టెడ్డీబేర్ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టెడ్డీబేర్ దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9 న జరుపుకుంటారు. 2000 సంవత్సరంలో "వెర్మంట్" టెడ్డీబేర్ కంపెనీ వాళ్లు ఈ దినోత్సవమును ప్రారంభించారు. అమెరికాలో మొదలైన ఈ దినోత్సవమును నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున పిల్లలు, పెద్దలు తమ టెడ్డీబేర్లతో పాటు విందులు, వినోదాలు చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

కొన్ని సంగతులు[మార్చు]

  • అమెరికాకు చెందిన జాకీ మిలే అనే మహిళ వివిధ పరిమాణాల్లో ఉన్న 7,106 టెడ్డీ బొమ్మల్ని సేకరించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి టెడ్డీ మ్యూజియాన్ని 1984లో ఇంగ్లాండ్ లో ప్రారంభించారు.

టెడ్డీబేర్[మార్చు]

టెడ్డీబేర్ అనేది ఒక ఎలుగుబంటి బొమ్మ. ఈ బొమ్మలో మెత్తటి దూదిని కుక్కుతారు. దానికి సున్నితంగా ఉండే ఊలు అతికిస్తారు. ఇది చాలా దేశాల్లో పిల్లల ఆటవస్తువుగా ప్రాచుర్యం పొందింది. పుట్టిన రోజులకూ ఇతర పర్వ దినాల్లో వీటిని బహుమతులుగా ఇస్తుంటారు.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 09-09-2014 - (టెడ్డీ బొమ్మా... ఈ రోజు నీదేనమ్మా!)