టీ బోర్డ్ ఆఫ్ ఇండియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం   కోల్ కాతా

టీ బోర్డ్ ఆఫ్ ఇండియా (The Tea Board of India) అనేది భారత ప్రభుత్వ సంస్థ. భారతదేశంలో టీ ఉత్పత్తి, ప్రాసెసింగ్, అంతర్గత వాణిజ్యం, దేశం నుండి టీ ఎగుమతిని ప్రోత్సహించడానికి స్థాపించబడింది. టీ చట్టం ఆమోదించడంతో 1953 సంవత్సరంలో స్థాపించబడింది, దీని ప్రధాన కార్యాలయం కోల్ కతా లో ఉంది. పి.కె. సాహూ నేతృత్వంలో, ఐఒ ఎఫ్ ఎస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అభివృద్ధి కమిటీ, కార్మిక సంక్షేమం, ఎగుమతి ప్రమోషన్ అని పిలువబడే స్టాండింగ్ కమిటీలుగా విభజించబడింది. ఈ కమిటీలకు ఒక్కో చైర్ పర్సన్ ఉంటారు.[1]

చరిత్ర

[మార్చు]

సంవత్సరానికి 900,000 టన్నుల కంటే ఎక్కువ టీ ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద టీ ఉత్పత్తిదారుగా ఉంది. చైనా ఉత్పత్తి గుత్తాధిపత్యాన్ని అధిగమించడానికి పందొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశానికి టీని ప్రవేశపెట్టారు. 1850 లలో హిమాలయాల అడుగున ఉన్న డార్జిలింగ్ నగరం చుట్టూ ఉన్న పర్వత ప్రాంతం మొట్టమొదట టీ మొక్కలు నాటారు[2].

టీ బోర్డు మూలం 1903 సంవత్సరంలో ఇండియన్ టీ సెస్ బిల్లు ఆమోదించబడినప్పటి నుండి ఉంది. తేయాకు ఎగుమతులపై సెస్ విధించడానికి ఈ బిల్లులో అవకాశం కల్పించారు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని భారతదేశం లోపల, వెలుపల భారతీయ టీ పరిశ్రమని ప్రోత్సహించడానికి ఉపయోగించాలి. సెంట్రల్ టీ బోర్డు చట్టం 1949, ఇండియన్ టీ కంట్రోల్ చట్టం, 1938 కింద వరుసగా పనిచేసిన సెంట్రల్ టీ బోర్డు, ఇండియన్ టీ లైసెన్సింగ్ కమిటీ తరువాత టీ బోర్డు వచ్చింది. అప్పటి అంతర్జాతీయ టీ ఒప్పందం ప్రకారం తేయాకు సాగు, టీ ఎగుమతిని నియంత్రించడం, టీ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి వాటికే మునుపటి రెండు సంస్థల కార్యకలాపాలు పరిమితమయ్యాయి. పార్లమెంటు సభ్యులు, టీ ఉత్పత్తిదారులు, తేయాకు వ్యాపారులు, టీ బ్రోకర్లు, వినియోగదారులు, ప్రధాన టీ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు, కార్మిక సంఘాల ప్రభుత్వాల ప్రతినిధులతో సహా 31 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేశారు.[3]

టీ చట్టం, 1953 లోని సెక్షన్ (4) ప్రకారం టీ బోర్డును 1954 ఏప్రిల్ 1 న ఒక చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేశారు.  అత్యున్నత సంస్థగా,  టీ పరిశ్రమ  మొత్తం అభివృద్ధి, టీ పరిశ్రమలోని వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ భారత ప్రభుత్వం నియమించిన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తో సహా 32 మంది సభ్యులు ఈ బోర్డులో ఉంటారు. బోర్డు ప్రధాన కార్యాలయం కోల్ కతాలో ఉంది దీనితో బాటు రెండు జోనల్ ఈశాన్య ప్రాంతంలో అస్సాంలోని జోర్హాట్, దక్షిణ ప్రాంతంలో తమిళనాడులోని కూనూర్ వద్ద  ఉన్నాయి. అంతేకాకుండా, టీ పండించే అన్ని ప్రధాన రాష్ట్రాలు, నాలుగు మెట్రో నగరాలలో 18 ప్రాంతీయ కార్యాలయాలతో  విస్తరించి ఉన్నది. టీ పరిశ్రమ పురోగతి  కోసం, లండన్, దుబాయ్, మాస్కోలో మూడు విదేశీ కార్యాలయాలు ఉన్నాయి.[4]

విధులు

[మార్చు]

టీ బోర్డు విధులలో ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం, తేయాకు నాణ్యతను మెరుగుపరచడం, తోటల కార్మికుల కోసం మార్కెట్ ప్రమోషన్, సంక్షేమ చర్యలు, పరిశోధన, అభివృద్ధిపరచడం,భాగస్వాములందరికీ గణాంక సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, వ్యాప్తి చేయడం బోర్డు మరొక ముఖ్యమైన విధి. నియంత్రణ సంస్థగా, టీ చట్టం కింద నోటిఫై చేసిన వివిధ నియంత్రణ ఉత్తర్వుల ద్వారా ఉత్పత్తిదారులు, తయారీదారులు, ఎగుమతిదారులు, టీ బ్రోకర్లు, వేలం నిర్వాహకులపై, గిడ్డంగి ల పై బోర్డు నియంత్రణ కలిగి ఉంటుంది[4].

ప్రస్తుత పరిస్థితి

[మార్చు]

టీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. అలాగే, చైనా, శ్రీలంక, కెన్యా,తర్వాత నాల్గవ అతిపెద్ద ఎగుమతి చేస్తుంది.

  • ఉత్పత్తి స్తబ్దుగా ఉంది, తక్కువ ఎగుమతి నాణ్యత కలిగిన టీ ఆకు.
  • ఆర్థిక పరిమితులు తోటలలో తక్కువ పెట్టుబడికి దారితీశాయి, అక్కడ 'టీ లీఫ్' నాణ్యత బాగా పడిపోయింది.
  • పెరుగుతున్న కార్మిక వ్యయాల డిమాండ్ కారణంగా మౌలిక సదుపాయాల భారీ కొరత, గణనీయమైన కార్మిక సమస్యలు తలెత్తడం.
  • వాతావరణ మార్పు, రవాణా ఖర్చుల పెరుగుదల వంటి ఇతర సమస్యలు పరిస్థితి టీ పరిశ్రమను మరింత దిగజార్చాయి.చాలా మంది వ్యవస్థీకృత నిపుణులైన పారిశ్రామిక వేత్తలు ఈ రంగాన్ని విడిచిపెట్టారు. ఫలితంగా తోటల పెంపకం చట్టం, టీ చట్టాన్ని పాటించని చిన్న టీ ఉత్పత్తిదారుల సంఖ్య పెరుగుతుంది.

ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు, కొత్త చట్టాలు, సంస్కరణల ద్వారా తేయాకు రంగాన్ని తిరిగి వృద్ధిమార్గం లోనికి తీసుకురావడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ తన వంతు కృషి చేస్తోంది.[5]  

మూలాలు

[మార్చు]
  1. "Tea Board of India". Unacademy (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-07.
  2. "A brief history of tea… in India". CAFÉS RICHARD. Retrieved 2023-01-07.
  3. Team, ClearIAS (2022-11-28). "Tea Board India". ClearIAS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-07.
  4. 4.0 4.1 "Tea Board". Mcommerce (in ఇంగ్లీష్). Retrieved 2023-01-07.
  5. "The Tea Board of India". GeeksforGeeks (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-07-03. Retrieved 2023-01-07.