టెంకాయచిప్ప శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టెంకాయచిప్ప శతకం రచయిత ఆంధ్రవాల్మీకి గా పేరు గన్న వావిలికొలను సుబ్బారావు

టెంకాయచిప్ప శతకం, ఆంధ్రవాల్మీకి గా పేరు గన్న వావిలికొలను సుబ్బారావు రచించాడు.

నేపథ్యం[మార్చు]

ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని పునరుద్ధరించడానికి ఒక కొబ్బరి చిప్పను బిక్షా పాత్రగా విరాళాలను పోగు చేశారు. ఈ సందర్భంగా ఈ శతకాన్ని అతను రచించాడు. [1] ఈ శతకాన్ని 1925 ఏప్రిల్ 6న ఒంటిమిట్ట కోదండరామస్వామి ఎదుట చదివి శ్రీరామచంద్రునికి అర్పించాడు. ఇందులో 155 పద్యాలున్నాయి. వీటిలో అధిక భాగం తేటగీతి పద్యాలు, మిగిలినవి కంద పద్యాలు. ఒక్క ఉత్పలమాల పద్యం కూర్చబడినది.

టెంకాయ చిప్పను చేతితో ధరించి ఊరూరా తిరిగి బిచ్చమెత్తి వచ్చిన ధనంతో అతను ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఎంత ధనం తనలో పడినా ఏదీ ఉంచుకొనక రామునకిచ్చి చివరకు ఖాళీ అయిన టెంకాయ చిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకాయ చిప్పా" అంటూ దానిమీద ఈ శతకాన్ని చెప్పిన మహాకవి వావికొలను సుబ్బారావు.[2]

శతకంలోని పద్యం[3][మార్చు]

ఆంధ్రవాల్మీకి హస్తంబునందు నిలిచి
రూప్యములు వేనవేలుగఁ బ్రోగుచేసి
దమ్మడైనను వానిలో దాఁచుకొనక
ధరణిజాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయచిప్ప

మూలాలు[మార్చు]

  1. "టెంకాయచిప్ప శతకము". Archived from the original on 2016-11-07. Retrieved 2017-02-28.
  2. Sarma, వీరిచే పోస్ట్ చెయ్యబడింది Satya Narayana. "ఆంద్ర వాల్మీకిపై వచ్చిన ఇరవై పద్యాలు". Retrieved 2021-05-02.
  3. "ఆంధ్ర వాల్మీకి". www.teluguvelugu.in. Archived from the original on 2021-05-02. Retrieved 2021-05-02.

బాహ్య లంకెలు[మార్చు]


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము