టీవీ నారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డా.టీవీ నారాయణ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్య, సామాజిక రంగాలల్లో సుపరితుడైన వ్వక్తి. తెలంగాణా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. పాఠశాల అద్యాపకుడుగా జీవితం ఆరంబించిన వీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. వీరు 1925 వ సంవత్సరంలో జూలై 26 న జన్మించారు. మాజీ మంత్రి సదాలక్ష్మి వీరి భార్య. టీవీ నారాయణ సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన వారు.

విద్య[మార్చు]

నిజాం కళాశాలలో బి.ఎ. గణిత శాస్త్రము చదివిన వీరు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో ఎం.ఎ. పట్టా పొందారు. వీరు నిత్య విద్యార్థిగా వుంటూ తన 71 వ ఏట కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టాను పొందారు. వీరు అనేక సామజిక కార్యక్రమాల్లో పాల్గొని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి బందు సేవా మండలి స్థాపించారు. వేదాలు, ఉపనిషత్తులు చదివారు.

పురస్కారాలు[మార్చు]

భారత రాష్ట్రపతి చేతులమీదుగా వేద పండిత్ పురస్కారాన్ని ఆందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం నుండి ధర్మరత్న పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి దళిత రత్న పురస్కారాన్ని పొందారు. వీరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము 2016 లో పద్మశ్రీ పురస్కారముతొ గౌరవించింది.

రచనలు[మార్చు]

నారాయణ 20 వరకూ పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని:

  1. జీవనవేదం
  2. ఆర్షపుత్ర శతకం[1]
  3. భవ్యచరిత శతకం
  4. ఆత్మదర్శనం (కవితా సంపుటి)
  5. అమర వాక్సుధాస్రవంతి (ఉపనిషత్తులపై వ్యాస సంపుటి)

ప్రస్తుత హోదా[మార్చు]

ప్రస్తుతం నల్గొండ మహాత్మ గాంధి విశ్వవిద్యాలయం కార్య నిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు. ఆర్య ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షులు. భాగ్య నగర్ ఖాది కమిటీ ఉపాద్యక్షులు.

  1. E-books available at Tirumala Tirupati Devasthanams, తెలుగు విభాగం