టి.బి. రాధాకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిస్ (రిటైర్డ్) టి.బి. రాధాకృష్ణన్
టి.బి. రాధాకృష్ణన్


కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
4 ఏప్రిల్ 2019 – 28 ఏప్రిల్ 2021
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు బిశ్వనాథ్ సోమద్దర్ (acting)
తరువాత రాజేష్ బిందాల్ (acting)

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
1 జనవరి 2019 – 3 ఏప్రిల్ 2019
సూచించిన వారు రంజన్ గొగోయ్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు పదవి ప్రారంభం
తరువాత రాఘవేంద్ర సింగ్ చౌహాన్ (acting)

ప్రధాన న్యాయమూర్తి హైదరాబాద్ హైకోర్టు
పదవీ కాలం
7 జూలై 2018 – 31 డిసెంబరు 2018
సూచించిన వారు దీపక్ మిశ్రా
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు దిలీప్ బాబాసాహెబ్ భోసలే (acting)
తరువాత పదవి ప్రారంభం

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
18 మార్చి 2017 – 6 జూలై 2018
సూచించిన వారు జెఎస్ ఖెహర్
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు దీపక్ గుప్తా
తరువాత అజయ్ కుమార్ త్రిపాఠి

కేరళ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
14 అక్టోబరు 2004 – 17 మార్చి 2017
సూచించిన వారు రమేష్ చంద్ర లాహోటి
నియమించిన వారు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-29) 1959 ఏప్రిల్ 29 (వయసు 64)
కొల్లాం, కేరళ, భారతదేశం
మరణం 2023 ఏప్రిల్ 3(2023-04-03) (వయసు 63)
కొచ్చి, కేరళ, భారతదేశం
జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి మీరా సేన్
పూర్వ విద్యార్థి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లా కాలేజ్, కోలారు, కర్ణాటక

తొట్టాటిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ (29 ఏప్రిల్ 1959 – 3 ఏప్రిల్ 2023) భారతీయ న్యాయమూర్తి. రాధాకృష్ణన్ కలకత్తా హైకోర్టు, తెలంగాణ హైకోర్టు,[1] హైదరాబాద్ హైకోర్టు, ఛత్తీస్‌గఢ్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు.

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

రాధాకృష్ణన్ 1959, ఏప్రిల్ 29న ఎన్. భాస్కరన్ నాయర్, కె. పరుకుట్టి అమ్మ దంపతులకు కొల్లాం గ్రామంలో జన్మించాడు.[2] కొల్లాంలోని సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్, ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ విద్యను పూర్తిచేసి తిరువనంతపురంలోని ఆర్య సెంట్రల్ స్కూల్, ట్రినిటీ లైసియం, ఎఫ్ఎమ్ఎన్ కాలేజ్, (కొల్లాం), కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లా కాలేజ్ (కోలారు) లలో ఉన్నత విద్యను చదివాడు.[3][4]

వృత్తి జీవితం[మార్చు]

1983, డిసెంబరులో న్యాయవాదిగా చేరిన రాధాకృష్ణన్ తిరువనంతపురంలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. తరువాత కొచ్చిలోని కేరళ హైకోర్టుకు మారాడు. అక్కడ పౌర, రాజ్యాంగ, పరిపాలనా విషయాలలో ప్రాక్టీస్ చేశాడు. 2004, అక్టోబరు 14న కేరళ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.[3][4] 2017, మార్చి 18న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడుయ్యాడు. హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయబడి 2018, జూలై 7న ప్రమాణ స్వీకారం చేశాడు. 2019, జనవరి 1న తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయగా, 2019 ఏప్రిల్ 7న ప్రమాణ స్వీకారం చేశాడు.

మరణం[మార్చు]

బి. రాధాకృష్ణన్ అనారోగ్యంతో బాధపడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 3 ఏప్రిల్ 2023న మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. "High Court of Chhattisgarh - Sitting Judges". highcourt.cg.gov.in. 1 January 2019. Retrieved 16 June 2021.
  2. "High Court of Chhattisgarh - Sitting Judges". highcourt.cg.gov.in. Archived from the original on 16 ఆగస్టు 2019. Retrieved 16 June 2021.
  3. 3.0 3.1 Website of Kerala High Court Retrieved 16 June 2021.
  4. 4.0 4.1 "Website of National Bar Association of India". Archived from the original on 17 January 2013. Retrieved 16 June 2021.
  5. Prajasakti (3 April 2023). "తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌ కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.