Jump to content

టి.డి. రాజేగౌడ

వికీపీడియా నుండి
కె.సి. వీరేంద్ర పప్పీ

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2018
ముందు డి.ఎన్. జీవరాజ్
నియోజకవర్గం శృంగేరి

వ్యక్తిగత వివరాలు

జననం 1958 జూలై 27
శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

టి.డి. రాజేగౌడ (జననం 27 జూలై 1958) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, సినీ నటుడు. ఆయన కర్ణాటక శాసనసభకు శృంగేరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

టి.డి. రాజేగౌడ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2018 శాసనసభ ఎన్నికలలో చిత్రదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్ పై 1,989 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్ పై 201 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 59,171 ఓట్లతో విజేతగా నిలవగా, డి.ఎన్. జీవరాజ్ 58,970 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[3]

టి.డి. రాజేగౌడ 2024 జనవరి 26న పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka election results 2023: Full list of winners". The Indian Express (in ఇంగ్లీష్). 2023-05-13. Archived from the original on 13 October 2023. Retrieved 2023-12-16.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Karnataka Assembly Elections 2023: Sringeri". Election Commission of India. 13 May 2023. Archived from the original on 4 May 2025. Retrieved 4 May 2025.
  4. "34 MLAs given chairman posts for boards and corps, Haris BDA chairman". The Times of India. 27 January 2024. Retrieved 20 January 2025.
  5. "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.