టి.ప్రకాశ్ గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలకంటి ప్రకాష్ గౌడ్
టి.ప్రకాశ్ గౌడ్


పదవీ కాలం
2009 - 2014
2014 - 2018
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 05 మే 1959
మైలార్‌దేవపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ
జీవిత భాగస్వామి సులోచన
సంతానం ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం మైలార్‌దేవపల్లి

తొలకంటి ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[4]

జననం, విద్య[మార్చు]

ప్రకాష్ గౌడ్ 1959, మే 5న గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవపల్లి గ్రామంలో జన్మించాడు. పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రకాష్ గౌడ్ కు సులోచనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్, ఆ పార్టీలో నాయకుడిగా కీలకపాత్ర పోషించాడు. 2009లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 2014లో జరిగిన 1వ తెలంగాణ శాసనసభకు తెలుగుదేశం పార్టీ పై రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై రెండుసార్లు గెలుపొందాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] [7]

శాసనసభకు పోటీ[మార్చు]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ఓట్లు ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
2009 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెలుగుదేశం పార్టీ బొర్రా జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 7485
2014 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌[8] తెలుగుదేశం పార్టీ బొర్రా జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ 25881
2018 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రేణుకుంట్ల గణేష్ తెలుగుదేశం పార్టీ 58373

ఇతర వివరాలు[మార్చు]

ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు[మార్చు]

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. "Tolkanti Prakash Goud MLA of Rajender Nagar Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  3. "Rajendranagar Electiion Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-09-23. Retrieved 2021-09-23.
  4. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
  5. "T. Prakash Goud(TDP):Constituency- RAJENDRANAGAR(RANGAREDDY) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-23.
  6. Sakshi (12 December 2018). "ప్రకాష్‌.. హ్యాట్రిక్‌". Retrieved 4 March 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  7. "RAJENDRANAGAR Election Result 2018, Winner, RAJENDRANAGAR MLA, Telangana". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
  8. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.