Jump to content

టి.వి.ఆర్.కె. మూర్తి

వికీపీడియా నుండి


టి.వి.ఆర్.కె. మూర్తి పూర్తి పేరు తిమ్మరాజు విశ్వపతి రామ కృష్ణ మూర్తి. వీరి కలం పేరు విశ్వపతి. ఆధ్యాత్మిక ఇంజనీర్, కార్టూనిస్ట్, తిరుమలేశుడి విశేషాలపై ఆధ్యాత్మిక పుస్తకాలు రాశారు.

విశ్వపతిగారి వయస్సు 66 ఏళ్లు, విద్య: వరంగల్ NIT(రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ) లో ఎంటెక్ 1982 లో పూర్తిచేశారు. గత వృత్తి ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్ గా ఉద్యోగం. ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాలు రచన, ఉచిత పంపిణీ. నగరంలోని మోతీనగర్ చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు. కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పంచుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిదర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన ఈయన...ఆల్విన్ కంపెనీ లోను, ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పనిచేశారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో 'సమ్ ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు. తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్లో lordofsevenhills.com వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన ఆనవాయితీ. ఎందరికైనా... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకాలను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు.

కార్టూన్ పుస్తకం

[మార్చు]

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికలో ప్రచురించబడ్డ వీరి కార్టూన్లతో 'సిన్సియర్లీ యువర్స్' పేరుతో 2016లో పుస్తకంగా ప్రచురించారు

బయటి లింకులు

[మార్చు]
  • టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) books Internet Archive Org. :

https://archive.org/details/@yedavalli_sudarshan_reddy/lists/5/tvrk_murthy?sort=title