టెలినార్
| రకం | ప్రభుత్వ సంస్థ రాష్ట్ర యాజమాన్యంలోని |
|---|---|
| మూస:Ose | |
| ISIN | NO0010063308 |
| పరిశ్రమ | దూరప్రసారం |
| స్థాపన | 1855 |
| ప్రధాన కార్యాలయం | ఫోర్నెబు, నార్వే |
కీలక వ్యక్తులు |
|
| ఉత్పత్తులు | ఫిక్స్డ్ లైన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, డిజిటల్ టెలివిజన్, ఐటి సేవలు, ఐపీటీవీ టెలిగ్రఫీ |
| బ్రాండ్లు |
|
| రెవెన్యూ | |
| Total assets | |
| Total equity | |
| యజమాని | నార్వే ప్రభుత్వం (54%) |
ఉద్యోగుల సంఖ్య | 11,000 (2023)[1] |
| అనుబంధ సంస్థలు | see this list |
| వెబ్‌సైట్ | https://www.telenor.com |
టెలినార్ ASA,[2] నార్వే ప్రభుత్వ యాజమాన్యంలోని బహుళజాతి టెలికమ్యూనికేషన్స్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ఓస్లోకు దగ్గరగా ఉన్న బెరమ్‌లోని ఫోర్నెబులో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటి. స్కాండినేవియా, ఆసియాలలో మాత్రమే ఇది దృష్టి కేంద్రీకరించింది. దీనికి నాలుగు నార్డిక్ దేశాలలో విస్తృతమైన బ్రాడ్‌బ్యాండ్, టీవీ పంపిణీ కార్యకలాపాలున్నాయి. మెషిన్-టు-మెషిన్ టెక్నాలజీ కోసం 10 సంవత్సరాల నాటి పరిశోధన, వ్యాపార శ్రేణి ఉంది. టెలినార్‌కు 8 దేశాలలో నెట్‌వర్క్‌లు ఉన్నాయి.[3]
టెలినార్ ఓస్లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదై ఉంది. 2015 నవంబరు నాటికి దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 225 బిలియన్ క్రోనర్లు. DNB, ఈక్వినార్ (గతంలో స్టాటోయిల్ అని పిలువబడేది) తర్వాత OSEలో నమోదైన మూడవ అతిపెద్ద కంపెనీగా నిలిచింది.[4]
చరిత్ర
[మార్చు]

టెలిగ్రాఫ్
[మార్చు]టెలినార్ 1855లో టెలిగ్రాఫ్‌వర్కెట్ అనే పేరుతో ప్రభుత్వ-నిర్వహణలో ఉన్న గుత్తాధిపత్య టెలిగ్రాఫ్ సేవల ప్రదాతగా ప్రారంభమైంది. 1848 లో టెలిగ్రాఫ్ కోసం మొదటి నార్వేజియన్ ప్రణాళిక, రాయల్ నార్వేజియన్ నేవీలో మొదలైంది. కానీ 1852 నాటికి, ప్రణాళికలు బహిరంగంగా అందుబాటులోకి వచ్చాయి. నార్వే పార్లమెంటు దేశవ్యాప్తంగా టెలిగ్రాఫ్ వ్యవస్థను నిర్మించే ప్రణాళికను నిర్ణయించింది. టెలివర్కెట్, క్రిస్టియానియా (ఇప్పుడు ఓస్లో)ను స్వీడన్ తోటీ (ఆ సమయంలో నార్వే స్వీడన్‌తో యూనియన్‌లో ఉంది), అలాగే క్రిస్టియానియా, డ్రామెన్‌లనూ అనుసంధానించడం ద్వారా ప్రారంభమైంది. 1857 నాటికి టెలిగ్రాఫ్, దక్షిణ తీరంలోని సోర్లాండెట్ ద్వారా పశ్చిమ తీరంలోని బెర్గెన్‌కు చేరుకుంది. 1871 నాటికి, అది ఉత్తర తీరంలోని కిర్కెనెస్‌కు చేరుకుంది. 1867లో డెన్మార్క్‌కు, 1869 లో గ్రేట్ బ్రిటన్‌కు కేబుల్ కనెక్షన్లు మొదలయ్యాయి. టెలిగ్రాఫ్ వ్యాపార నావికులకు అత్యంత ముఖ్యమైనది. వారు ఇప్పుడు వివిధ ప్రదేశాల మధ్య తక్షణమే కమ్యూనికేట్ చేయడానికి ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్‌ను ఉపయోగించగలరు, మెరుగైన లాజిస్టిక్స్ నుండి పూర్తిగా కొత్త ప్రయోజనాన్ని పొందగలరు.[5]
టెలిఫోన్
[మార్చు]
నార్వేలో మొట్టమొదటి టెలిఫోన్ సేవ 1878లో అరెండల్, ట్వెడెస్ట్రాండ్ మధ్య మొదలైంది. క్రిస్టియానియా, స్టాక్‌హోమ్‌ల మధ్య మొదటి అంతర్జాతీయ టెలిఫోన్ సేవ 1893లో మొదలైంది. టెలిఫోన్ వ్యవస్థ ఆటోమేషన్ 1920 లో మొదలై 1985 లో పూర్తయింది. 1946 లో మొట్టమొదటి టెలెక్స్ సేవ అందించబడింది. 1976 లో ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నార్వేజియన్ వ్యాపార నౌకాదళానికి, ఉత్తర సముద్రంలోని చమురు వేదికలకూ ఉపగ్రహ టెలిఫోన్ కనెక్షన్లు మొదలయ్యాయి. అదే ఇన్మార్సాట్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల ప్రారంభం. 1980–1985లో టెలిఫోన్ నెట్‌వర్క్‌ను డిజిటలైజ్ చేయడానికి మొదటి దశలను రూపొందించింది. [6]
టెలివర్కెట్ తన మొట్టమొదటి మాన్యువల్ మొబైల్ టెలిఫోన్ వ్యవస్థను 1966లో ప్రారంభించింది. 1981 లో, దాని స్థానంలో ఆటోమేటిక్ NMT వ్యవస్థ, 1986లో మెరుగైన NMT-900 వచ్చాయి. ఆటోమేటిక్ మొబైల్ టెలిఫోన్ వ్యవస్థను పొందిన మొదటి దేశం నార్వే. డిజిటల్ GSM వ్యవస్థ 1993 లో వాడుకలోకి వచ్చింది. UMTS వ్యవస్థతో మూడవ తరం మొబైల్ టెక్నాలజీ 2004 నుండి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. [7] ఒపెరా వెబ్ బ్రౌజర్‌ను 1994లో జాన్ స్టీఫెన్‌సన్ వాన్ టెట్జ్‌చ్నర్, గీర్ ఇవర్సోయ్‌లు టెలినార్‌లో పనిచేసే సమయంలోనే సృష్టించారు. 1995 లో ఒపెరా సాఫ్ట్‌వేర్‌ను స్థాపించి, తమ బ్రౌజర్ అభివృద్ధిని కొనసాగించారు. [8] టెలినార్, హువావేలు కలిసి ప్రయోగశాల వాతావరణంలో 70 Gbit/s వేగంతో 5G ని విజయవంతంగా పరీక్షించాయి.[9]
నియంత్రణ సడలింపు, అంతర్జాతీయీకరణ
[మార్చు]1969 లో ఈ కార్పొరేషన్ తన పేరును టెలివర్కెట్‌గా మార్చుకుంది. 1994 లో అప్పుడు నార్వేజియన్ టెలికాంను ఒక పబ్లిక్ కార్పొరేషన్‌గా స్థాపించారు. నార్వేలో టెలికాం రంగాన్ని 1994, 1998 మధ్య దశలవారీగా నియంత్రణ తొలగించారు. 1999 లో టెలినార్‌నూ స్వీడన్‌లోని దాని సమ ఉజ్జీయైన టెలియానూ విలీనం చేసే ప్రయత్నం విఫలమైంది. అప్పటికి రెండూ ఇప్పటికీ వాటి సంబంధిత ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నాయి. 2000 డిసెంబర్ 4 న కంపెనీని పాక్షికంగా ప్రైవేటీకరించి ఓస్లో స్టాక్ ఎక్స్ఛేంజ్, NASDAQ లలో నమోదు చేశారు.[10] ప్రైవేటీకరణతో కంపెనీకి కొత్త పెట్టుబడి రూపంలో 15.6 billion kr లభించింది. నార్వే ప్రభుత్వానికి ఈ కంపెనీలో 77.7 శాతం వాటా ఉంది. 2014 నాటికి, నార్వే ప్రభుత్వం టెలినార్ వాటాలలో 53.97 శాతం ప్రత్యక్షంగాను, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ ద్వారా మరో 4.66 శాతమూ కలిగి ఉంది. [11]
1990 ల రెండవ భాగంలో, టెలినార్ ఇతర దేశాలలో మొబైల్ కార్యకలాపాలను ప్రారంభించింది: రష్యా (1994), బంగ్లాదేశ్, గ్రీస్, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా (1997), ఉక్రెయిన్ (1998), మలేషియా (1999), డెన్మార్క్, థాయిలాండ్ (2000), హంగేరీ (2002), మోంటెనెగ్రో (2004), పాకిస్తాన్ (2004), స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, సెర్బియా (2006), మయన్మార్ (2014). గ్రీస్, ఐర్లాండ్, జర్మనీలలోని కార్యకలాపాలను 1999/2000లో విక్రయించారు. లాభాలను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తిరిగి పెట్టుబడి పెట్టారు. 2005 అక్టోబరులో టెలినార్ వోడాఫోన్ స్వీడన్‌ను కొనుగోలు చేసింది. 2006 ఏప్రిల్‌లో తన పేరును టెలినార్‌గా మార్చుకుంది.
ఆసియా టెలికాం మార్కెట్లో <i>గ్రామీణ్‌ఫోన్</i> మొట్టమొదటి టెలినార్ వెంచర్. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అదే అతిపెద్ద మొబైల్ ఆపరేటరు. టెలినార్‌కు ఈ కంపెనీలో 55.8 శాతం వాటా ఉంది. గ్రామీణ్‌ఫోన్, 2009 నవంబరు 16 న, ఢాకా, చిట్టగాంగ్‌ల లోని స్టాక్ ఎక్స్ఛేంజీలలో తన వాటాల ట్రేడింగు ప్రారంభించింది. గ్రామీణ్‌ఫోన్ విజయంతో మలేషియా, థాయిలాండ్, పాకిస్తాన్, మయన్మార్‌లలో విజయవంతమైన ఎంట్రీలతో ఆసియాపై దృష్టి పెంచింది. టెలినార్ భారతదేశంలోకి కూడా ప్రవేశించింది గానీ 2017 లో గణనీయమైన నష్టాలతో ఆ మార్కెట్ నుండి వైదొలగాల్సి వచ్చింది.
2018 మార్చిలో టెలినార్ ఆసియా, నార్డిక్ మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఆగ్నేయ యూరప్‌లోని ( బల్గేరియా, హంగేరీ, మోంటెనెగ్రో, సెర్బియా ) తన వ్యాపారాన్ని PPF గ్రూప్‌కు 2.8 బిలియన్ యూరోలకు విక్రయించింది. [12]
2019 లో టెలినార్, ఫిన్లాండ్‌లో మూడవ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన DNA ని కొనుగోలు చేసింది.[13]
2021 జూన్ 21 న మలేషియాలో బలమైన టెల్కోను సృష్టించడానికి సెల్‌కామ్, డిజిల సంభావ్య విలీనానికి ఆక్సియాటా, టెలినార్, డిజి అంగీకరించాయి. ఇది ఆమోదించబడితే 2022 చివరి నాటికి పూర్తవుతుంది. రెండు నెలల క్రితం జరిగిన ముందస్తు చర్చల తర్వాత ఇది వచ్చింది. [14] [15] [16] ఈ ఒప్పందాన్ని సెల్‌కామ్, డిజి వాటాదారులు ఇద్దరూ 2022 నవంబరు 18 న ఆమోదించారు. విలీనమైన కంపెనీ పేరు సెల్‌కామ్‌డిజి. పూర్తయిన తర్వాత, కొత్తగా విలీనమయ్యే కంపెనీలో ఆక్సియాటా, టెలినార్ లకు 33.1 శాతం సమాన వాటా ఉంటుంది. విలీనం 2022 నవంబరు 30 న పూర్తయింది. ఆ మరుసటి రోజు కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది.[17][18][19][20][21][22]
2021 నవంబరు 22 న టెలినార్, చారోయెన్ పోక్‌ఫాండ్ గ్రూప్, థాయిలాండ్‌లోని రెండవ, మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు (చందాదారుల వారీగా), ట్రూ కార్పొరేషన్ (TRUE), టోటల్ యాక్సెస్ కమ్యూనికేషన్ (DTAC) ల మధ్య USD 8.6 బిలియన్ల విలీన ప్రణాళికను అన్వేషించడానికి అంగీకరించినట్లు అధికారికంగా ప్రకటించాయి - ప్రతిపాదిత విలీనం నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది.[23] 2022 అక్టోబరు 20 న జరిగిన సమావేశంలో నియంత్రణ సంస్థ NBTC ఈ విలీనాన్ని "అంగీకరించింది".[24] కొత్తగా విలీనం అయిన కంపెనీ పేరు ట్రూ కార్పొరేషన్ పేరే ఉంటుంది. దీన్ని 2023 మార్చి 1 న స్థాపించారు. 2023 మార్చి 3 న స్టాక్ టిక్కర్ చిహ్నం TRUE కింద థాయిలాండ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైంది.[25]
ఆపరేషన్లు
[మార్చు]టెలినార్, నార్డిక్ దేశాలలో మొబైల్, స్థిర టెలిఫోనీ, ఇంటర్నెట్ యాక్సెస్, కేబుల్ టీవీ యాక్సెస్, కంటెంట్‌తో సహా పూర్తి స్థాయి టెలికమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. టెలియా తదితర కంపెనీల నుండి పోటీ ఉన్నప్పటికీ, టెలినార్ ఇప్పటికీ నార్వేలో అతిపెద్ద సంస్థగా ఉంది.
ఈ గ్రూపుకు స్కాండినేవియన్ బ్రాడ్‌బ్యాండ్, టీవీ మార్కెట్‌లో, చందాదారుల సంఖ్య, కవరేజ్ పరిధి పరంగా ప్రముఖ స్థానం ఉంది. టీవీ పంపిణీ అల్లెంటే అనే బ్రాండ్‌తో ఉంది. టెలినార్, ఆసియాలో కూడా ఒక ప్రముఖ సంస్థయే; ఐదు ఆసియా దేశాలలో దీనికి కార్యకలాపాలున్నాయి.
2021 సంవత్సరం చివరి నాటికి, టెలినార్‌కు నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్, థాయిలాండ్, మలేషియా, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్‌లలో మొబైల్ కార్యకలాపాలలో నియంత్రణ వాటాలున్నాయి. మయన్మార్ లోని కార్యకలాపాలను 2021లో విక్రయించినట్లు ప్రకటించారు. ఆ లావాదేవీ 2022 మార్చిలో పూర్తయింది.
| దేశం | ఆపరేటర్ | స్థానిక పేరు | యాజమాన్య వాటా | 2019 ఆదాయం (మిలియన్ NOK) |
|---|---|---|---|---|
| టెలినార్ నార్వే | టెలినార్ | 100 శాతం | 28 658 | |
| టెలినార్ డెన్మార్క్ | టెలినార్ | 100 శాతం | 4 871 | |
| డిఎన్ఎ | డిఎన్ఎ | 100 శాతం | 3 433 | |
| టెలినార్ స్వెరిజ్ | టెలినార్ | 100 శాతం | 12 857 | |
| గ్రామీణఫోన్ | గ్రామీణఫోన్ | 55.8 శాతం | 14 980 | |
| సెల్కామ్‌డిజి | సెల్కాండిగి | 33.1 శాతం | 13 572 | |
| టెలినార్ పాకిస్తాన్ | ఫిలి నార్ పాక్స్టన్ | 100 శాతం | 6 033 | |
| ట్రూ కార్పొరేషన్ | ทรู คอร์ปอเรชั่น | 30 శాతం | 22 994 |
నార్వేలో సముద్ర రేడియో కమ్యూనికేషన్ల కోసం మౌలిక సదుపాయాలకు టెలినార్ కిస్ట్రాడియో బాధ్యత వహిస్తుంది. సముద్ర రేడియో ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం (ఉదా. VHF, MF బ్యాండ్‌లపై), ఆపదలో ఉన్న సముద్ర నౌకలకు సహాయం చేయడం ప్రాథమిక ఉద్దేశ్యంగా, సిబ్బందితో కూడిన ఐదు కోస్ట్ రేడియో స్టేషన్‌లు కూడా ఉన్నాయి.
పరిశోధన
[మార్చు]టెలినార్ రీసెర్చ్ అనేది పరిశోధన కోసం టెలినార్ ఏర్పరచిన కార్పొరేట్ యూనిట్. ఈ యూనిట్ మార్కెట్, టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఆవిష్కరణ, సంస్థాగతం వంటి అంశాలపై పరిశోధనలను నిర్వహిస్తుంది. పరిశోధన ఆధారిత సలహాలను అందిస్తుంది. టెలినార్ రీసెర్చ్ టెలినార్ గ్రూప్‌కు, అలాగే టెలినార్ మార్కెట్లలోని వ్యక్తిగత వ్యాపార యూనిట్లకు పరిశోధన ఆధారిత విశ్లేషణ, వ్యూహాత్మక సిఫార్సులను అందిస్తుంది. అనువర్తిత పరిశోధన ద్వారా టెలినార్‌కు వ్యాపార విలువను సృష్టించడం టెలినార్ రీసెర్చ్ లక్ష్యం.
యంత్రం నుండి యంత్రానికి
[మార్చు]2000 సంవత్సరంలో టెలినార్ పరిశోధన, అభివృద్ధి (R&D) టెక్నాలజీ, సేవలు, వ్యాపార నమూనాలను లక్ష్యంగా చేసుకుని ఒక ప్రాజెక్ట్‌ను స్థాపించినప్పుడు, టెలినార్ M2M సామర్థ్యాలను అన్వేషించడం ప్రారంభించింది. టెలినార్ స్వీడిష్ మొబైల్ కంపెనీ యూరోపాలిటన్‌ను కొనుగోలు చేయడంతో ఇది మరింత ఊపందుకుంది. ఈ ప్రాంతంలో వోడాఫోన్ పరిశోధన సామర్థ్యాలలో కొంత భాగాన్ని కలిగి ఉంది. ఫలితంగా, రెండు ప్రత్యేక కంపెనీలు స్థాపించబడ్డాయి: స్టాక్‌హోమ్, స్వీడన్‌లోని టెలినార్ కనెక్షన్ [26] (M2M విలువ గొలుసులో ఉన్నత స్థాయికి లక్ష్యంగా పెట్టుకుంది), టెలినార్ ఆబ్జెక్ట్స్ (విలువ గొలుసులో మరింత క్రిందికి లక్ష్యంగా పెట్టుకుంది). దీంతో యూరప్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న M2M మార్కెట్‌లో గణనీయమైన మార్కెట్ వాటాను సంపాదించగలిగింది. యూరప్‌లోని నిస్సాన్ తన వినియోగదారుల ఎలక్ట్రిక్ కార్లను అనుసంధానించడానికి దీనిని ఉపయోగిస్తోంది. [27]
ప్రసారం
[మార్చు]పూర్తిగా టెలినార్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కెనాల్ డిజిటల్. ఇది 2011 లో దాదాపు 2.7 మిలియన్ల కస్టమర్లు కలిగి నార్డిక్ ప్రాంతంలో ప్రముఖ టీవీ కంటెంట్ పంపిణీదారు.[28] 2021 ఏప్రిల్ 13 న అల్లెంటేలో కెనాల్ డిజిటల్, వయాసాట్‌ల విలీనం పూర్తయింది.
టెలినార్ దాని అనుబంధ సంస్థ నార్కింగ్ ద్వారా నార్వేలో జాతీయ భూగోళ ప్రసార నెట్‌వర్క్‌ను కూడా నిర్వహిస్తోంది.
థోర్ అనేది టెలినార్ యాజమాన్యంలోని ఉపగ్రహాల కుటుంబం. 2008 ఫిబ్రవరి 11 న THOR 5 ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. క్రునిచెవ్ అంతరిక్ష కేంద్రం నిర్మించిన ప్రోటాన్-ఎం ప్రయోగ వాహనాన్ని ఉపయోగించి ఇంటర్నేషనల్ లాంచ్ సర్వీసెస్ ఈ ప్రయోగం చేసింది.[29] టెలినార్ ఫోర్నెబులోని దాని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి THOR5, THOR6, THOR7 అనే మూడు ఉపగ్రహాలను నిర్వహిస్తోంది.
మునుపటి కార్యకలాపాలు
[మార్చు]టెలినార్ దాని ప్రైవేటీకరణ తర్వాత అనేక విభాగాలను విక్రయించింది.[30] వాటిలో బ్రావిడా, ఇన్‌స్టాలేషన్ విభాగం, టెలిఫోన్ డైరెక్టరీలకు బాధ్యత వహించే ఎనిరోలో భాగమైన ఫైండెక్సాలు ఉన్నాయి. బ్రౌజర్ విక్రేత ఒపెరా సాఫ్ట్‌వేర్ టెలినార్ యొక్క R&D విభాగంలో ఉద్భవించింది. [31] 2007లో విజాడా తన టెలినార్ శాటిలైట్ సర్వీసెస్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ముందు, టెలినార్ గతంలో వాయిస్, టెలివిజన్, డేటాతో సహా ఉపగ్రహ కమ్యూనికేషన్‌కు సంబంధించిన అనేక సేవలను అందించింది.
టెలినార్ గతంలో మొబైల్ ఫోన్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా అనేక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా చురుకుగా ఉండేది:
| దేశం | ప్రవేశించిన సంవత్సరం | నిష్క్రమణ సంవత్సరం |
|---|---|---|
| 1997 | 2019 | |
| 1997 | 1999 | |
| 1997 | 2020 | |
| 1998 | 2005 | |
| 1998 | 2005 | |
| 1997 | 2007 | |
| 2009 | 2018 | |
| 2006 | 2017 | |
| 2004 (భాగమైనప్పుడు (సెర్బియా, మోంటెనెగ్రో ) |
2008 | |
| 2013 | 2017 | |
| 2002 | 2017 | |
| 1994 | 2022 | |
| 1998 | 2019 | |
| 2014 | 2021 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈక్వినార్
- COMSAT మొబైల్ కమ్యూనికేషన్స్
- ఏరోమొబైల్
- ఒపెరా సాఫ్ట్‌వేర్ ASA
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Annual Report 2021" (PDF). Telenor. pp. 3, 74, 76. Retrieved 14 May 2022.
- ↑ మూస:Cite Kristoffersen 2000
- ↑ Global presence Archived 2021-02-02 at the Wayback Machine - Telenor website. Retrieved October 23, 2017.
- ↑ Pryser, Tore (1999) Norsk Historie 1814-1860, volume four of Norsk historie. Det Norske Samlaget, Oslo ISBN 82-521-5184-1
- ↑ "Telenor: Om Telenor > Virksomhet > Historie > Kronologi". Archived from the original on 2006-08-23. Retrieved 2006-08-23.
- ↑ "Telenor: Om Telenor > Virksomhet > Historie". Archived from the original on 2006-08-19. Retrieved 2006-08-27.
- ↑ Sengupta, Debjoy (9 December 2010). "Opera is the oldest browser, and it is still surviving: Jon Tetzchner, founder, Opera software". The Economic Times.
- ↑ "Telenor and Huawei Conduct Successful Test of 5G with 70 Gbps Speeds". 20 November 2021. Archived from the original on 3 ఏప్రిల్ 2017. Retrieved 27 ఏప్రిల్ 2025.
- ↑ "Telenor: Telenor Satellite Services (TSS)". sky-brokers.com.
- ↑ "Telenor Group | Major Shareholdings". Archived from the original on 2015-09-12. Retrieved 2014-11-18.
- ↑ Dagenborg, Joachim; Knudsen, Camilla (21 March 2018). "Norway's Telenor exits central Europe with $3.4 billion asset sale to Czech investor PPF". reuters.com. Retrieved 21 March 2018.
- ↑ "Telenor buys majority stake in Finland's DNA for $1.7 billion". Reuters. 9 April 2019. Archived from the original on 2022-01-11.
- ↑ "Axiata, Telenor and Digi Sign Transaction Agreements for the Proposed Merger of Celcom and Digi". Axiata. 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ "Axiata and Telenor in Advanced Discussions to Merge Celcom and Digi". Axiata. 8 April 2021. Retrieved 21 June 2021.
- ↑ "Axiata, Telenor, Digi sign agreements to merge Malaysian mobile ops". The Star. 21 June 2021. Retrieved 21 June 2021.
- ↑ Axiata shareholders approve proposed Celcom-Digi merger
- ↑ Digi gets shareholders' green light for proposed merger with Celcom
- ↑ Axiata, Telenor complete Celcom-Digi merger
- ↑ Axiata, Telenor announce completion of Celcom-Digi merger
- ↑ Axiata and Telenor Announce the Successful Completion of the Celcom and Digi Merger
- ↑ Historic merger marks new chapter in Malaysia’s digitalisation journey: “We are in pole position.”
- ↑ "A deep dive into the TRUE/DTAC merger in Thailand". Yozzo.com. Retrieved 2022-01-06.
- ↑ Thai telecoms regulator allows $7.3bn True-DTAC merger
- ↑ Merged True-DTAC to be called True Corp
- ↑ "IoT solutions 500+ networks 200+ countries" (in అమెరికన్ ఇంగ్లీష్). Telenor Connexion. Retrieved 2021-10-24.
- ↑ "European Nissan Leaf gets always-on connection, lets you turn up the AC wirelessly".
- ↑ Svensker vil kjøpe Canal Digital Archived 2019-08-24 at the Wayback Machine E24 Næringsliv. 1 September 2011. Retrieved 16 November 2013 (in Norwegian)
- ↑ "ILS Proton successfully launches THOR 5 satellite". ILS. Archived from the original on 2008-02-26.
- ↑ Triton says sells Sweden's Bravida to Bain Capital Reuters, 12 May 2012. Retrieved 15 November 2013
- ↑ Arild Færaas (26 May 2012) Amerikanske medier: Facebook vurderer å kjøpe opp Opera Aftenposten. Retrieved 16 November 2013 (in Norwegian)