Jump to content

టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి
తొడిమెల్ల కృష్ణమూర్తి

1950 (age 7576)
మదనపల్లె, అన్నమయ్య జిల్లా
వృత్తిమునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ క్లర్క్
ప్రసిద్ధికథా రచయిత, నవలా రచయిత
Notable workపది కథా సంపుటాలు, ఆరు నవలల ప్రచురణ
Spouseకళావతమ్మ
పిల్లలుశివభారతమూర్తి, ప్రసన్నలక్ష్మి
తల్లిదండ్రులుటి.ఎస్.ఆంజనేయులు, కమలాక్షి

టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి అన్నమయ్య జిల్లా, మదనపల్లెకు చెందిన రచయిత. ఇతని రచనలు వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతని పూర్తి పేరు తొడిమెల్ల కృష్ణమూర్తి. ఇతడు 1950లో మదనపల్లెలో టి.ఎస్.ఆంజనేయులు, కమలాక్షి దంపతులకు జన్మించాడు. మునిసిపాలిటీలో అడ్మినిస్ట్రేషన్ గుమాస్తాగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇతని భార్య పేరు బి. కళావతమ్మ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[1]

రచనలు

[మార్చు]

ఇతడు 1968 నుండి రచనలు చేస్తున్నాడు. 1971లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో తొలి కథ ప్రచురితమైంది. ఇతడు సుమారు 300కు పైగా కథలు, 10 పెద్దకథలు, 6 నవలలు, అనేక వ్యాసాలు రచించాడు. ఇతని కథలు ఆంధ్రపత్రిక, స్వాతి, ఆంధ్రభూమి, రచన, శ్రీలక్ష్మి, సురభి, కథాకేళి, ఆంధ్రజ్యోతి, జయమ్, ప్రియదత్త, నడుస్తున్న చరిత్ర, ఈనాడు, తెలుగు జ్యోతి, రమ్యభారతి వంటి అనేక తెలుగు దిన, వార, మాస పత్రికలలో వెలువడ్డాయి. ఇతని రచనలు 20 గ్రంథాలుగా ప్రకటితమయ్యాయి. కొన్ని రచనలు కన్నడ, ఆంగ్ల భాషలలో అనువదించబడ్డాయి. ఇతని రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. ఈ రచనలు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టాయి.

గ్రంథాలు

[మార్చు]
  • టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి కథలు (కథాసంపుటి) - 2003
  • అడ్డదారులు (కథాసంపుటి) - 2006
  • కొత్త బంగారులోకం (నవల) - 2006, 2010
  • కలువ విరిసింది - 2009
  • ఈ గాలి నాది - ఈ నేలనాది (కథాసంపుటి) - 2010
  • ఘటోద్గజపురం గాథలు (వ్యంగ్య హాస్య కథాసంపుటి) - 2011
  • దృశ్యకావ్యం (కథాసంపుటి) - 2012
  • చిత్తూరు జిల్లా – వందేళ్ళ కథాసారథులు (మొదటిభాగము) (ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 30 మంది కథకుల సంపూర్ణ పరిచయాలు) – 2013
  • T.S.A. కథ-2012 (2012వ సం॥లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథల సంపుటి) - 2013
  • T.S.A. కథ-2013 (2013వ సం॥లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథలసంపుటి) - 2014
  • T.S.A. కథ-2014 (2014వ సం.లో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి కథల సంపుటి) - 2015
  • కలల రాజ్యం (డైరెక్టు నవల) - 2015
  • మీరు కథ వ్రాయాలనుకుంటున్నారా? (నూతన రచయితలకు ఓ గైడ్) - 2015
  • ఆయుధం (నవల) - 2016
  • T.S.A. కథ – 2016 (2016వ సంవత్సరంలో ప్రచురితమైన కృష్ణమూర్తి రచనల సంపుటి) - 2019
  • T.S.A. కథ 2017 (2017వ సంత్సరంలో ప్రచురితమైన T.S.A. కృష్ణమూర్తి రచనల సంపుటి) = 2019
  • సంపూర్ణ ఘటోద్గజపురం గాథలు హాస్య, వ్యంగ్య కథా సిరీస్ - 2021
  • భయంలేని బ్రతుకు – (డైరెక్టు నవల) - 2023

సాహిత్య సేవ

[మార్చు]

ఇతడు రచయితగానే కాకుండా సాహిత్య కార్యకర్తగా అనేక సభలు, కవిసమ్మేళనాలు నిర్వహించాడు. మదనపల్లె సాహితీ కళావేదిక అనే సాహిత్య సంస్థకు అధ్యక్షునిగా, ప్రజా చైతన్య స్రవంతి ఉపాధ్యక్షునిగా ఆ ప్రాంతంలో అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో సాహిత్య చైతన్యాన్ని రేకెత్తించాడు.

పురస్కారాలు

[మార్చు]

ఇతని సాహిత్యసేవను గుర్తించి అనేక సంస్థలు పురస్కారాలను, సన్మానాలను అందించాయి. వీటిలో కొన్ని:

  • ‘కలువ విరిసింది’, ‘కలలరాజ్యం’ నవలలకు స్వర్గీయ కుప్పం రెడ్డెమ్మ సాహిత్య సొసైటీ (చిత్తూరు) వారి అవార్డు
  • ‘విశిష్టవ్యక్తి’ పురస్కారం, మెక్సా ,మదనపల్లె
  • ‘సీమ సాహిత్యరత్నం’ పురస్కారం
  • పీలేరు కల్చరల్ అకాడమీ పురస్కారం
  • చి.ర.సం. (చిత్తూరు జిల్లా రచయితల సంఘం) పురస్కారం
  • మ.ర.సం. (మదనపల్లె రచయితల సంఘం) పురస్కారం
  • చైతన్య భారతి పురస్కారం
  • కొడవలూరు బలరామయ్య ప్రోత్సాహక అవార్డు – నవశంఖారావం, నెల్లూరు
  • సోమేపల్లి సాహితీ పురస్కారం – రమ్యభారతి, విజయవాడ
  • సి.పి. బ్రౌన్ అకాడమీ, హైదరాబాదు వారి పురస్కారం
  • పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉత్తమ గ్రంథ పురస్కారం - 2008 ‘కొత్త బంగారులోకం’ నవలకు
  • అవ్వా వేంకట అప్పారావు వచన కావ్య సాహితీ పురస్కారం - ‘ఆయుధం’ నవలకు
  • ‘సేవారత్న’ పురస్కారం - మదనపల్లె ఫైన్ ఆర్ట్స్ అకాడమీ
  • ‘సాహితీమిత్ర’ పురస్కారం
  • ‘కళారత్న’ అవార్డు - భరతముని ఆర్ట్స్ అకాడమీ
  • కామాక్షీబాయి, నారాయణరావు స్మారక సాహితీ పురస్కారం - హరివిల్లు, లలిత కళావేదిక చిత్తూరు
  • నందమూరి సాహితీ అవార్డు, మానస సాహిత్య అకాడమీ, విజయవాడ
  • ఉగాది పురస్కారం - మలిశెట్టి సీతారాం స్మారక (MSR) ఎడ్యుకేషనల్ సొసైటీ, గుర్రంకొండ
  • వార్షికోత్సవ పురస్కారం - తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, పలమనేరు
  • కవిత స్మారక జాతీయపురస్కారం- ఆయుధం నవలకు
  • గోవిందరాజా సీతాదేవి సాహిత్య పురస్కారం - ఆయుధం నవలకు
  • పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అవార్డు
  • విశిష్ట సాహితీ సేవా పురస్కారం - ప్రజాచైతన్య స్రవంతి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "పరిచయం". ముల్కనూర్ లైబ్రరీ. వేముల శ్రీనివాసులు. Retrieved 16 April 2025.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]