టి. రఘుమూర్తి
| టి. రఘుమూర్తి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2013 | |||
| ముందు | తిప్పేస్వామి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | చల్లకెరె | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1963 జూన్ 10 కడబనకట్టె | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| నివాసం | కడబనకట్టె, చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
టి. రఘుమూర్తి (జననం 10 జూన్ 1963) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు చల్లకెరె శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]టి. రఘుమూర్తి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చల్లకెరె శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కర్ణాటక జనతా పక్ష అభ్యర్థి కె.టి. కుమారస్వామిపై 23123 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం. రవీష్ కుమార్‌పై 13,539 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
టి. రఘుమూర్తి 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో చల్లకెరె శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం. రవీష్ కుమార్‌పై 16,450 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2024 జనవరి 26న కర్ణాటక రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Challakere". Election Commission of India. 13 May 2023. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.