టొయాట ఉత్పత్తి వ్యవస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టొయాట ఉత్పత్తి వ్యవస్థ (tps) ఒక శాస్త్ర-సామజిక మేళవింపు వ్యవస్థ, ఇది టొయాటచే అభివృద్ధి పరచబడినది, ఇది యాజమాన్య ఆలోచన తర్కము మరియు ఆచరణల కలగోలుపు. ఆటోమొబైల్ ఉత్పత్తిదారులకు TPS ఉత్పత్తి మరియు వ్యూహాలను సమకూరుస్తుంది, సరఫరా మరియు వినియోగదారులతో అనుసంధానిస్తుంది. ఈ వ్యవస్థ "లీన్ మానుఫాక్చరింగ్"కి ప్రధాన పూర్వీకురాలు. 1948-1975 మధ్య కాలంలో తైచి ఒహ్నో, శిజియో శిన్గో మరియు ఇజి తోయోడలు ఈ వ్యవస్థను అభివృద్ధి పరిచారు.[1]

ప్రారంభంలో దీనిని "సమయ అనుకూల ఉత్పత్తి" అని పిలిచేవారు ఈ వ్యవస్థ పనితీరు టొయాట స్థాపకుడు సకిచి తోయోడ, అతని పుత్రుడు కిచిరో తోయోడ, మరియు ఇంజినీర్ తాచి ఒహ్నో రూపొందించిన విధానాలు పైన ఆధారపడి పనిచేస్తుంది. టొయాట స్థాపకులు ఎక్కువగా డబ్లు.ఎడ్వర్డ్స్ డెమింగ్ మరియు హెన్రీ ఫోర్డ్ రచనలను అనుసరించేవారు. వీరు యునైటెడ్ స్టేట్స్ లోని ఫోర్డుని ధనవంతుడిని చేసిన అసెంబ్లీ లైన్ మరియు బహుళ ఉత్పత్తి వ్యవస్థలను గమనించటానికి వచ్చినప్పుడు వారు సంతృప్తి చెందలేదు. వారు సూపర్ మార్కెట్ లోని సరుకులు కొంటున్నప్పుడు ఒక సరళమైన ఉపాయం ఉపయోగించి స్వయంచాలక పానియ సరఫరా పరికరాన్ని పరిశీలించారు, వినియోగదారుడు కోరిక మీదట పానీయం తీసుకున్నప్పుడు, వెంటనే దాని స్థానంలో ఇంకో సీసా భర్తీ చేయబడుతుంది. TPSలో అనుసరించే ఈ సూత్రాలు అన్ని టొయాట పద్ధతిలో పేర్కొనబడ్డాయి.

ధ్యేయాలు[మార్చు]

TPS రూపొందించడంలో ముఖ్యోద్దేశాలు అధిక భారం (మురి, చంచలత్వం (ముర), మరియు వ్యర్ధాలు (ముద) అరికట్టుట. కావలిసిన ఫలితాలను సరళంగా పొందడానికి ఒక ప్రభావవంతమైన వ్యవస్థను రూపొందించారు ఈ వ్యవస్థ గుర్తించతగ్గ ఫలితాలను చేకూర్చింది; "ముర" (చంచలత్వం) ని అరికట్టడం. చివరగా, చెత్తను తగ్గించడం లేక ముదను నిర్మూలించడంలో వ్యూహాత్మక అభివృద్ధులు చాలా విలువైనవి. టి పి ఎస్ లో ఏడు రకాల ముదను గూర్చి తెలియజెయ్యడం జరిగింది:

 1. అమిత ఉత్పాదన
 2. చలనము (పని చేయు వ్యక్తి లేదా యంత్రం యొక్క)
 3. నిరీక్షణ (పని చేయు వ్యక్తి లేదా యంత్రం యొక్క)
 4. తీసుకుపోయేది
 5. తనకుతానుగా పనిచేయుట
 6. జాబితా (ముడి పదార్థాలు)
 7. సవరణ (మరల పని మరియు పనికిరాని పాతవి)

మూడింటిలోనూ నిర్వహణ విషయంలో బహుళ ప్రాచుర్యం పొందినది కావడంతో ముద నిర్మూలన పద్ధతే టి పి ఎస్ ప్రభావాల వైపు దృష్టి సారించే వారిలో పెక్కుమంది ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేయడం జరిగింది. టి పి ఎస్ లో ముర లేక మురి తగ్గించడం అనే ప్రక్రియ ద్వారా ప్రత్యేకించి ముదను తగ్గించడం అనే దానిపై దృష్టి సారించక ముదను పూర్తిగా నిర్మూలించే యత్నాలు అనేకం ప్రేరేపించబడ్డాయి.

మూలాలు[మార్చు]

కంపెనీకు సంబంధించి అనేక ఇతర అంశాల కంటే అధికంగా ఈ పద్ధతి టొయాట కంపెనీ ఈనాటి ప్రతిష్ఠకు కారణం. చాలాకాలం క్రితమే మోటారు వాహనాల తయారీ మరియు ఉత్పాదక పరిశ్రమలలో అగ్రగామిగా టొయాట గుర్తించబడింది.[2]

ఈ పద్ధతికి స్ఫూర్తిని టొయాట అమెరికన్ మోటారు వాహనాల పరిశ్రమ ( ఆ కాలంలో ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమగా భావించబడేది) నుండి కాక ఒక సూపర్ మార్కెట్ సందర్శన ద్వారా పొందింది. టొయాట ప్రతినిధి బృందం ఒకటి (ఓహ్నోనేతృత్వంలో)1950లో సంయుక్త రాజ్యాలను సందర్శించినప్పుడు ఇది జరిగింది. ప్రతినిధి బృందం ముందుగా మిచిగన్ లోని అనేక ఫోర్డ్ మోటార్ కంపెనీ కర్మాగారములను సందర్శించడం జరిగింది కానీ ఆ కాలంలో ఫోర్డ్ పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్నప్పటికీ వాడుకలో వున్నా అనేక పద్ధతులు మరీ ఉపయుక్తమైనవి కావని కనుగొంది. నిర్మాణ స్థలంలో అత్యధిక పరిమాణంలో పోగు వెయ్యబడి ఉన్న సరుకులు, అత్యధిక దినాలలో ఫాక్టరీలోని వివిధ విభాగాలలో ఏ మాత్రం సమాంతరంగా లేని విధంగా నిర్వహించబడుతోన్న పని మొత్తాన్నీ మరియు విధానము చివరలో మరలా చేయబడుతోన్న పని మొత్తాన్నీ చూచి వారు ప్రధానంగా విస్తుపోవడం జరిగింది.[3]

కానీ, ఆ తర్వాత సందర్శించిన పిగ్లి విగ్లిలో ఆ సూపర్ మార్కెట్ వారు కస్టమర్లు సరుకును పూర్తిగా కొనుగోలు చెయ్యడం జరిగాకనే తిరిగి సరుకులను ఉత్తరువు చెయ్యడం మరియు మరలా చేర్చి పెట్టుకోవడం చూసి స్ఫూర్తి చెందడం జరిగింది.[4] టొయాట వారు వారి ఉద్యోగులకు కొద్దికాలం వ్యవధికే మాత్రమే సరిపడా మోతాదుకు సరుకులను తగ్గించి, ఆ తర్వాత మరలా ఉత్తరువు చేసుకునే విధంగా పిగ్లి విగ్లిలో నేర్చుకున్న పాఠాన్నిఉపయోగించుకోవడం జరిగింది. ఈనాడు ప్రాచుర్యం పొందిన జస్ట్-ఇన్-టైం (జెఐటి ) ఇన్వెన్టరి పద్ధతికి ఇది సూచన కావచ్చు.[3]

తక్కువ సరకు నిల్వలు అనేవి టొయాట ఉత్పత్తి వ్యవస్థ యొక్క ప్రధాన ఫలితాలు కాగా పద్ధతి వెనుక గల తత్వం యొక్క ముఖ్య అంశం వ్యర్ధమును అరికట్టి తద్వారా సరుకును నిల్వ చెయ్యాల్సిన అవసరం లేకుండా తెలివిగా పని చేసుకోవడం. టొయాట ఫాక్టరీలను పరిశీలించిన అనేక అమెరికన్ వ్యాపారములు సరుకులలో తగ్గుదలకు ఏవి కారణమో గ్రహించకుండానే తాము కూడా తమ అధిక సరుకు నిల్వలను తగ్గించుకునే ప్రయత్నం చేపట్టాయి. వెనుక గల అంతరార్థం అర్ధం చేసుకోకుండా చలించే లేదా అనుకరించే ప్రయత్నాలు ఆ ప్రణాళికల పరాజయానికి దారి తీసి ఉండవచ్చు.

మూల సూత్రాలు[మార్చు]

టొయాట వేగా పిలవబడే మూల సూత్రాలను టొయాట ఈ విధంగా వివరించడం జరిగింది:

నిరంతర అభివృద్ధి[మార్చు]

 • సవాలు (మా కలలను సాకారం చేసుకునేందుకు మేము దూర దృష్టి ఏర్పరుచుకుని ధైర్యంతోను, సృజనాత్మకతతోను సవాళ్ళను ఎదుర్కొంటాము.)
 • కైజెన్ (మేము నిరంతరం మా వ్యాపార కలాపాలను కొత్తదనం మరియు వికాసాల దిశగా అభివృద్ధి పరచుకుంటూ ఉంటాము.)
 • గెంచి గెంబుట్సు (సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వాస్తవాలు తెలుసుకోవడానికి మూలం వరకూ వెళతాము.)

ప్రజల పట్ల గౌరవం[మార్చు]

 • గౌరవం (మేము ఇతరులను గౌరవిస్తాము, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాము, పరస్పర నమ్మకం ఏర్పరుచుకోవడానికి బాధ్యత వహించి చెయ్యగలిగినంత చేస్తాము.)
 • సమష్టి కృషి (మేము వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధిని ప్రేరేపిస్తాము, అభివృద్ధి అవకాశాలను పంచుకోవడం చేస్తాము, వ్యక్తిగత మరియు సమష్టి ప్రదర్శనలు అత్యున్నత స్థితిని చేరుకునేలా చూస్తాము.)

బాహ్య పరిశీలకులు టొయాట వే సూత్రాలను సంగ్రహముగా ఈ విధముగా తెలియజెయ్యడం జరిగింది.

దీర్ఘ-కాలిక తత్వం[మార్చు]

 1. స్వల్ప- కాలిక ఆర్థిక లక్ష్యాలను త్యాగం చేసి అయినా సరే నిర్వాహక వర్గ నిర్ణయాలను దీర్ఘ-కాలిక తత్వలపై నిలుపు.

సరైన పద్ధతి సరైన ఫలితాలను ఇస్తుంది.[మార్చు]

 1. సమస్యలను బహిర్గతం చేయటానికి నిరంతర చర్యను సృష్టించాలి.
 2. అమిత ఉత్పత్తి నివారించేందుకు "పుల్" పద్ధతి ఉపయోగించు.
 3. పని భారాన్ని సమపరచుకో (హేజుంకా). (కుందేలులా కాక తాబేలులా పని చెయ్యు.)
 4. ప్రారంభం నుండి నాణ్యత సాధించడం కోసం సమస్యల పరిష్కారానికై నిలుపుదల సంస్కృతి నిర్మించు.
 5. నిరంతర అభివృద్ధి మరియు ఉద్యోగి అధికారానికి పునాదులు ప్రమాణం చెయ్యబడిన కార్యాలు.
 6. సమస్యలు మరుగు పడకుండా ఉండేందుకు దృష్టి నియంత్రణ ఉపయోగించు.
 7. నీ వాళ్ళకు, పనులకు ఉపయుక్తం అయ్యేలా సమగ్రంగా పరీక్షించబడిన, నమ్మదగ్గ సాంకేతిక విధానాన్నే ఉపయోగించు.

నీవాళ్ళను మరియు భాగస్వాములను అభివృద్ధి చేసి సంస్థ విలువను పెంపొందించు.[మార్చు]

 1. పనిని సమగ్రంగా గ్రహించి, తత్వం అవలంబించి, దాన్ని ఇతరులకు బోధించే నాయకులను తయారు చెయ్యు.
 2. సంస్థ తత్వాన్ని అవలంబించే అసాధారణ వ్యక్తులనూ, వర్గాలనూ వర్ధిల్లజెయ్యి.
 3. వ్యాప్తి చెందిన భాగస్వామ్య వ్యవస్థను మరియు ఏర్పాటుదారులను గౌరవించి వారు సవాళ్ళను ఎదుర్కొని అభివృద్ధి సాధించేలా చెయ్యు.

మూల సమస్యలను నిరంతరం పరిష్కరించడం సంస్థ పాండిత్యానికి దోహదపడుతుంది.[మార్చు]

 1. పరిస్థితిని సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి స్వయంగా వెళ్లి చూడు (గెంచి గెమ్బుత్సు)
 2. అన్ని వికల్పాలనూ పరిశీలించి, అందరి ఆమోదాన్నీ తీసుకుని నిర్ణయాలను నిదానంగా తీసుకో (నేమవాషి 根回し) ; నిర్ణయాలను త్వరితగతిన ఆచరణలో పెట్టు;
 3. నిరంతర ఆలోచనతో (హన్సి) మరియు నిరంతర అభివృద్ధితో (కైజెన్) పాండిత్యం }సాధిస్తూ ఉన్న సంస్థగా ఏర్పడు.

టొయాట ఉత్పదనా పద్ధతి పొడి తువ్వాలు నుండి నీటిని పిండడంతో పోల్చబడింది. సమగ్రంగా చెత్తను నిర్ములించెందుకే ఈ పద్ధతి అని దీని అర్ధం. ఇక్కడ ప్రక్రియను ముందుకు తీసుకుపోనిది, అదనపు విలువను పెంపొందించనది ఏది అయినా చెత్త గానే చూపబడుతుంది. అందరూ చెత్తగా గుర్తించినదాన్ని నిర్ములించేందుకే అనేకులు యత్నిస్తారు. కానీ, చెత్తగా గుర్తింపు పొందనిదీ, అట్టే పెట్టుకునేందుకు ప్రజలకు అభ్యంతరం లేనిదీ అయినది ఇంకా చాలా ఉంది.

జనులు కొన్ని సమస్యలు విడిచి పెట్టి, నియమిత చర్యలకు బందీగా కట్టుబడి ఉండి, సమస్యా పరిష్కారం అనే పద్ధతికి తిలోదకాలిచ్చారు. ఈ విధంగా మూల అంశాలను తిరిగి చేరుకోవడం, సమస్యల వల్ల కలిగే వాస్తవమైన ఉపయోగాలు బయట పెట్టడం ఆ తర్వాత ప్రధానమైన అభివృద్ధిని సాధించడం టొయాట ఉత్పత్తి వ్యవస్థలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.[5]

ఫలితాలు[మార్చు]

టొయాట వారు నాణ్యతను మెరుగు పరుస్తూ, లీడ్ టైం మరియు పెట్టుబడులలో గణనీయమైన తగ్గుదలను టి పి ఎస్ అవలంబిస్తూ సాధించగలిగారు. టొయాట ప్రపంచంలోని అతి పెద్దవిగా పరిగణించబడే కంపనీలలో ఒకటిగా చేరేందుకు ఇది దోహదపడింది. ప్రస్తుతం, ఇతర కారు కంపెనీలు అన్నీ కలిసి ఆర్జిస్తూ ఉన్నంత లాభాలను ఒక్క టొయాట నే ఆర్జిస్తూ 2007 లో అతి పెద్ద కార్ల నిర్మాణ దారుగా నిలిచింది. కావలసిన వస్తువుల ఏర్పాటు, ఇతర సమాచార సేకరణ 'వర్గీకరణ' లేక మొదటి దశగా చెప్పబడే విజ్ఞానంలో "అన్యోన్య సంబంధము" లేదా మధ్య దశ అనే దానికి టి పి ఎస్ ప్రధాన ఉదాహరణగా ప్రస్తావించబడింది.[6] ఈ దశలో ఒక విజ్ఞానం సంఘటనల నడుమ అన్యోన్య సంబంధాన్ని వీక్షిస్తూ కొంత భవిష్యత్ వాణిని తెలియజేసే కొన్ని ప్రక్రియలను ప్రతిపాదించ గలుగుతుంది. ఉత్పత్తి తత్వం యొక్క భవిష్య వాణి విజయం కారణంగా ఈ యొక్క అనేక పద్ధతులు చాలా వరకూ జయప్రదం కాకున్నా ఇతర పారిశ్రామిక కంపనీలచే అనుకరించబడుతున్నాయి.

అలాగే, ఇతర వివిధ సెక్టార్లలో (పారిశ్రామికేతర ) పనిచేస్తూ ఉన్న అనేక కంపెనీలు టొయాట ఉత్పత్తి వ్యవస్థ యొక్క కొన్ని లేక అన్నీ తత్వాలను తమ కంపెనీలో పొందు పరుచు కోవడానికి ప్రయత్నం చెయ్యడం జరిగింది. ఈ సెక్టార్లలో నిర్మాణ, ఆరోగ్య రంగాలు చేర్చబడి ఉన్నాయి.

సాధారణంగా ఉపయోగించే పరిభాష[మార్చు]

 • అండాన్ (行灯) (ఆంగ్లం : సైన్ బోర్డు)
 • గెంచి గెంబుత్సు (現地現物) (ఆంగ్లం : స్వయంగా వెళ్లి చూడు)
 • హన్సి (反省) (ఆంగ్లం : స్వీయ చింతన)
 • హిజుంక (平準化) (ఆంగ్లం : ఉత్పత్తిలో ఇబ్బందులు లేకుండా చేయుట)
 • జిడోక (自働化) (ఆంగ్లం :ఆటోనోమేషన్ - మానవ వివేకంతో తనకు తానుగా పనిచేయునట్టి)
 • జస్ట్ ఇన్ టైం (ジャストインタイム) (జే ఐ టి )
 • కైజెన్ (改善) (ఆంగ్లం : నిరంతర్ అభివృద్ధి)
 • కంబన్ (看板, కూడా かんばん) (ఆంగ్లం :సైన్, ఇన్డెక్స్ కార్డు)
 • ఒక ప్రక్రియ ద్వారా అన్నీ భాగాలూ వెనక్కు తీసుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా ఉత్పత్తి చేయు సూపర్ మార్కెట్
 • ముద (無駄, kooda ムダ) (ఆంగ్లం: వ్యర్థం)
 • ముర (斑 or ムラ) (ఆంగ్లం : సమాన్తరత లేని)
 • మురి (無理) (ఆంగ్లం : అమిత భారం)
 • నేమవాషి (根回し) (ఆంగ్లం : పునాది వేయుట, సమ్మతి నిర్మాణం, శబ్దార్ధ ప్రకారం : మూలాలను చుట్టి వచ్చుట)
 • పోక -యొక్ (ポカヨケ) (ఆంగ్లం : ఫెయిల్ సేఫింగ్ - నిర్మూలించడానికి (యోకేరు ) అజాగ్రత్త కారణంగా తప్పులు (పోక )

వీటిని కూడా చూడండి[మార్చు]

 • తాఇచి ఒహ్నో
 • షిజిఒ షిన్గో
 • డబ్లు. ఎడ్వర్డ్స్ డెమింగ్
 • లీన్ మేనుఫాక్చరింగ్
 • లీన్ ఇన్టిగ్రేషణ్
 • టొయాట వే

గమనికలు[మార్చు]

 1. స్ట్రాటిగొస్ -ఇంటర్నేషనల్. టొయాట ప్రొడక్షన్ సిస్టం అండ్ లీన్ మాన్యు ఫాక్చరింగ్ .
 2. బ్రియన్ బ్రేమ్నేర్ , బి. అండ్ సి . దావ్సన్ (నవంబర్ 17, 2003). "కాన్ ఎనీ థింగ్ స్టాప్ టొయాట ?: యన్ ఇన్ సైడ్ లుక్ అట్ హౌ ఇట్ ఈజ్ రీఇన్వెంటింగ్ ది ఆటో ఇన్ డెస్ ట్రీ ". బిజినెస్ వీక్.
 3. 3.0 3.1 Ohno, Taiichi (1998), Toyota Production System: Beyond Large-Scale Production, Productivity Press, ISBN 978-0915299140 Unknown parameter |month= ignored (help)
 4. Magee, David (2007), How Toyota Became #1 - Leadership Lessons from the World's Greatest Car Company, Portfolio Hardcover, ISBN 978-1591841791 Unknown parameter |month= ignored (help)
 5. ఎ స్టడీ అఫ్ ది టొయాట ప్రొడక్షన్ సిస్టం , షిగెఒ షింగో , ప్రొడక్టివిటి ప్రెస్ , 1989, p236
 6. థిఅరి అఫ్ కన్స్త్రైన్త్స్ , ఎలియహు గోల్డ్ రాట్ట్ , నార్త్ రివెర్ ప్రెస్ , 1990, p 26

సూచనలు[మార్చు]

 • ఇమిలయాని, బి., విత్ స్టేక్, డి ., గ్రాస్సో, ఎల్. మరియు స్తోడ్దర్, జే. (2007), బెటర్ థింకింగ్ , బెటర్ రిజల్ట్స్ : కేసు స్టడీ అండ్ అనాలిసిస్ అఫ్ యన్ ఎంటర్ ప్రైస్ -వైడ్ లీన్ ట్రాన్స్ ఫార్మేషన్ , సెకండ్ ఎడిషన్, ది సిఎల్బిఎం, ఎల్ ఎల్ సి కెన్సింగ్టన్, కాన్., ISBN 978-0-9722591-2-5
 • జెఫ్రీ లైకేర్ (2003), ది టొయాట వే : 14 మేనేజ్మెంట్ ప్రిన్సిపుల్స్ ఫ్రం ది వరల్డ్స్స్ గ్రేటెస్ట్ మేను ఫాక్చరార్ , ఫస్ట్ ఎడిషన్, మాక్ గ్రా -హిల్, ISBN 0-07-139231-9.
 • యసుహిరో మొండేన్ (1998), ' టొయాట ప్రొడక్షన్ సిస్టం, యన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు జస్ట్ -ఇన్ -టైం, థర్డ్ ఎడిషన్, నోర్క్రోస్స్, జి ఎ : ఇంజనీరింగ్ & మేనేజ్మెంట్ ప్రెస్, ISBN 0-412-83930-ఎక్స్ .
 • ఒహ్నో, తాఇయిచీ (1995), టొయాట ప్రొడక్షన్ సిస్టం : బియాండ్ లార్జ్ - స్కేల్ ప్రొడక్షన్ , ప్రోడక్తివిటి ప్రెస్ ఇంక్ ., ISBN 0-915299-14-3.
 • షింగో, షిగిఒ (1989) ఎ స్టడీ అఫ్ ది టొయాట ప్రొడక్షన్ సిస్టం ఫ్రం యన్ ఇండస్ ట్రీయల్ ఇంజనీరింగ్ వ్యూ పాయింట్ (ప్రోడ్యుజ్ వాట్ ఈజ్ నీడేడ్, వెన్ ఇట్ ఈజ్ నీడేడ్), ప్రొడక్టివిటి ప్రెస్, IS 0-915299-17-8. (ఇది ఆంగ్ల వెర్షన్ను సూచిస్తుంది, జపనీజ్ వెర్షన్ 1981 లో ముద్రించబడింది, కానీ ISBN తెలియదు)
 • స్పీఅర్, స్టీవెన్, అండ్ బోవెన్, ఎచ్ కెంట్ (సెప్టెంబర్ 1999), "డీకోడింగ్ ది డి ఎన్ ఎ అఫ్ ది టొయాట ప్రొడక్షన్ సిస్టం ," హార్వర్డ్ బిజినెస్ రివ్యూ
 • వోమాక్, జేమ్స్ పి. అండ్ జోన్స్, డానిఅల్ టి . (2003), లీన్ థింకింగ్ బనిష్ వేస్ట్ అండ్ క్రిఎట్ వెల్త్ ఇన్ యువర్ కార్పోరేషన్ , రివైజెడ్ అండ్ అప్డేటెడ్ , హరపెర్ బిజినెస్, ISBN 0-7432-4927-5.
 • వోమాక్, జేమ్స్ పి., జోన్స్, డనిఎల్ టి ., అండ్ రూస్, డనిఎల్ (1991), ది మెషిన్ దట్ చెంజడ్ ది వరల్డ్ : ది స్టొరీ అఫ్ లీన్ ప్రొడక్షన్ , హరపెర్ బిజినెస్, ISBN 0-06-097417-6.
 • జంప్రోట్ట ఎల్ ., (1993), ల క్వలిటే కమ్మే ఫిలోసోఫీ దె లా ప్రొడక్షన్ . ఇంటర్ఆక్షన్ అవేక్ 'ఏర్గోనోమీ ఎట్ పెర్స్పెక్టివ్ ఫ్యూచర్స్ , దీజ్ దె మైట్రిజ్ ఎస్ సైన్సెస్ అప్ప్లిక్వీజ్, టి ఐ యు ప్రెస్, ఇండి పెండన్స్, ఎం ఓ, (1994), ISBN 0-89697-452

బాహ్య లింకులు[మార్చు]