టి.వి.గోపాలకృష్ణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.వి.గోపాలకృష్ణన్
టి.వి.గోపాలకృష్ణన్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంత్రిపునితుర విశ్వనాథన్ గోపాలకృష్ణన్
జననం (1932-06-11) 1932 జూన్ 11 (వయసు 91)
మూలంకేరళ, భారతదేశం
వృత్తిగాయకుడు, వాయులీన విద్వాంసుడు, మృదంగ విద్వాంసుడు


త్రిపునితుర విశ్వనాథన్ గోపాలకృష్ణన్ ఒక కర్ణాటక సంగీత, హిందుస్తానీ సంగీత విద్వాంసుడు.

ప్రారంభ జీవితం[మార్చు]

ఇతడు సంగీతకారుల కుటుంబంలో 1932, జూన్ 11వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిపునితుర గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తండ్రి టి.జి.విశ్వనాథ భాగవతార్ కొచ్చిన్ రాజ కుటుంబానికి ఆస్థాన సంగీత విద్వాంసుడు, త్రిస్సూర్‌లోని ఎస్.కె.వి.కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. [2] ఇతడు నాలుగవ యేట మృదంగం నేర్చుకోవడం ప్రారంభించి ఆరవ యేట కొచ్చిన్ ప్యాలెస్‌లో మొదటి కచేరీ చేశాడు.[3] ఇతడు చెంబై వైద్యనాథ భాగవతార్ వద్ద మృదంగం నేర్చుకున్నాడు.[3][4]

వాయులీన విద్వాంసుడు టి.వి.రమణి, ఘట వాద్య విద్వాంసుడు టి.వి.వాసన్ ఇతని సోదరులు.[5]

వృత్తి[మార్చు]

ఇతడు కర్ణాటక సంగీతంలోను, హిందుస్తానీ సంగీతంలోను సమానమైన ప్రతిభ కలవాడు. ఇతనికి గాత్ర సంగీతంతో పాటు, మృదంగం, వయోలిన్‌లలో కూడా నైపుణ్యం ఉంది.[6] ఇతడు "ఇండియన్ జాజ్" సృష్టికర్తగా ప్రశంసలు అందుకున్నాడు. ఇతడు ప్రపంచ కళాకారులైన జార్జ్ హారిసన్, బాబ్ డైలాన్, జాన్ హాండీ, ఫ్రాంక్లిన్ కీర్మ్యెర్, డాన్ పీక్, సీగ్‌ఫ్రైడ్ కటరర్, కరోలా గ్రే, పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అల్లా రఖా మొదలైన వారితో కలిసి అనేక దేశాలలో పర్యటించాడు.[7]

ఇతనికి 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 2012 భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.[8]

2018లో "కర్ణాటక సంగీతంలో లయత్వం" అనే అంశం మీద పరిశోధించి భారతీదాసన్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పొందాడు.[9] ఇతడు 1984లో ఇండియన్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీ (AIMA) అనే లాభాపేక్ష లేని ఒక సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా సమాజంలో సంగీతకారులకు అవకాశాలు కల్పించాడు.[10] ఈ సంస్థ గురుకుల పద్ధతిలో వివిధ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాలను, వాద్యసంగీతాలను అన్ని వయసులవారికి నేర్పించి మంచి నైపుణ్యం కలిగిన గాయకులను, విద్వాంసులను, కళాకారులను తయారు చేసింది.[11]

అవార్డులు[మార్చు]

ఇతని ఐదు దశాబ్దాల వృత్తి జీవితంలో ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఇతడిని వరించాయి.

వాటిలో కొన్ని:

  • 2014లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి
  • 2012లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం
  • 1990లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే కర్ణాటక సంగీతం వాద్యం - మృదంగం విభాగంలో అవార్డు
  • సంగీత లయ సామ్రాట్
  • రోటరీ ఇంటర్నేషన ఉత్తమ పౌరుడు అవార్డు
  • కళైమామణి
  • బెంగళూరు రామసేవా మండలి వారిచే జీవిత సాఫల్య పురస్కారం.
  • స్వాతి తిరునాళ్ జీవిత సాఫల్య పురస్కారం.
  • సప్తగిరి సంగీత విద్వన్మణి పురస్కారం.
  • లెజెండ్ ఆఫ్ ఇండియా జీవిత సాఫల్య పురస్కారం.
  • దయానంద సరస్వతి జీవిత సాఫల్య పురస్కారం "ఆర్షకళా భూషణం"
  • శంకరాచార్య అవార్డు
  • ముద్ర అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్
  • భారత్ కళాకార్ వారి జీవిత సాఫల్య పురస్కారం

మూలాలు[మార్చు]

  1. Kumar, Raj (2003). Essays on Indian Music. Discovery Publishing House. p. 205. ISBN 81-7141-719-1.
  2. "Profiles of Artistes, Composers, Musicologists". Indian heritage. Retrieved 28 July 2009.
  3. 3.0 3.1 Jayakumar, G. (2 September 2005). "A maestro's music". The Hindu. Archived from the original on 18 నవంబరు 2006. Retrieved 28 July 2009.
  4. Rajan, Anjana (12 January 2007). "A time to every purpose". The Hindu. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 28 July 2009.
  5. Srinivasan, Meera (30 September 2010). "Renowned Ghatam exponent passes away". The Hindu (in Indian English). Retrieved 16 November 2020.
  6. "Chembai award for T.V. Gopalakrishnan". The Hindu. 17 August 2005. Archived from the original on 19 సెప్టెంబరు 2006. Retrieved 28 July 2009.
  7. "Pop and Jazz Guide". The New York Times. 21 May 2004. Retrieved 28 July 2009.
  8. "Padma awardees say they feel honoured". The Hindu. 26 January 2012. Retrieved 26 January 2012.
  9. "TVG researches Carnatic music, bags doctorate at 86". The Times of India. 22 February 2018. Retrieved 22 February 2018.
  10. "TVG AIMA | Academy of Indian Music and Arts". tvgaima.com. Archived from the original on 2020-10-31. Retrieved 2020-10-28.
  11. "TVG AIMA | Academy of Indian Music and Arts". tvgaima.com. Archived from the original on 2020-10-31. Retrieved 2020-10-28.