టేజ్ టాకీ
| టేజ్ టాకీ | |||
| పదవీ కాలం 2019 – 2024 జూన్ 2 | |||
| పదవీ కాలం 2014 – 2024 జూన్ 2 | |||
| నియోజకవర్గం | జిరో హపోలి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1977 అస్సాం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
టేజ్ టాకీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు జిరో హపోలి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పెమా ఖండు మంత్రివర్గంలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పశువైద్య & పాడి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]టేజ్ టాకీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జిరో హపోలి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి పాడి రిచోపై 1,219 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5] ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో జిరో హపోలి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి నాని రిబియాపై 1,774 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై పెమా ఖండు మంత్రివర్గంలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, పశువైద్య & పాడి అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "People of Arunachal Pradesh draw inspiration from Savarkar: Tage Taki". The Times of India. 29 November 2022. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "All 12 Arunachal Pradesh ministers are crorepatis: Election watch group". The Times of India. 20 June 2019. Retrieved 21 May 2025.
- ↑ "19 Newcomers Win Arunachal Assembly Poll" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 May 2014. Retrieved 20 May 2025.
- ↑ "19 new faces in Arunachal house". The Times of India. 18 May 2014. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.
- ↑ "2014 assembly elections: 19 newcomers win in Arunachal Pradesh". The Economic Times. 17 May 2014. Archived from the original on 20 May 2025. Retrieved 20 May 2025.