టి.వి.కె.శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.వి.కె.శాస్త్రి

టి.వి.కె.శాస్త్రి. భారతీయ కళల పరిరక్షణకు కృషి చేసిన కళాపిపాసి.

శాస్త్రి ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని చెన్నైలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావుకు సన్నిహితంగా ఉండి సంస్థానం కార్యక్రమాలు చూసేవారు. అనంతరం కళాసాగర్ సంస్థలో పని చేస్తుండగా సంగీత విద్వాంసులు, కళాకారులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో సంబంధాలు ఏర్పడ్డాయి.

చెన్నై, టి.నగర్‌లో ఉంటున్న శాస్త్రి 1981లో పుట్టపర్తి సత్యసాయి ఆశీస్సులు, సూచనలు మేరకు జాతి సమైక్యత కోసం అన్ని రంగాల కళాకారులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు మద్రాసు తెలుగు అకాడమీ, భారత్ కల్చరల్ సమైక్యతా కమిటీ (బీసీఐసీ)లను స్థాపించారు. మద్రాసు తెలుగు అకాడమీకి చీఫ్ కన్వీనర్‌గా 1981 నుంచి 2008 వరకు పనిచేసి 78 ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ రెండు సంస్థల ద్వారా కళాకారులను, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రికి భార్య లక్ష్మి, కుమారుడు రాంప్రసాద్/కోడలు పద్మావతి/మనుమడు వివేక్, కుమార్తెలు విజయలక్ష్మి/అల్లుడు డా.సురెష్/మనుమలు- ప్రశాంత్,అక్షయ్- సాయిశ్రీ/అల్లుడు శరజ్/మనుమరాళ్లు శ్రియ,నిధి ఉన్నారు. వారు శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి అనేక పుట్టినరొజులు పుట్టపర్తి నందు నిర్వహించారు

టి.వి.కె. శాస్త్రి మార్చి 2 2014 న తన 80 వ యేట అనారోగ్యంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు.