టి. భానుప్రసాద్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి. భానుప్రసాద్ రావు
టి. భానుప్రసాద్ రావు


పదవీ కాలం
మే 2 2009 - మే 1 2015
నియోజకవర్గం కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జనవరి 2016 నుండి 4 జనవరి 2022
నియోజకవర్గం కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 3 మే 1966
లోకపేట, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మంజులత రావు
సంతానం శ్రియ
నివాసం హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు, రియల్టర్
మతం హిందూ

తానిపర్తి భానుప్రసాద్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

టి. భానుప్రసాద్ రావు 1966, మే 3న తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, లోకపేట గ్రామంలో తానిపర్తి ప్రభాకర్‌రావు,[2] ప్రేమలత దంపతులకు జన్మించాడు. ఆయన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మారత్వాడ యూనివర్సిటీ నుండి 1989లో బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

టి.భానుప్రసాద్‌రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2008లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3]ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజీవ్ రహదారిపై వేసిన హౌస్ కమిటీ ఛైర్మన్‌గా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, మైనారిటీ సంక్షేమ సంఘం సభ్యుడిగా పని చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఆయన 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[4]

టి.భానుప్రసాద్‌ రావు 2016లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయనను మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌‌గా ప్రభుత్వం నియమించింది.[5] ఆయన 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[6] భానుప్రసాద్‌ రావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గల ఎన్నికల పరిశీలకుడిగా పని చేశాడు. భానుప్రసాద్‌రావు 10 డిసెంబర్ 2021లో తెలంగాణ శాసనమండలి కి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా మూడోసారి ఎన్నికయ్యాడు.[7]ఆయన 2022 ఫిబ్రవరి 21న శాస‌న‌మం‌డలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8][9]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Namasthe Telangana (25 April 2021). "ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు పితృవియోగం". Namasthe Telangana. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  3. ManaTelangana (7 December 2015). "లైన్ క్లియర్." Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  4. Andhrajyothy (10 December 2015). "12 స్థానాలు.. 59 నామినేషన్లు". www.andhrajyothy.com. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  5. Andhrajyothy (16 August 2020). "గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం". www.andhrajyothy.com. Archived from the original on 4 June 2021. Retrieved 4 June 2021.
  6. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 January 2022. Retrieved 12 January 2022.
  7. V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  8. HMTV (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురి ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
  9. Prabha News (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.