Jump to content

టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళై

వికీపీడియా నుండి
తిరువీళిమిళై ఎస్.నటరాజసుందరం పిళ్ళై
திருவீழிமிழலை எஸ். நடராஜ சுந்தரம் பிள்ளை
సోదరుడు టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళై(ఎడమ)తో కలిసి నటరాజసుందరం పిళ్ళై (కుడి)
సోదరుడు టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళై(ఎడమ)తో కలిసి నటరాజసుందరం పిళ్ళై (కుడి)
Background information
Born(1896-11-09)1896 నవంబరు 9
తిరువీళిమిళై
Genresకర్ణాటక సంగీతం
Occupationనాదస్వర విద్వాంసుడు
Instrumentనాదస్వరం

టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళై ఒక కర్ణాటక సంగీత నాదస్వర కళాకారుడు. ఇతడు తన సోదరుడు సుబ్రహ్మణ్య పిళ్ళైతో కలిసి తిరువీళిమిళై బ్రదర్స్ పేరుతో జంట కచేరీలు చేశాడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా తిరువీళిమిళై అనే పుణ్యక్షేత్రంలో 1898, జూలై 14న ఒక నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు[1]. ఇతడు తన అన్న టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళైతో కలిసి మొదట తన తండ్రి స్వామినాథపిళ్ళై వద్ద సంగీతాన్నినేర్చుకున్నాడు.[2] తరువాత ఎ.ఆర్.స్వామినాథపిళ్ళై, కోనేరిరాజపురం వైద్యనాథ అయ్యర్, కాంచీపురం నయనపిళ్ళై, ఉమయల్పురం దొరైస్వామి అయ్యర్, ఉమయల్పురం స్వామినాథ అయ్యర్, కుంభకోణం జానకీ అమ్మాళ్ వంటి విద్వాంసుల వద్ద శిక్షణ తీసుకున్నారు. వీరు సంస్కృత, తెలుగు భాషలను క్షుణ్ణంగా అభ్యసించారు. దానితో వీరు ఆలపించే కీర్తనల సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకుని రాగాలను స్పష్టంగా పలికించేవారు. నటరాజసుందరం పిళ్ళై మొదట గాత్ర సంగీత కచేరీలు చేసేవాడు. అయితే సెంబర్‌కోయిల్ రామస్వామి పిళ్ళై సూచన మేరకు సుబ్రహ్మణ్యపిళ్ళైతో కలిసి జంటగా నాదస్వర కచేరీలు చేయసాగాడు. వీరి మొదటి నాదస్వర కచేరీ 1925లో జరిగింది.

వీరిని అనేక పీఠాలు, జమీందారీ సంస్థానాలు సన్మానించాయి. ఇతడిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 1972లో అవార్డును ప్రదానం చేసింది. 1977లో తమిళ్ ఇసై సంఘం "ఇసై పెరారిజ్ఞర్" అనే బిరుదును ప్రదానం చేసింది.1994లో మద్రాసు సంగీత అకాడమీ ఇతనికి టి.టి.కె.అవార్డును ఇచ్చి గౌరవించింది.[3] ఇతడు తిరువాయూరు శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా సేవలను అందించాడు.

మూలాలు

[మార్చు]
  1. web master. "T. S. Natarajasundaram Pillai". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI.[permanent dead link]
  2. Suganthy Krishnamachari (19 March 2020). "Nagaswaram giants of Tiruveezhimizhalai". The Hindu. Retrieved 20 March 2021.
  3. web master. "TTK Award Recipients". The Music Academy, Madras. The Music Academy, Madras. Archived from the original on 24 ఫిబ్రవరి 2021. Retrieved 20 March 2021.