టోంక్ జిల్లా
టోంక్ | ||||
---|---|---|---|---|
ఎగువ: సుదర్శనోదయ్ తీర్థ క్షేత్రం, అన్వ దిగువ: బిసల్డియో ఆలయం | ||||
![]() రాజస్థాన్ రాష్ట్రంలో టోంక్ జిల్లా స్థానం | ||||
దేశం | ![]() | |||
రాష్ట్రం | రాజస్థాన్ | |||
పరిపాలనా విభాగం | అజ్మీర్ విభాగం | |||
జిల్లా ముఖ్యపట్టణం | టోంక్ | |||
Area | ||||
• మొత్తం | 7,194 km2 (2,778 sq mi) | |||
Population (2011) | ||||
• మొత్తం | 14,21,326 | |||
• Density | 200/km2 (510/sq mi) | |||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) |
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో టోంక్ జిల్లా ఒకటి. జిల్లా ముఖ్య కేంద్రం టోంక్ పట్టణం గత భారతీయ, రాజస్థాన్ రాజాస్థానలలో ఇది ఒకటిగా ఉండేది. తోంక్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉండేది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సవై మధోపూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కోట జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా, నైరుతీ సరిహద్దులో భిల్వార జిల్లా, పశ్చిమ సరిహద్దులో అజ్మీర్ జిల్లా ఉన్నాయి.
భౌగోళికం[మార్చు]
టోంక్ జిల్లా జాతీయరహదారి -12 మార్గంలో ఉంది. ఇది జైపూర్ నుండి 100 కి.మీ దూరంలో ఉంది. ఇది రాజస్థాన్ ఉత్తర భూభాగంలో 75.19' & 76.16 తూర్పు భూభాగంలో, 25.41', 26.24' ఉత్తర అక్షాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 7194 చ.కి.మీ.
చరిత్ర[మార్చు]
నవాబి నగరి తోంక్ రాజస్థాన్ రాష్ట్రంలోనే కాక భారతదేశం అంతటిలో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. అక్బర్ పరిపాలనా కాలంలో జైపూర్ రాజు మాంసింగ్ తారి, తొక్రా జనపద్‌లను జయించాడు. 1963లో టోక్రా జనపదంలోని 12 గ్రామాలను భోలాబ్రాహ్మణులకు ఇవ్వబడింది. తరువాత భోలా ఈ 12 గ్రామాలకు టోంక్ అని నామకరణం చేసాడు. ఈ ప్రాంతం సరిహద్దులలో 5 జిల్లాలు ఉన్నాయి (ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బుంది జిల్లా, భిల్వార జిల్లా, తూర్పు సరిహద్దులో అజ్మీర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా సరాసరి వర్షపాతం 62చ.కి.మీ. జిల్లా ప్రజల ప్రధాన వృత్తులలో వ్యవసాయం, జంతుపెంపకం ప్రధాన్యత వహిస్తున్నాయి.
తోంక్ చరిత్ర చాలాపురాతనమైంది. ఇది సాంస్కృతికంగా, నాగరికత సంబంధంగా విరాటనగరికి (భైరత్) కి చెందిందిగా భావిస్తున్నారు. టోంక్‌ను రాజస్థాన్ లక్నో అని అంటారు. అదాబ్ కా గుల్షన్, ప్రేమ కవి అక్తర్ ష్రీరాణికి నగ్రి, మీతే ఖర్భూజొ కా చమన్, హిందూ ముస్లిం ఏక్తా, మస్కన్ వంటి ప్రముఖులకు టోంక్ జన్మభూమి.రాజపుత్రులకాలంలో ఈప్రాంతం చవ్రాలు, సోలంకీలు, కచవాలు తరువాత రాజా హోల్కర్, సింధియాల పాలనలో భాగంగా ఉంది.1806లో ముహమ్మద్ అమీర్ ఖాన్ బల్వంత్ రావు హొల్కర్‌ను జయించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అమీర్ఖాన్ నుండి 1817 ఒప్పందం ద్వారా సంపాదించింది. అయినప్పటికీ బ్రిటిష్ ఈ ప్రాంతాన్ని అమీర్ఖాన్‌కు తిరిగి ఇచ్చింది. 1818లో ఆఫ్ఘన్ సైన్యాధికారికి ఇండోర్ పాలకుడు ఈ ప్రాంతం కానుకగా ఇవ్వబడింది.అతను ఈప్రాంతంలో తోంక్ రాజ్యస్థాపన చేసాడు.
ఆర్ధికం[మార్చు]
2006 గణాంకాలను అనుసరించి పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో టోంక్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న రాజస్థాన్ రాష్ట్రజిల్లాలలో 12 ఈ జిల్లా ఒకటి..[1]
విభాగాలు[మార్చు]
టోంక్ జిల్లాలో ఉపవిభాగాలు, తాలూకాలు ఉన్నాయి.డియోళి (రాజస్థాన్), మల్పుర, నివై, తొదరైసింఘ్, టాంక్, ఉనీర, పీప్ల్, దెఒలి (రాజస్థాన్) మల్పుర, నివై, తొదరైసింఘ్,, ఉనీర నగర్ పాలితాలు ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లాలో 1093 గ్రామాలు ఉన్నాయి.
చారిత్రిక జనాభా[మార్చు]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 2,60,801 | — |
1911 | 2,76,428 | +0.58% |
1921 | 2,55,216 | −0.80% |
1931 | 2,97,275 | +1.54% |
1941 | 3,29,790 | +1.04% |
1951 | 4,06,921 | +2.12% |
1961 | 4,97,729 | +2.03% |
1971 | 6,25,830 | +2.32% |
1981 | 7,83,635 | +2.27% |
1991 | 9,75,006 | +2.21% |
2001 | 12,11,671 | +2.20% |
2011 | 14,21,326 | +1.61% |
source:[2] |
2011 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,421,711,[3] |
ఇది దాదాపు. | స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | హవాయి నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 347వ స్థానంలో ఉంది..[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 198 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.33%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 947:1000 .[3] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 62.46%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
సంస్కృతి[మార్చు]
తీర్థయాత్రా ప్రదేశాలు[మార్చు]
- టాంక్ జమ మస్జిద్
- అరబిక్ పెర్షియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- సుంహరి కోటి
- లార్డ్ దేవ్నారాయణన్ ఆలయం జోథ్పురియా
- శ్రీ కళ్యాణ్ జీ మందిర్ డిగ్గీ
- మందకల (నాగర్ రేవు) ఒక చిన్న పుష్కర్, చెరువు, పురాతన షొబ్యాత్ర (ఖేరా) ఇక్కడ ఉంది.
- దూనిజ మందిర్
- జల్ దేవి మందిర్ (బలుండ)
- కల్పవృక్ష
- జైన్ దేవాలయాలు
- బద్రి నాథ్ దేవాలయం
- దదబాడి ఆలయం.[6]
- సునహరి కోఠి
ఇది టోంక్ నగరంలోని నాజర్ బాఘ్ రోడ్డు మార్గంలో బదా సమీపంలో ఉంది. కోఠీలోని గోడలు బంగారు పూత పూసి ఉంటాయి. దీనిని శేషమహల్ అని కూడా అంటారు.
సరిహద్దులు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1/Utilities at line 38: bad argument #1 to 'ipairs' (table expected, got nil).
వెలుపలి లింకులు[మార్చు]

