాలను చూపిస్తున్నాయి. అయినప్పటికీ ఇది ఏ సమయంలోనైనా జరిగి ఉండవచ్చు. సూర్య ద్వారం వంటి ఏకశిలా ద్వారాలు పడగొట్టబడి, విరగ్గొట్టబడ్డాయి.తివానాకు కాలం ముగిసే నాటికి పుతుని సముదాయం తగలబెట్టబడింది. ఆహార నిల్వ జాడీలు పగలగొట్టబడ్డాయి. ఇది విధ్వంసకర సంఘటన జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలివేయడాన్ని సూచిస్తుంది. ఈ సమయం నాటికే మోక్వెగ్వా, ఇస్లా డెల్ సోలు ద్వీపంలోని కాలనీలు కూడా వదిలివేయబడ్డాయి. [23]
తివానాకు సామ్రాజ్యం పతనం చిలీలోని మపుచే సమాజంలో అనేక మార్పులకు దారితీసి దక్షిణం వైపు వలసల తరంగానికి కారణమైందని ఊహించబడింది. [24][25]ఇది మాపుచే భాష, పుక్వినా భాష నుండి 'అంటు' (సూర్యుడు), 'కాల్కు' (మాంత్రికుడు), 'కుయెన్' (చంద్రుడు), 'చాడి' (ఉప్పు), 'న్యూక్వె' (తల్లి) వంటి అనేక అన్యపదాలను ఎలా పొందిందో వివరిస్తుంది.[24] టాం డిల్లేహే, ఆయన సహోద్యోగులు టివానాకు పతనం దక్షిణ-మధ్య చిలీ లోని మాపుచే భూములలోకి వ్యవసాయ పద్ధతులు వ్యాపించడానికి దారితీసిందని సూచిస్తున్నారు. ఈ పద్ధతులలో బుడి సరస్సు లోని ఎత్తైన పొలాలు, లుమాకో లోయలో కనిపించే కాలువలతో కూడిన పొలాలు ఉన్నాయి.[25] మాపుచేలు, హుయిలిచేల మధ్య ఉన్న ఆండియను మతం లోని కొన్ని అంశాలు కూడా టివానాకు ప్రభావంతో ముడిపడి ఉన్నాయని సూచించబడింది.[26]
... కొత్త అనువైన వాతావరణాల కోసం చెల్లాచెదురైన జనాభా, సుమారుగా c. 1100 – c. 1300 మధ్య దక్షిణ-మధ్య, దక్షిణ ఆండీసు ప్రాంతాలలో వలసలు సాంకేతిక వ్యాప్తి రెండింటి సుదూర ప్రభావాలకు కారణమై ఉండవచ్చు ...
— టాం డిల్లేహే సహోద్యోగులు.[25]
మతం
[మార్చు]
టివానాకు మత విశ్వాసాల గురించి తెలిసిన విషయాలు పురావస్తు శాస్త్ర వివరణ కొన్ని పురాణాల ఆధారంగా ఉన్నాయి. ఇవి బహుశా ఇంకాలకు స్పానిషు వారికి సంక్రమించి ఉండవచ్చు. వారు చాలా మంది దేవతలను ఆరాధించినట్లు తెలుస్తోంది.
సూర్య ద్వారం అనేది సాధారణ స్మారక చిహ్నం. కాని పరిమాణంలో ఉన్న ఒకే రాతితో చేసిన నిర్మాణం. దాని కొలతలు ఆ ప్రదేశంలో ఇతర సాధారణ పరిమాణ భవనాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇది కలససయ వద్ద కనుగొనబడింది. కానీ పుమాపుంకు వద్ద కనుగొనబడిన ఇతర ద్వారాల సారూప్యత కారణంగా ఇది వాస్తవానికి అక్కడ ఉన్న ద్వారాల శ్రేణిలో ఒక భాగమని భావిస్తున్నారు.ఇది దాని ఏకైక, గొప్ప కుడ్యశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఇది వ్యవసాయ ఆరాధన కోసం క్యాలెండరు చిహ్నాలు లేదా సహజ శక్తులతో చుట్టుముట్టబడిన ఒక ప్రధాన దేవతా రూపాన్ని సూచిస్తుందని భావిస్తున్నారు. విరాకోచాతో పాటు సూర్య ద్వారంలో మరొక విగ్రహం ఉంది. ఈ విగ్రహం వాతావరణానికి సంబంధించినదని నమ్ముతారు:
అల్టిప్లానో పర్యావరణ వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యంతో సన్నిహితంగా ముడిపడి ఉన్న సహజ శక్తుల వివిధ అంశాలను వ్యక్తిగతీకరించిన ఒక ఖగోళ ఉన్నత దేవుడు: సూర్యుడు, గాలి, వర్షం, వడగళ్ళు – సంక్షిప్తంగా, వ్యవసాయ ఉత్పత్తిని సానుకూలంగా లేదా ప్రతికూలంగా నేరుగా ప్రభావితం చేసే వాతావరణ అంశాల వ్యక్తిగతీకరణ
దీనికి సౌర ముసుగుతో కప్పబడిన పన్నెండు ముఖాలు ఉన్నాయి. దాని పునాది వద్ద పరిగెడుతున్న లేదా మోకరిల్లిన ముప్పై బొమ్మలు ఉన్నాయి.ఈ విగ్రహం పన్నెండు నెలలు, ప్రతి నెలకు ముప్పై రోజులు ఉన్న క్యాలెండరుకు ప్రాతినిధ్యం వహిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
ఇతర ఆధారాలు టివానాకులో పూర్వీకుల ఆరాధన వ్యవస్థను సూచిస్తున్నాయి. తరువాతి ఇంకాల మాదిరిగానే, మమ్మీ కట్టలు, అస్థిపంజర అవశేషాలను భద్రపరచడం, ఉపయోగించడం, పునర్వ్యవస్థీకరించడం వంటివి ఈ విషయాన్ని సూచించవచ్చు.ఈ ప్రాంతంలోని తరువాతి సంస్కృతులు సామాజిక ఉన్నత వర్గాల కోసం "చుల్పా" అని పిలువబడే పెద్ద "భూమి మీద నిర్మించిన సమాధి గదులను" ఉపయోగించాయి.ఇలాంటి కానీ చిన్న నిర్మాణాలు టివానాకు ప్రదేశంలో కనుగొనబడ్డాయి.
తరువాతి ఇంకాల మాదిరిగానే, టివానాకు నివాసులు కూడా మృతులకు సంబంధించి ఇలాంటి ఆచారాలు, కర్మలను పాటించి ఉండవచ్చని కోలాటా సూచిస్తున్నారు. అకపాన తూర్పు భవనంలో పూర్వీకుల సమాధుల ఆధారాలు ఉన్నాయి. అకపాన తూర్పులోని మానవ అవశేషాలు ప్రదర్శన కోసం కాకుండా, సరైన అంత్యక్రియల కోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. అస్థిపంజరాల మీద అనేక కోత గుర్తులు ఉన్నాయి. ఇవి మరణానంతరం మాంసాన్ని తొలగించడం లేదా ఎముకలను వేరు చేయడం ద్వారా ఏర్పడి ఉండవచ్చు. ఆ తర్వాత అవశేషాలను బయట వదిలివేయకుండా, కట్టలుగా కట్టి పూడ్చిపెట్టారు.
టివానాకు ప్రజలు అకపానా అని పిలువబడే ఒక భవనం పైన మానవ బలులు ఇచ్చేవారు. ప్రజలను మరణించిన కొద్దిసేపటికే కడుపు చీల్చి, ముక్కలు చేసి, అందరూ చూసేలా ఉంచేవారు. ఈ ఆచారం దేవతలకు అంకితం చేసే ఒక రూపం అని ఊహించబడింది. మానవ బలిలో బాధితులను ముక్కలుగా నరకడం, అవయవాలను వేరు చేయడం, చెత్తలో పారవేయడానికి ముందు ప్రకృతి శక్తులకు, మాంసాహార జంతువులకు వదిలివేయడం వంటివి ఉండేవి.బలి ఇవ్వబడిన ఒక వ్యక్తి టిటికాకా బేసినుకు చెందినవాడు కాదని పరిశోధనలో తేలింది. దీనివల్ల బలులు ఎక్కువగా ఇతర సమాజాలకు చెందిన వ్యక్తులవే అయి ఉండవచ్చని భావించడానికి ఆస్కారం ఏర్పడింది.
వాస్తుశిల్పం - కళ
[మార్చు]
వాస్తుశిల్పం - శిల్పకళ
[మార్చు]
టివానాకు స్మారక వాస్తుశిల్పం అసాధారణమైన పనితనంతో కూడిన పెద్ద రాళ్లతో నిర్మించబడింది. తరువాతి ఇంకాల రాతి నిర్మాణ శైలికి భిన్నంగా టివానాకు రాతి వాస్తుశిల్పం సాధారణంగా క్రమబద్ధమైన వరుసలలో పేర్చబడిన దీర్ఘచతురస్రాకారపు యాష్లరు దిమ్మలను ఉపయోగిస్తుంది. వారి స్మారక కట్టడాలకు తరచుగా విస్తృతమైన మురుగునీటి పారుదల వ్యవస్థలు అమర్చబడ్డాయి. అకపాన, పుమాపుంకు నిర్మాణాల మురుగునీటి పారుదల వ్యవస్థలలో త్రిక (రాగి/ఆర్సెనికు/నికెలు) కాంస్య నిర్మాణ బిగింపుల ద్వారా కలిపి ఉంచబడిన ఎర్ర ఇసుకరాయి దిమ్మలతో కూడిన గొట్టాలు ఉన్నాయి. అకపాన-ఆకారపు నిర్మాణ బిగింపులు లోహపు కడ్డీలను చల్లగా సుత్తితో కొట్టి తయారు చేయబడ్డాయి. దీనికి విరుద్ధంగా పుమాపుంకు బిగింపులు కరిగిన లోహాన్ని-ఆకారపు గూళ్లలో పోయడం ద్వారా సృష్టించబడ్డాయి. [27]ఈ దిమ్మలకు చదునైన ముఖాలు ఉంటాయి. వాటిని అమర్చేటప్పుడు సరిచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే గాడుల వల్ల దిమ్మలను తాడుల సహాయంతో వాటి స్థానంలోకి జరపడం సాధ్యమవుతుంది. ఈ ప్రదేశం ఈ శిలాఖండాల మీద చెక్కబడిన చిత్రాలు, డిజైన్లు, చెక్కిన ద్వారాలు, భారీ రాతి ఏకశిలల నుండి ఆకర్షణీయంగా ఉంటుంది. [28]
టివానాకుకు రాతి శిలాఖండాలను సరఫరా చేసిన గనులు ఈ ప్రదేశం నుండి గణనీయమైన దూరంలో ఉన్నాయి. ఈ ప్రదేశంలోని నిర్మాణాలలో ఉపయోగించిన ఎర్ర ఇసుకరాయి, పెట్రోగ్రాఫికు విశ్లేషణ ద్వారా 10 కిమీ(6.2 మై) ద్వారా దూరంలో ఉన్న ఒక గని నుండి వచ్చినట్లు నిర్ధారించబడింది – ఈ రాళ్లలో అతిపెద్దది 131 మెట్రికు టన్నుల బరువు ఉంటుందని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఒక అద్భుతమైన దూరం. [29]అత్యంత విస్తృతమైన చెక్కడాలు, ఏకశిలలను సృష్టించడానికి ఉపయోగించిన ఆకుపచ్చ ఆండెసైటు రాళ్లు, టిటికాకా సరస్సు అవతల ఉన్న కోపాకబానా ద్వీపకల్పం నుండి వచ్చాయి.[29] ఒక సిద్ధాంతం ప్రకారం 40 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఈ భారీ ఆండెసైట్యు రాళ్లను టిటికాకా సరస్సు మీదుగా సుమారు 90 కిమీ(56 మై) దూరం రెల్లు పడవలలో రవాణా చేసి ఆ తరువాత శ్రమతో కూడిన పద్ధతిలో మరో 10 కిమీ(6.2మై) దూరం నగరం వరకు లాగారు.[30]
తివానాకు శిల్పం సాధారణంగా భారీ, చదునైన చతురస్రాకార కళ్ళతో బ్లాకు, స్తంభాల లాంటి బొమ్మలను కలిగి ఉంటుంది. నిస్సారమైన ఉపశమనం చెక్కడంతో వివరంగా ఉంటుంది. అవి తరచుగా పోన్సు మోనోలితు లేదా బెన్నెటు మోనోలితు వంటి ఆచార వస్తువులను కలిగి ఉంటాయి. కొన్ని అకపానా మీద ఉన్న బొమ్మ వంటి తెగిపోయిన తలలను పట్టుకుని కనుగొనబడ్డాయి. ఇది బహుశా ప్యూమా-షమనును సూచిస్తుంది. ఈ చిత్రాలు సంస్కృతి ఆచారబద్ధంగా మానవ శిరచ్ఛేదం చేయడాన్ని సూచిస్తాయి. అదనపు ఆధారాలుగా, అకపానా కింద తలలేని అస్థిపంజరాలు కనుగొనబడ్డాయి.
ఇతర కళలు
[మార్చు]టివానాకు ప్రజలు ప్రకాశవంతమైన రంగులు, మెట్ల నమూనాలతో కూడిన సిరామిక్సు, వస్త్రాలను కూడా తయారు చేశారు. సాధారణ వస్త్ర రూపాలలో టేపుస్ట్రీలు, ట్యూనికులు ఉన్నాయి. ఒక ముఖ్యమైన సిరామికు కళాఖండం 'కిరు'. ఇది ఒక పానపాత్ర. దీనిని వేడుకల తర్వాత ఆచారబద్ధంగా పగలగొట్టి, ఇతర వస్తువులతో పాటు సమాధులలో ఉంచేవారు. కాలక్రమేణా సిరామిక్సు శైలి మారింది. తొలికాలపు సిరామిక్సు "గరుకుగా పాలిషు చేయబడిన, లోతైన గీతలు గల బ్రౌనువేరు, మెరుగుపెట్టిన బహుళ-రంగుల గీతలు గల పాత్రలు" ఉండేవి. తరువాత 3వ టివానాకు దశలో క్వేయా శైలి ప్రాచుర్యం పొందింది. "ఇది మృదువైన, లేత గోధుమ రంగు సిరామికు ముద్దతో పాత్రలు తయారుచేయబడేవి". ఈ సిరామిక్సులో నైవేద్య గిన్నెలు, ఉబ్బెత్తు అడుగుభాగం గల పూల కుండీలు ఉన్నాయి. [31]టివానాకు కళలో 'స్టాఫు గాడు' ఒక సాధారణ మూలాంశం. [32]
ప్రతిమా వస్తువులు సాధారణంగా పశువుల కాపరులు, విజయ చిహ్నంగా తెచ్చిన తలలు, బలిపశువులు, పుమా, జాగ్వారు వంటి పిల్లి జాతి జంతువులను చిత్రీకరించాయి. ఆచార మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ఇటువంటి చిన్న, సులభంగా తీసుకెళ్లగల వస్తువులు ప్రధాన కేంద్రం నుండి సామంత కేంద్రాలకు మతాన్ని, ప్రభావాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి. వీటిని చెక్క, చెక్కిన ఎముక, వస్త్రంతో తయారు చేశారు. వీటిలో ధూపం వేసే పాత్రలు, చెక్కతో చెక్కబడిన మత్తు కలిగించే పొడి మాత్రలు, మానవ చిత్రపట పాత్రలు ఉన్నాయి.[32] మోచే సంస్కృతి వలెనే, టివానాకు చిత్రపటాలు కూడా వ్యక్తిగత లక్షణాలను వ్యక్తపరిచాయి. [33] టిటికాకా సరస్సులోని ఒక తీర్థయాత్ర కేంద్రమైన పారిటి ద్వీపంలో టివానాకు మానవ ప్రతిమా పాత్రల ఉత్తమ సేకరణలలో ఒకటి కనుగొనబడింది. ఈ పాత్రలు వ్యక్తిగత మానవ పోలికలను కలిగి ఉన్నాయి. టివానాకు దుస్తులు, ఆభరణాల శైలుల గురించి చాలా సమాచారాన్ని వెల్లడిస్తాయి. రేడియోకార్బను డేటింగు ప్రకారం వాటిని 900, 1050 సంవత్సరాల మధ్య భూమిలో పాతిపెట్టారు. కాబట్టి, టివానాకు సామ్రాజ్యం పతనమయ్యే సమయంలో స్థానిక ఉన్నత వర్గాల వారు, యాత్రికులు ద్వీపంలోని ఆలయాన్ని ఆచారబద్ధంగా విడిచిపెట్టే క్రమంలో భాగంగా వాటిని పగలగొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. [34]
ఆండియను రాగి తవ్వకం, లోహశాస్త్రం టివానాకు రాజనీతి కంటే వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనది అయినప్పటికీ [35][36][37]ఈ రాజ్యంలో అనేక రాగి వస్తువులు సుమారుగా 5% ఆర్సెనిక్ 4% నికెల్ కలిగి ఉండే లక్షణాలతో కూడిన మిశ్రమలోహాలతో ఉత్పత్తి చేయబడ్డాయి. [38]
లుకుర్మాటా
[మార్చు]కటారి లోయలో ఉన్న లుకుర్మాటా టివానాకుతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఒక పెద్ద నివాస ప్రాంతం. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం మొదటిసారిగా స్థాపించబడిన ఇది ఒక ప్రధాన ఆచార కేంద్రంగా అభివృద్ధి చెందింది. టివానాకు పతనం తర్వాత, లుకుర్మాటా వేగంగా క్షీణించి, తిరిగి ఒక చిన్న గ్రామంగా మారిపోయింది.
వారి సంస్కృతితో సంబంధం
[మార్చు]టివానాకు సంస్కృతి వారు మిడిలు హొరైజను కాలం సంస్కృతితో (ప్రధానంగా మధ్య, దక్షిణ పెరూలో కేంద్రీకృతమై ఉంది) ఆధిపత్యాన్ని పంచుకున్నారు. అయినప్పటికీ వారు ఉత్తరాన కూడా ముఖ్యమైన ప్రదేశాలను నిర్మించినట్లు కనుగొనబడింది (సెర్రో పపాటో శిధిలాలు). వారి సంస్కృతి దాదాపు ఒకే సమయంలో ఉద్భవించి, పతనమైంది; ఇది పెరూ దక్షిణ ఉన్నత ప్రాంతాలలో 500 మైళ్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఈ రెండు రాజ్యాల మధ్య సంబంధం తెలియదు. కళలో వారు పంచుకున్న చిహ్నాల ద్వారా ఈ రెండింటి మధ్య స్పష్టమైన పరస్పర చర్య ఉన్నట్లు రుజువైంది. ఈ రెండు శైలులలోని ముఖ్యమైన అంశాలు (ఉదాహరణకు, చీలిక కన్ను, ట్రోఫీ తలలు కర్ర పట్టుకున్న ప్రొఫైలు బొమ్మలు) టిటికాకా బేసిను ఉత్తర ప్రాంతంలోని మునుపటి పుకారా సంస్కృతి నుండి ఉద్భవించినట్లు కనిపిస్తుంది.
టివానాకు వారు తమ ప్రభావ పరిధి అంతటా విస్తృతంగా ఉన్న మునుపటి ఆండియను చిహ్నాలను ఉపయోగించి ఒక శక్తివంతమైన భావజాలాన్ని సృష్టించారు. వారు విస్తృతమైన వాణిజ్య మార్గాలను, షమానిస్టికు కళను ఉపయోగించారు. టివానాకు కళలో సహజసిద్ధమైన పద్ధతిలో వక్రరేఖల శైలిలో చిత్రీకరించబడిన, స్పష్టమైన, రూపురేఖలు గల బొమ్మలు ఉండేవి. అయితే వారి కళ అదే చిహ్నాలను మరింత నైరూప్య, సరళరేఖల శైలిలో సైనిక పద్ధతిలో ఉపయోగించింది.[39]
మూలాలు
[మార్చు]- ↑ Heggarty, P.; Beresford-Jones, D. (2013). "Andes - linguistic history". In Ness, I; P., Bellwood (eds.). The Encyclopedia of Global Human Migration. Wiley-Blackwell. pp. 401–409.
- ↑ Goldstein, Paul (2007). "Settlement patterns and Altiplano colonization - new models and evidence from the Tiwanaku diaspora". In Williams, Verónica (ed.). Sociedades Precolombinas Surandinas. pp. 155–187.
- ↑ Bandy, Matthew (2013). "Tiwanaku Origins and Early Development - The Political and Moral Economy of a Hospitality State". In Vranich, Alexei; Stanish, Charles (eds.). Visions of Tiwanaku. Cotsen Institute of Archaeology. pp. 135–150. ISBN 978-0-917956-09-6.
- ↑ Andrews, Anthony P. (1995). First Cities. St. Remy Press. p. 158. ISBN 0-89599-043-1. Retrieved 26 July 2022.
- ↑ Stanish, Charles (2003). Ancient Titicaca - The Evolution of Complex Society in Southern Peru and Northern Bolivia. University of California Press. p. 166. ISBN 978-0-520-23245-7.
- ↑ Blom, Deborah E. and John W. Janusek. "Making Place: Humans as Dedications in Tiwanaku", World Archaeology (2004): 123–141.
- ↑ Isbell, William H.; "Wari and Tiwanaku - International Identities in the Central Andean Middle Horizon", 731–751.
- ↑ Goldstein, Paul (1993). Tiwanaku Temples and State Expansion - A Tiwanaku Sunken-Court Temple in Moquegua, Peru.
- ↑ Hoshower, Lisa M. (1995). Artificial Cranial Deformation at the Omo M10 Site - A Tiwanaku Complex from the Moquegua Valley, Peru.
- ↑ Experience on the Frontier - A Tiwanaku Colony's Shifts Over Time
- ↑ Smith, Michael E. (2004), "The Archaeology of Ancient Economies", Annu. Rev. Anthrop. 33: 73–102.
- ↑ Bahn, Paul G.; Lost Cities, New York, Welcome Rain, 1999.
- ↑ Bruhns, K. (1994), Ancient South America, Cambridge University Press, 424 pp.
- 1 2 3 4 Albarracin-Jordan, Juan (September 1996). "Tiwanaku Settlement System: The Integration of Nested Hierarchies in the Lower Tiwanaku Valley". Latin American Antiquity. 7 (3): 183–210. doi:10.2307/971574. ISSN 1045-6635. JSTOR 971574. S2CID 155785477.
- ↑ Kolata, Alan L.; Ortloff, Charles (May 1989). "Thermal analysis of Tiwanaku raised field systems in the Lake Titicaca Basin of Bolivia". Journal of Archaeological Science. 16 (3): 233–263. Bibcode:1989JArSc..16..233K. doi:10.1016/0305-4403(89)90004-6. ISSN 0305-4403.
- ↑ Kolata, Alan L.; Valley of the Spirits - A Journey into the Lost Realm of the Aymara, Hoboken, New Jersey, John Wiley and Sons, 1996.
- ↑ Bandy, Matthew (2005), "Energetic efficiency and political expediency in Titicaca Basin raised field agriculture", Journal of Anthropological Archaeology, 24, 271–296.
- 1 2 3 Kent, Jonathan D. (July 1989). Denevan, William M.; Mathewson, Kent; Knapp, Gregory (eds.). "Pre-Hispanic Agricultural Fields in the Andean Region. Proceedings 45th International Congress of Americanists". American Antiquity. BAR International Series 359. 54 (3). Bogota: 668–669. doi:10.2307/280805. ISSN 0002-7316. JSTOR 280805.
- ↑ Guillet, David (1 January 1989). "Andean Ecology and Civilization - An Interdisciplinary Perspective on Andean Ecological Complementarity. Edited by Shozo Masuda, Isumi Shimada, and Craig Morris El Arbol y el Bosque en la Sociedad Andina. By Juan Ansión with a prologue by Chris E. Van Dam Arid Land Use Strategies and Risk Management in the Andes: A Regional Anthropological Perspective. Edited by David L. Browman". Journal of Forest History. 33 (1): 44–45. doi:10.2307/4005057. ISSN 0094-5080. JSTOR 4005057.
- 1 2 Owen, Bruce (2005). "Distant Colonies and Explosive Collapse - The Two Stages of the Tiwanaku Diaspora in the Osmore Drainage". Latin American Antiquity. 16 (1): 45–81. doi:10.2307/30042486. JSTOR 30042486. S2CID 149450446.
- ↑ Calaway, Michael (2005). "Ice-cores, Sediments and Civilisation Collapse - A Cautionary Tale from Lake Titicaca". Antiquity. 79 (306): 778–790. doi:10.1017/S0003598X00114929. S2CID 131156410.
- ↑ Lechleitner, Franziska; et al. (2017). "Tropical rainfall over the last two millennia - evidence for a low-latitude hydrologic seesaw". Nature. 7 45809. Bibcode:2017NatSR...745809L. doi:10.1038/srep45809. PMC 5381098. PMID 28378755.
- ↑ The Role of Silver Ore Reduction in Tiwanaku State Expansion Into Puno Bay, Peru
- 1 2 Moulian, Rodrígo; Catrileo, María; Landeo, Pablo (2015). "Afines quechua en el vocabulario mapuche de Luis de Valdivia" [Akins Quechua words in the Mapuche vocabulary of Luis de Valdivia]. Revista de lingüística teórica y aplicada (in స్పానిష్). 53 (2): 73–96. doi:10.4067/S0718-48832015000200004. Retrieved 13 January 2019.
- 1 2 3 Dillehay, Tom D.; Pino Quivira, Mario; Bonzani, Renée; Silva, Claudia; Wallner, Johannes; Le Quesne, Carlos (2007), Cultivated wetlands and emerging complexity in south-central Chile and long distance effects of climate change, Antiquity, 81 (2007), 949–960
- ↑ Moulian, Rodrigo; Catrileo, María; Hasler, Felipe (2018). "Correlatos en las constelaciones semióticas del sol y de la luna en las áreas centro y sur andinas". Boletín del Museo Chileno de Arte Precolombino. 23 (2). doi:10.4067/S0718-68942018000300121.
- ↑ name="Sangines1970">Ponce Sanginés, C. and G. M. Terrazas, 1970, Acerca De La Procedencia Del Material Lítico De Los Monumentos De Tiwanaku, publication no. 21, Academia Nacional de Ciencias de Bolivia.
- ↑ Isbell, W. H., 2004, Palaces and Politics in the Andean Middle Horizon. in S. T. Evans and J. Pillsbury, eds., pp. 191–246, Palaces of the Ancient New World Dumbarton Oaks Research Library and Collection, Washington, D.C.
- 1 2 Ponce Sanginés, C. and G. M. Terrazas, 1970, Acerca De La Procedencia Del Material Lítico De Los Monumentos De Tiwanaku, publication no. 21, Academia Nacional de Ciencias de Bolivia.
- ↑ Harmon, P.; 2002, "Experimental Archaeology - Interactive Dig, Archaeology Magazine, "Online Excavations" web page, Archaeology magazine.
- ↑ Bray, Tamara L.; The Archaeology and Politics of Food and Feasting in Early States and Empires, New York, Kluwer Academic/Plenum Publishers, 2003
- 1 2 Stone-Miller, Rebecca (2002) [1995]. Art of the Andes - from Chavin to Inca.
- ↑ Rodman, Amy Oakland (1992). Textiles and Ethnicity - Tiwanaku in San Pedro de Atacama.
- ↑ Korpisaari, Antti; Pärssinen, Martti (2011). Pariti - The Ceremonial Tiwanaku Pottery of an Island in Lake Titicaca. Helsinki: Finnish Academy of Science and Letters.
- ↑ Scattolin, M. Cristina; Bugliani, M. Fabiana; Cortés, Leticia; Pereyra Domingorena y C. Marilin Calo, Lucas (2010). "Una máscara de cobre de 3000 años. Estudios arqueometalúrgicos y comparaciones regionales" [A 3000 year-old copper mask. Archeometalurgical analysis and regional comparisons]. Boletín del Museo Chileno de Arte Precolombino (in స్పానిష్). 15 (online ed.). Santiago de Chile: 25–46. doi:10.4067/s0718-68942010000100003. ISSN 0718-6894.
- ↑ Powell, Eric A. (September–October 2017). "Andean Copper Age". Archaeology. 70 (5): 20. ISSN 0003-8113.
- ↑ Eichler, A.; Gramlich, G.; Kellerhals, T.; Tobler, L.; Rehren, Th.; Schwikowski, M. (2017). "Ice-core evidence of earliest extensive copper metallurgy in the Andes 2700 years ago". Nature. 7 41855. Bibcode:2017NatSR...741855E. doi:10.1038/srep41855. PMC 5282569. PMID 28139760.
- ↑ Maldonado, Blanca; Rehren, Thilo; Pernicka, Ernst; Núñez, Lautaro; Leibbrandt, Alexander. "Early copper metallurgy in Northern Chile". Open Journal of Archaeometry. 1 (26): 128–130.
- ↑ Stone-Miller, Rebecca (2002) [1995]. Art of the Andes - from Chavin to Inca.