టి.కిషన్ కుమార్ రెడ్డి
టి.కిషన్ కుమార్ రెడ్డి | |||
జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం -హైదరాబాద్
| |||
పదవీ కాలం 2025 ఫిబ్రవరి 18 – 2028 ఫిబ్రవరి 17 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జాతీయత | ![]() | ||
వృత్తి | ప్రొఫెసర్, జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ |
టి.కిషన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆయన 2025 ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ( జె ఎన్ టి యు అనగా Jawaharlal Nehru Technological University (J.N.T.U), తెలంగాణ రాజధాని హైదరాబాదులో గల ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయం. వైస్ చాన్స్‌లర్‌గా నియమితుడయ్యాడు. ఆయన ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగాడు[1][2][3].
జననం విద్యాభ్యాసం
[మార్చు]టి.కిషన్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, లో జన్మించాడు. ఆయన 1978 లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.టెక్ చదివి,ఐఐటి మద్రాసు నుంచి యంటెక్ విద్యా పూర్తి చేశారు. యు ఎస్ నుండి పిహెచ్ డి పట్టా అందుకున్నారు.
వృత్తి జీవితం
[మార్చు]టి. కిషన్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధుల్లో చేరి, యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పనిచేశాడు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో విశేష అనుభవం కలిగిన శ్రాస్త్రవేత్త. 1994 నుండి 2016 వరకు జేఎన్ టియూ హెచ్ లో డైరెక్టర్ గా పని చేశారు. పండిత్ దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీలో 2016 నుండి 2018 వరకు వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
ఉపకులపతిగా
[మార్చు]జేఎన్టీయూ ఉపకులపతిగా ప్రొఫెసర్ టి. కిషన్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన వారిలో కిషన్ కుమార్ రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించడంతో. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 18 ఫిబ్రవరి 2025 న ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఛార్జి వీసీ వి.బాలకిష్టా రెడ్డి, రెక్టార్ డాక్టర్ కె. విజయ్ కుమార్ రెడ్డి , రిజిస్ట్రార్ డాక్టర్ కె.వెంక టేశ్వరరావుతో సహా అన్ని విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు ఆయనకు స్వాగతం పలికారు. కిషన్ కుమార్ రెడ్డి జేఎన్టీయూలోనే మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యుడిగా, రెక్టార్గా పనిచేసి పదవీవిరమణ పొందారు. 2016 ఆగస్టు నుంచి 2018 ఏప్రిల్ వరకు గుజరాత్ లోని డిట్ దీనదయాళ్ పెట్రోలియం వర్సిటీకి, 2019 జనవరి నుంచి 2019 మార్చి వరకు ఒడిశాలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి వీసీగా సేవలందించారు. [డిల్లీ]]లోని ఏఐసీటీఈలో రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవ లప్మెంట్కు అడ్వైజర్గా, హైదరాబాద్ లోని ల్యాబ్ రీసెర్చ్ కౌన్సిల్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ సభ్యుడిగా వ్యవహరించారు.
మూలాలు
[మార్చు]- ↑ Correspondent, D. C. (2025-02-19). "Prof. Kishen Kumar Reddy is New JNTU VC". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2025-02-20.
- ↑ Velugu, V6 (2025-02-19). "జేఎన్టీయూహెచ్ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రెడ్డి బాధ్యతలు". V6 Velugu. Retrieved 2025-02-20.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugu, ntv (2025-02-18). "JNTU: జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీగా టీ కిషన్ కుమార్ రెడ్డి నియామకం". NTV Telugu. Retrieved 2025-02-20.