టెన్జిన్ (కామి)
టెన్జిన్
విద్యలు, పాండిత్యం, అభ్యాసం
జపాన్కి చెందిన షింటో మతంలో , టెన్జిన్ (Tenjin) విద్యలకు , పాండిత్యం, అభ్యాసం, మేధస్సులకు ఇలవేల్పు కామి (దైవం).
హేయన్ కాలం నాటి ప్రసిద్ధ పండితుడు, కవి, రాజకీయవేత్త అయిన సుగవారా నో మిచిజానే (845–903) యొక్క దైవీకరణ రూపమే టెంజిన్.
టెన్ (天) అంటే ఆకాశం, జిన్ (神) అంటే దేవుడు లేదా దేవత . టెంజిన్, పేరుకి ఉన్న ఆకాశ దేవత అర్థం, రైజిన్ (ఉరుముల దేవుడు, a god of thunder)పేరుకి దాదాపు సమానంగా ఉంటుంది.
సుగవారా నో మిచిజానే
[మార్చు]జపనీస్ చరిత్రలో, సుగవారా నో మిచిజానే 9వ శతాబ్దం చివరలో, దేశంలో ఉన్న ఆ నాటి ప్రభుత్వంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. కానీ, 10వ శతాబ్దపు ప్రారంభంలో అతను ఫుజివారా వంశానికి చెందిన ప్రత్యర్థుల కుట్రలకు బలి అయ్యాడు. పదవీచ్యుతుడై, బహిష్కరణకు గురై క్యుషు ను చేరాడు. అలా 903లో ప్రవాసంలోనే మరణించాడు. జూలై 21, 930న, రాజధాని నగరాన్ని భారీ వర్షం, మెరుపులు అలుముకున్నాయి, అనేక మంది ఫుజివారా ప్రముఖులు మరణించారు, అలాగే మెరుపులు, వరదల మూలంగా సంభవించిన మంటలు వారి నివాసాలను చాలా వరకు ధ్వంసం చేశాయి. దాంతో చక్రవర్తి ధర్భారు, మిచిజానే కోపించిన ఆత్మ కారణంగానే అవాంతరాలు సంభవించాయని నిర్ధారణకు వచ్చింది. దానిని శాంతింపజేయడానికి, చక్రవర్తి మిచిజానే కి సంబందించిన అన్ని కార్యాలయాలను పునరుద్ధరించాడు, అధికారిక బహిష్కరణ పత్రాన్ని తగలబెట్టాడు. ఆ కవిని టెన్జిన్ పేరుతో పూజించాలని ఆదేశించాడు. టెన్జిన్ అంటే ఆకాశ దేవత . కిటానో వద్ద ఒక మందిరం నిర్మించారు; దానిని తక్షణమే నేరుగా ప్రభుత్వ మద్దతు లభించే మొదటి స్థాయి అధికారిక పుణ్యక్షేత్రంగా గుర్తించారు.
పండితుల పోషకుడిగా పరిణామం
[మార్చు]మొదటి కొన్ని శతాబ్దాల పాటు, టెన్జిన్ ప్రకృతి వైపరీత్యాల దేవుడిగా పూజాలందు కున్నాడు. అతనిని శాంతింపజేయడానికి, అతని శాపాలను నివారించడానికి పూజించేవారు. ఏది ఏమైనప్పటికీ, మిచిజానే తన జీవితకాలంలో ప్రసిద్ధ కవి, పండితుడు, హీయాన్ కాలంలో గొప్పవాడిగా, ఎడో కాలంలో పండితులు, విద్యావేత్తలు అతనిని పండిత పోషకుడిగా పరిగణించారు. క్రమంగా ఈ నాటికి, జనాదరణ పొందిన ఆనాటి ప్రకృతి వైపరీత్యాల ఆరాధనా దృక్పథం పూర్తిగా కనుమరుగు అయ్యింది.
టెన్జిన్ ప్రభావం ఇప్పటి పరీక్షల ఉత్తీర్ణతా సాధనలో చాలా బలంగా కనిపిస్తుంది. చాలా మంది పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు ముందు అతని మందిరంలో విజయం కోసం ప్రార్థిస్తారు, తమ విజయాలకు కృతజ్ఞతా పూర్వకంగా పునర్దర్శనాలకు వస్తారు.
టెన్జిన్‌కి సంబంధించిన విషయాలు
[మార్చు]మిచిజానే కి ఊమ్ (Ume) చెట్లంటే చాలా ఇష్టం. తన ప్రవాసంలో వ్రాసిన ఒక కవితలో, తనకు అతి ఇష్టమైన రాజధానిలోని ఊమ్ చెట్టు ఎడబాటు కు విలపిస్తాడు. దాంతో ఆ చెట్టు అతనితో కలిసి ఉండటానికి క్యోటో నుండి క్యుషులోని దజైఫుకు వెళ్లిందని పురాణాల కధనం. ఆ చెట్టు ఇప్పటికీ అతని మందిరపు ప్రదర్శనలో ఉంది. ఫలితంగా, టెన్జిన్ పుణ్యక్షేత్రాల్లో తరచుగా అనేక ఊమ్ చెట్లు నాటుతూ ఉంటారు. యాదృచ్ఛికంగా, ఈ చెట్లు పరీక్షా ఫలితాలు ప్రకటించే ఫిబ్రవరిలో వికసిస్తాయి, దాంతో ఆ సమయంలో టెంజిన్ పుణ్యక్షేత్రాలు పండుగను నిర్వహించడం సర్వసాధారణం.
టెన్జిన్‌తో ప్రత్యేకంగా అనుబంధం ఉన్న జంతువు ఎద్దు. ఎందుకంటే, పురాణాల ప్రకారం, మిచిజానే అంత్యక్రియల ఊరేగింపు సమయంలో, ఆ ఎద్దు అతని అవశేషాల బండిని లాగుతూ ఒక నిర్దిష్ట ప్రదేశం కంటే ముందుకు వెళ్లడానికి నిరాకరించింది, అదే చోట అతని మందిర నిర్మాణం జరిగింది.
పుణ్యక్షేత్రాలు
[మార్చు]ఈ కామి కి ప్రధాన పుణ్యక్షేత్రాలు క్యోటోలోని కిటానో టెన్మాన్-గూ, ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లోని దజైఫు టెన్మాన్-గూ, ముఖ్యమైన మొదటి మూడు క్షేత్రాలు కామకురాలోని ఎగారా టెన్జిన్ పుణ్యక్షేత్రం చుట్టుఉన్నాయి. అయితే, ఇవే కాకుండా ఇతరత్రా అతనికి అంకితం అయిన అనేక పుణ్యక్షేత్రాలు జపాన్ అంతటా ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలను టెన్మాన్-గూ (Tenman-gū (天満宮)) అని పిలుస్తారు. మూడు ప్రముఖ పుణ్యక్షేత్రాల సమూహాన్ని త్రీ గ్రేట్ టెన్జిన్ పుణ్యక్షేత్రాలు అంటారు .
ఇది కూడ చూడు
[మార్చు]- బెంజైటెన్ : జపనీస్ కామి ఆఫ్ ఇంటెలిజెన్షియా (హిందూ దేవత సరస్వతికి జపనీస్ పేరు).
- ఒమోయికేన్(Omoikane) : జ్ఞానం, సంగీతం, కళ, ప్రసంగం, జ్ఞానం, అభ్యాసం, మేధావుల పోషకుడైన జపనీస్ కామి .
- కుయ్ జింగ్ : పరీక్షల చైనీస్ దేవుడు.
- బ్రహ్మ : హిందూ సృష్టి దేవుడు; 'తమ వృత్తులలో జ్ఞానాన్ని ఉపయోగించుకునే' వారికి (ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు మొదలైనవారికి ) పోషకుడైన దేవుడు. )
- మినమోటో నో యోషియె : ఒక సమురాయ్ సుగావర ఏ మిచిజానే ఎలా టెంజిన్ గా మారాడో, అదే విధంగా ఇతను హాచిమంతారో మారాడు; ఇతను మినామోటో వంశానికి చెందిన పోషకుడు, పూర్వీకుల కామి.
- బెనెడిక్ట్ ఆఫ్ నర్సియా : విద్యార్థులు, పండితుల పోషకుడు.
- ఇమ్హోటెప్ : దేవుడైన ఒక పురాతన ఈజిప్షియన్ బహుముఖ ప్రజ్ఞాశాలి.
- ఎన్హేడువన్నా : ఒక సుమేరియన్ ప్రధాన పూజారిణి, ఆమె మరణం తర్వాత దైవంగా గుర్తింపు పొందింది.
మరింత చదవడానికి
[మార్చు]- షింటా నో ఇరోహా (神道のいろは), జింజా షిన్‌పోషా (神社新報社), 2004 ( ).
- మిహాసి, కెన్ (三橋健), వా గా యా నో షూక్యో: షింటో (わが家の宗教:神道), డైహోరీన్-కాకు(Daihōrin-Kaku 大法輪閣), 2003 ISBN 4-8046-6018-6.
బాహ్య లింకులు
[మార్చు]- ఎద్దు వెనుక భాగంలో చదువుతున్న టెన్జిన్ విగ్రహ చిత్రం, బెర్న్హైమర్ గార్డెన్స్, పసిఫిక్ పాలిసాడ్స్, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా, est. 1938. లాస్ ఏంజిల్స్ టైమ్స్ ఫోటోగ్రాఫిక్ ఆర్కైవ్ (సేకరణ 1429). UCLA లైబ్రరీ ప్రత్యేక సేకరణలు, చార్లెస్ E. యంగ్ రీసెర్చ్ లైబ్రరీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ .