టోంబ్ రైడర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టోంబ్ రైడర్ కాల్పనిక బ్రిటిష్ పురాతత్వవేత్త లారా క్రోఫ్ట్ సాహసాల కేంద్రంగా ఉండే పోరాటం-సాహసం ఉన్న ఆటలు, హాస్య దాయక రేఖా చిత్రాలు, నవలలు, థీమ్ పార్క్ సవారీలు, చలన చిత్రాలు మొదలగు మాధ్యమాల ప్రత్యేక అమ్మకపు హక్కులున్న సంస్థ. 1996లో మొదటి టోంబ్ రైడర్ విడుదల అయినప్పటినుంచి, సంబంధిత మాధ్యమాల పరంపర ప్రత్యేక అమ్మకపు హక్కులతో మంచి లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారంగా ఉద్భవించింది. లారా విడియో గేమ్్ లలో మంచి ప్రజాదరణ పొందిన పాత్ర అయ్యింది. 2006 లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లారా క్రోఫ్ట్ ని "మానవ పాత్రలున్న ఆటలలో బాగా అమ్ముడు పోయిన నాయకురాలు" గా గుర్తించింది. ఈ పరంపరలోని మొదటి ఆరు ఆటలని కోర్ డిజైన్ మరియు తర్వాత వచ్చిన మూడు ఆటలని క్రిస్టల్ డైనమిక్స్ తయారుచేసారు. ఇప్పటి వరకు లారా క్రోఫ్ట్ పై రెండు చలనచిత్రాలు నిర్మించారు: Lara Croft: Tomb Raider మరియు Lara Croft Tomb Raider: The Cradle of Life . వీటిలో అమెరికా కు చెందిన ఎంజేలిన జోలి అనే నాయిక లారా క్రోఫ్ట్ పాత్ర పోషించింది.

లారా క్రోఫ్ట్[మార్చు]

దస్త్రం:TRMapLaraLocations.png
లారా క్రాఫ్ట్ వీడియో గేమ్్స్ మరియు చలనచిత్రాల లో దర్శించిన స్థలాలు సూచించబడ్డ పటం:[4][5][6][7][8][9][10][11]

పురాతన నిధులు వెదికే ఓ మహిళా సాహసి, బ్రిటిష్ పురాతత్వ వేత్త లారా క్రోఫ్ట్ టోంబ్ రైడర్ లోని ముఖ్య పాత్ర. కోర్ లో ఒక్కప్పుడు పని చేసిన టోబి గార్డ్,[1] లారా పాత్ర సృష్తికర్త. ముందు పనికి రావని వదిలేసిన చాలా భావనలనుంచి ఈ పాత్ర ఉత్పన్నమైంది. ఆమె సాధారణంగా గోధుమ రంగు లాగు, ఆకుపచ్చ లేదా నీలం రంగు భుజాలు లేని కోటు, నడుము చుట్టూ తన పిస్తోళ్ళ కోసం రెండు ఒరలు మరియు వీపు పై వేసుకునే చిన్న గోధుమ రంగు సంచితో కనిపిస్తుంది. ఈ పరంపరలో ఆమె 3డి నమూనా రేఖాత్మకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆమె స్తన పరిమాణం కూడా పెరిగింది (తర్వాత తగ్గింది).

కాల క్రమమంలో, టోంబ్ రైడర్ పరంపర అవలంబించిన సిద్ధాంతాలలో చాలా మార్పులు వచ్చాయి. పాత్రల చరిత్రలలో మార్పులు కూడా తెచ్చారు. ఈ పరంపర కొత్త మాధ్యమాలలోకి (చలన చిత్రాలు, హాస్యదాయక రేఖాచిత్ర కథలు వంటివి) ప్రవేశించినప్పుడు లేదా కొత్త దర్శకుల చేతులలోకి వెళ్లినప్పుడు ఇలా మార్పులు జరిగాయి. ఉదాహరణనకి, మొదటి టోంబ్ రైడర్ ఆట నిర్దేశిక గ్రంథంలో లారా క్రోఫ్ట్ తన ఇరవై ఒకటవ ఏట హిమాలయాలలో ఓ విమాన దుర్ఘటన నుంచి సురక్షితంగా బయటపడిందని, ఆమె తల్లిదండ్రులు బ్రతికే ఉన్నా ఆమెను వదిలేసారని ఉంది.[2] కాని హాస్యదాయక రేఖాచిత్ర కథలలో, ఆ దుర్ఘటనలో లారా తన తల్లిదండ్రులని కాబోయే భర్తను కూడా కోల్పోతుంది. చలనచిత్రాలలో విమాన దుర్ఘటన ప్రస్తావం లేదు. వాటిలో లారా తల్లి ఆమె చిన్నప్పుడే చనిపోయారని, ఆమె తండ్రి వేరే పరిస్థితులలో మరణించారని ఉంది. కోర్ డిసైన్ నుండి క్రిస్టల్ డైనమిక్స్ కు టోంబ్ రైడర్ యొక్క నిర్మాణం మారినప్పుడు పూర్వపు ఆటల నిర్దేశిక గ్రంధాలలో చెప్పినట్టుగా కాక ఆటలోని ఓ ఘట్టంలో లారా తల్లిదండ్రుల మరణాన్ని చూపించే కొత్త కథనాన్ని ప్రవేశపెట్టారు.[3][4]

అలిసన్ కరోల్, ప్రస్తుతపు అధీకృత లారా క్రోఫ్ట్ మోడల్

చాలా నటులు మరియు వస్త్రాలను లేదా వస్తువులను ప్రదర్శించే స్త్రీలు (మోడల్స్) లారా క్రోఫ్ట్ పాత్రని ప్రచారం చేయటం కోసం నిజ జీవితంలో ఈ పాత్రని పోషించారు. వీరిలో అధికారిక మోడల్ గా బ్రిటిష్ నటి నెల్ మెక్ అంద్రు మరియు ఈ ఆట ప్రాచుర్యంలోకి వచ్చిన తోలి రోజులలో రోన మిత్ర ఉన్నారు. అదనంగా ఆటల సమ్మేళనాలు పెట్టినప్పుడు మోడలింగ్ పనిలో లారా గా దర్శనమివ్వటం ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం అలిసన్ కరోల్ లారా ప్రాత్రను అధికారికంగా పోషిస్తోంది. అమెరికా నటి ఎంజేలిన జోలి టోంబ్ రైడర్ చలన చిత్రాలలో లారా క్రోఫ్ట్ పాత్రని పోషించింది.

మూల స్వరూపంలో ఆట విడులైన పది సంవత్సరాల తర్వాత కూడా లారా వీడియో గేమ్్ పాత్రలలో ప్రముఖంగా కనిపించే పాత్రగానే ఉంది. ఆడ వారి హక్కులు కోసం పోరాడే వారికి ఆదర్శప్రాయంగా లైంగిక కాల్పనికంగా పరిపరి విధాల దృష్తి కోణాలతో ఈ పాత్రను గ్రహించినప్పటికీ లోకప్రియ సంస్కృతి పై ఈ పాత్ర ప్రభావాన్ని నిరాకరించలేము.[5]

వీడియో గేమ్స్[మార్చు]

అన్ని టోంబ్ రైడర్ విడియో గేమ్ సంచికలు కలిపుకుని ఇప్పటి వరకు 35 మిల్లియన్లు[6][7] పైబడి ఆటలను అమ్మటంతో ఈ ఆట ఎక్కువుగా అమ్ముడుపోయే విడియో గేమ్స్ శ్రేణి లోకి వచ్చింది[8].

మొదట ఈ ఆట టోంబ్ రైడర్ అనే పేరుతో సేగా సేతరన్, ప్లేస్టేషన్ మరియు పిసి లో వచ్చింది. సేతరన్, పిసి లలో మొదట విడుదల అయినప్పటికీ[9][10], 90వ దశకం మధ్యలో ప్లేస్టేషన్ యొక్క అభివృద్ధికి తోడ్పడిన వాటిలో ఈ ఆట ఒకటి. ఈ ఆట, ప్రపంచాన్ని 3డిలో కొన్ని సమాధుల మరియు ఇతర ప్రదేశాల కలయికల పరంపరగా చూపిస్తుంది. ఆటాడేవారు ఈ పరంపరలను అధిగమించడంలో లారాకు దారి చూపిస్తారు. ఈ దారిలో, లారా అపాయకరమైన జీవాలను లేదా మనుషులును చంపుతూ, వస్తువులను సేకరిస్తూ, కొన్ని ప్రహేళికలు చేదిస్తూ ముందుకు సాగుతుంది. ఇదంతా తుది ఘట్టంలో ఓ పెద్ద బహుమతి కోసమే. సాధారణంగా ఈ బహుమతి మహత్తు గల కళాకృతి అయి ఉంటుంది.

టోంబ్ రైడర్ , 3డి రకంలో తొలి దశకు చెందిన ఉదాహరణ. ఇది మూడో వ్యక్తిచే చిత్రించబడిన చాయ చిత్రంలా చూపించే ప్రక్రియను వాడుతుంది. ఆటాడేవారి ఛాయాగ్రాహకం, ఆమె భుజాల పైనో లేక వెనుక నిలబడో, వెన్నంటి ఉన్నట్టుగా ఉంటుంది. సృష్టికర్తలు ఈ ఆటని 2D వేదిక శైలి ఆట నుండి 3D వేదికలో అమర్చాలనే నిర్ణయం వల్ల టోంబ్ రైడర్: ద ఏంజెల్ ఆఫ్ డార్క్ నెస్ వరకు ఆటల పరిసరాలు చాలా వరకు సమ కోణాలు గలవిగా ఉండేవి. ప్రిన్స్ ఆఫ్ పర్షియా మరియు ఫ్లాష్బాక్ వంటి ఆటల తీరు టోంబ్ రైడర్ లో కనిపించటం దీనికి నిదర్శనం.

ప్రతి సంచికతో ఈ ఆట కొత్త ఆయుధాలు మరియు కదలికలని ప్రవేశ పెట్టింది. నాలుగో సంచికలో, లారా తాళ్ళ మీద పిల్లి మొగ్గ వేసి తన వెనక ఉన్న చట్టు లాంటి వాటిని పట్టుకోవటం కూడా చేయగలిగేది. టోంబ్ రైడర్: లెజెండ్ లో విద్యుదయస్కాంతపు పిడిని ప్రవేశ పెట్టారు. దీనిని లోహపు వస్తువులకు తగిలించటం ద్వారా లారా తాడు ఊయల వేయటం, ఇతర లోహపు వస్తువులను (మరియు శత్రువులను) తన వైపుకు లాగటం లాంటివి చేయగలదు. లారా సామర్థ్యాలలో విధిగా ఉన్నవి పిల్లి మొగ్గ వేయటం, దోర్లటం, ఎత్తులను ఎక్కటం, ఈత కొట్టటం, హంసవలె ఎత్తు నుంచి దూకటం మరియు తల క్రిందలుగా చేతి పై నిలబడటం. టోంబ్ రైడర్ 3 లో, చాలా వేగంగా పరిగెత్తే కదలిక ప్రవేశపెట్టబడింది. ఈ కదలిక లారా తొందరగా వేగం పుంజుకోవటానికి తోడ్పడుతుంది. అదే సమయంలో యవనిక క్రింద మూలలో లారాకి మిగిలి ఉన్న శక్తిని సూచించే దండం ఉంటుంది. టోంబ్ రైడర్: క్రానికల్స్ , లో దండం పై ఊగటం మరియు తక్కువ ఎత్తు గల గుహల లాంటి చోట్ల పిల్లి మొగ్గలు, దోర్లటాలు చేయటం లారా సామర్ధ్యాలలో చేరాయి.

తోబి గార్డ్, టోంబ్ రైడర్ సృష్టికర్త

సాధారణంగా ఈ కథ ఓ మహాత్తుగల కళాకృతిని సంపాదించాలనే కోరిక చుట్టూ ఉంటుంది. లారా ఈ కళాకృతి కోసం తమ స్వార్ధ ప్రయోజనాలకు ఈ కళాకృతిని కావాలనుకునే కుటిల తంత్రాలు ప్రయోగించే దుండగులతో పోటి పడుతుంది. సాధారణంగా ఈ కళాకృతులు మర్మ శక్తులను కలిగి, దైవదత్తమైనవో లేదా గ్రహంతరము నుండి వచ్చినవో అయి ఉంటాయి. ఈ పరంపరలో చాలా సార్లు, ప్రత్యర్ధులు ఈ కళాకృతులను లేదా వాటి భాగాల శక్తులను ఉపయోగించి భయంకరమైన దయ్యాలను లేదా జీవాలను సృష్తిస్తారు. వీటిని లారా తన ప్రయాణంలో ఓడించాలి.

టోంబ్ రైడర్ అనే పేరు లేని మొదటి పరంపరను ఆగస్టు 18, 2010 నాడు క్రిస్టల్ డైనమిక్స్ అండ్ స్క్వేర్ ఎనిక్స్ సంస్థ లారా క్రాఫ్ట్ అండ్ ద గార్డియన్ ఆఫ్ లైట్ అనే పేరుతో కేవలం డౌన్లోడ్ చేసుకునే ఆటగా విడుదల చేసింది. టోంబ్ రైడర్ అనే పేరును వాడకుండా ఉండటం లారా క్రాఫ్ట్ అండ్ ద గార్డియన్ ఆఫ్ లైట్ ను మిగిలిన టోంబ్ రైడర్ ఆటలతో (ఆ పరంపరలో ఇంకొన్ని ఆటలు వస్తున్నందున) వేరుపరచటానికే అని పేర్కొన్నారు.[11]

GamingIndians.comతో ఓ ముఖాముఖీలో ఇదొస్ ఇంటరాక్టివ్[12] యొక్క జీవిత కాల అధిపతి అయిన ఇయాన్ లివింగ్స్టన్ తదుపరి టోంబ్ రైడర్ ఆటపై పని జరుగుతోందని ప్రకటించారు. "ఈ సంచిక చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ప్రత్యేక అమ్మకపు హక్కున్న వారి ఉన్నతికి దారి తీస్తుంది." అని లివింగ్స్టన్ అన్నారు.[13]

సంగీతం[మార్చు]

టోంబ్ రైడర్ సంగీతం ప్రధానంగా వాయిద్యపరమైనది. ఈ పరమపరలోని సంచిక మారినప్పుడు వాయిద్యాలు, స్వరము మారుస్తూ వచ్చారు. టోంబ్ రైడర్ సంగీతంలో అత్యధిక భాగం సిన్తసైజర్ లాంటి ఎలెక్ట్రానిక్ పరికరాలతో చేసిందే. (అయితే టోంబ్ రైడర్: ఏంజెల్ ఆఫ్ డార్క్నెస్ సంగీతం లండన్ సిమ్ఫోని ఆర్కెస్ట్ర చే వాయించబడినది.)[14]

మొదటి సంచికలలోని సంగీతం రోలాండ్ కార్పోరేషన్ వారి జేవి పరంపర పర్వికలు జేవి-1080 సిన్తసైజర్ పర్విక మరియు SR-JV80-02 ఎక్సపాన్షన్ బోర్డు కోసం తయారు చేసిన ఆర్కెస్ట్ర ఎక్సపాన్షన్ బోర్డుతో సమకూర్చబడింది[15]). చాలా సందర్భాలలో రాబోయే అపాయాల గురించి అడేవారిని హెచ్చరించటానికి తంత్రుల సంగీతాన్ని వాడారు. ఆడేవారు ముఖ్య ఘట్టాన్ని చేరుకున్నప్పుడో లేదా వారికి ఏదైనా వస్తువు దొరికినప్పుడో రహస్యం తెలుసుకున్నందుకు సూచికగా స్వల్ప వ్యవధి వైబ్రఫోన్ సంగీతం వినిపిస్తుంది. ఈ శబ్దాన్ని మొదటి అయిదు టోంబ్ రైడర్ వీడియో ఆటలలో వాడారు. టోంబ్ రైడర్: యానివర్సరీ లో ఈ శబ్దాన్ని వాడినా, దానిలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి.[16]

ఏంజెల్ ఆఫ్ డార్క్నెస్ లో మాటల మరియు భావ ప్రకటనలప్పుడు వినిపించే సంగీతాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆటలోని సంగీతం డాన్ని ఎల్ఫ్మన్, బాట్మాన్ ల సంగీత శైలిని సంప్రదాయ టోంబ్ రైడర్ శైలితో కలిపింది. ఈ పరంపరలో మొదటిసారి ఈ ఆట కోసమే ప్రత్యేకించి డేవిడ్ స్నేల్ నిర్వాహణలో లండన్ సింఫనీ ఆర్కెస్ట్ర వారు సంగీతాన్ని సమకూర్చారు.[17]

లెజెండ్ లో విద్యుత్కణ మాధ్యమం ఉపయోగించి నృత్యం చేయుటకు సహకారించే సంగీతం ప్రవేశపెట్టారు. అయితే, ఇందులో త్రోఎల్ నిజ వాద్యబృందం యొక్క వాతావరణాన్ని సృష్టించకుండా, ప్రతిధ్వనులను వాడారు. ఈ ఆట యొక్క శీర్షిక సంగీతంలో ఇదివరకటి ఆటల మొదటి స్వరాలని కొన్ని ఉపయోగించినా, మధ్య-తూర్పు దుడుక్ ఉపయోగించి కొంత అలంకారం చేసారు.

యానివర్సరీ కోసం ఫోల్మన్ అందించిన సంగీతం లెజెండ్ కి భిన్నంగా ఉంది. ఇందులో యాంత్రిక చప్పుళ్ళు, విద్యుత్కణ జనిత ప్రభావాలు, మరియు మాటల వెనుక ఉండే సంగీతం లేవు. ఫోల్మన్ గాలి ఊదే వాయిద్యాలు, వాయిద్య గమకాలూ మరియు ప్రత్యేక లక్షణాలతో కూడిన జటిలమైన స్వరకల్పన, వాయిద్య కూర్పు ఇచ్చాడు. యానివర్సరీ కి అందించిన సంగీత స్వర కల్పనలో ఝంకారాలు ఇనుమడింపచేసి ఫోల్మన్ తనదైన శైలిని ప్రదర్శించాడు. త్రోఎల్ విద్యుత్కణ ఆధారిత వాద్య బృందం ఉపయోగించి సంగీతాన్ని కూర్చారు. నాథన్ మాక్ క్రీ కూర్చిన మొదటి అటలోని ప్రాచుర్యం పొందిన పాటలను "టైం టు రన్," "పజల్ థీం," మరియు "పజల్ థీం 2" వంటి వాటికి సంగీతాన్ని తిరిగి సమకూర్చారు. అవే వాయిద్యాలు వాడటం వలన, ఈ సంగీతంలోని మూల విన్యాసాన్ని టోంబ్ రైడర్ మొదటి ఆట సంగీతానికి వేడుకైన పరివర్తిత రూపంగా పేర్కొనవచ్చు. గాలి ఊదే వాయిద్యాల గంభీర ఆరోహణ మరియు మంద్ర స్వరాలలో తంత్రీ వాయిద్యాలతో ప్రాచుర్యం పొందిన టోంబ్ రైడర్ శ్రావ్య సంగీతంతో మొదలైన ఈ పాట ఉల్లాసపరమైన స్వరాలతో సాగుతుంది. టోంబ్ రైడర్ మూలంలో ఉన్న హార్ప్ వాయిద్యపు కూర్పులోని కొన్ని భాగాలు ఇందులో పొందుపరచబడ్డాయి. వేలితో మీటే తంత్రీ వాయిద్యాలు, అవరోహణలో పియానోలు, షడ్జమాన్ని మార్చి వాయించే వాయిద్యాలు, ఝంకారాలు, మరియు గాజుతో చేయబడిన వాయిద్యాలు ఈ అంతరీకరణలో ప్రముఖంగా వాడబడ్డాయి. ఇది ఫోల్మన్ మరియు క్రిస్టల్ డైనమిక్స్ వారు ఈ ఆట సంగీతానికి ఓ కొత్తదనం ఇంకా ఆధునికత తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తుంది.

త్రోఎల్స్ బ్రాన్ ఫోల్మన్ అండర్ వరల్డ్ యొక్క శీర్షిక సంగీతాన్ని కూర్చాడు. అతను సంగీత పర్యవేక్షకుడుగా వ్యవహరించగా, సంగీతంలోని అత్యధిక భాగాన్ని ఓ'మల్లి కూర్చాడు. అండర్ వరల్డ్ యొక్క సంగీతం పూర్తిగా వాద్య బృందం శైలిలో ఉంది.[18] కొన్ని ఘట్టాలు మళ్లీ మళ్లీ పునరావృతం కావు, అంటే ఓ సందర్భం వస్తే ఆ ఘట్టాలు ఒక సారే వినిపిస్తాయి. లెజెండ్ లా నిరంతరంగా ఉండక టోంబ్ రైడర్ పరంపరలో మొదటి అయిదు ఆటల లాగే, ఈ ఆట కృతి కూడా సంగీతపు ఖండాలుగా ఉంది [18] .ఈ ఆటలోని శీర్షిక సంగీతంలోని మొదటి కొన్ని క్షణాలు, సుపరిచితమైన టోంబ్ రైడర్ మొదటి ఆట యొక్క శీర్షిక సంగీతంలో నాలుగు స్వరాలే. బృంద గానం, సంఘత్తనం వాడటం వలన శీర్షిక సంగీతం చివరలో, మొదల కంటే బిగ్గరగా ఉంటుంది. ఆఖరికి ఇది టోంబ్ రైడర్: ఏంజెల్ ఆఫ్ డార్క్నెస్ యొక్క నాలుగు స్వరాలలో ఉన్న శీర్షిక సంగీతాన్ని తలపింపచేసేటట్లు ఒక్కరి పాటగా ముగుస్తుంది .

చలనచిత్రాలు[మార్చు]

ఎజేలినా జోలి ఈ చలన చిత్ర పరంపరలో లారా క్రోఫ్ట్ గా నటించారు

టోంబ్ రైడర్ యూనివర్స్ పై రెండు చలచిత్రాలు నిర్మించారు: 2001లో లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్, మరియు 2003 తరువాయి భాగంగా టోంబ్ రైడర్: ద క్రాడిల్ ఆఫ్ లైఫ్, రెండిటిలో ఏంజలీనా జోలి నటించారు.

లారా క్రోఫ్ట్: టోంబ్ రైడర్ (2001)[మార్చు]

2001లో ఓ సహస చిత్రం టోంబ్ రైడర్ వీడియో గేమ్్ పరంపరలు నుంచి అనుసరించారు; దీనిలో ఆల్ సీంగ్ ఐ అనే బలమైన కళాకృతిని రాబట్టుకునేందుకు లారా క్రాఫ్ట్ సమయం మరియు దుర్మార్గులతో పోటిపడుతుంది.

ఈ చిత్రానికి నిర్దేశుకుడు సిమన్ వెస్ట్ మరియు ఏంజలీనా జోలి లారా క్రాఫ్ట్ లా నటించారు. దీనిని యు.ఎస్.లో 2001 జూన్ 15 నాడు విడుదల చేసారు, దీనికి విమర్శకుల నుంచి ప్రతికూలమైన స్పందనలు వచ్చాయి. లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్ మొదటిసారి 48.2 మిల్లియన్ డాలర్లతో ఒకటో స్థానం పై వచ్చింది, పారామౌంట్ కి రెండో సారి మంచి స్పందన మరియు 2001లో నాలుగో స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రం మహిళా సామర్థ్యం కూడిన చిత్రాలు విడుదలయిన రోజు రికర్దాలకి దెబ్బ కొట్టింది (చార్లీ ఎంజల్కి 40.1 మిల్లియన్ డాలర్లు) ఇంకా (ప్రిన్స్ ఆఫ్ పర్షియ) తర్వాత ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 300,000,000 డాలర్లతో అనుకూల వీడియో గేమ్ గా సాఫల్యం సాధించింది.[19][20][21][22]

టోంబ్ రైడర్:ద క్రేడల్ ఆఫ్ లైఫ్ (2003)[మార్చు]

ఎంజలినా జోలి 2003లో ప్రాథమిక వీడియో గేమ్ పై ఆధారం ఉన్న తరవాయి చిత్రంతో లారా క్రాఫ్ట్ గా వచ్చింది. ఈ సారి, లారా క్రాఫ్ట్ భూమి పై ప్రాణాంతకమైన మహామరులు సృష్టించే పండోర బాక్స్ ని దుష్ట శాస్త్రజ్ఞురాలు అయిన జోనాథన్ రైస్ చేతిలో పడక ముందే వెతికి పట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.

ఈ చిత్రాన్ని జాన్ డి బోంట్ నిర్దేశించగా అమెరికాలో 2003 జూలై 21లో విడుదల చేయగా, మూలం కన్నా కూడా సద్విమర్శ వచ్చింది. ఇలా సద్విమర్శ వచ్చినప్పటికీ, క్రేడల్ ఆఫ్ లైఫ్ మొదటి వారంలో $21.7 మిలియన్లతో[23] నాలుగో స్థానంలో నిలవటంతో ఫలితాల విషయంలో నిరాశ పరిచింది. దీని మూలం మొదటి వారాంతపు రాబడి $47.7 మిలియన్లతో పోలిస్తే ఈ చలన చిత్రానికి వచ్చిన రాబడి 55% తక్కువ. ఆ దేశంలో ఈ చలన చిత్రం కేవలం $65 మిలియన్లు మాత్రమే సంపాదించి, లాభాల కోసం విదేశీ రాబడుల మీద ఆధారపడింది. $156.5 మిలియన్ల మొత్తం రాబడితో ఈ చలన చిత్రం $118 మిలియన్ల నష్టాన్ని చవిచూసింది - ఈ నష్టం దాదాపుగా క్రెడిల్ యొక్క బడ్జెట్ తో సమానం. దీనితో పోలిస్తే, మూలానికి $274.4 మిలియన్ల లాభం వచ్చింది.[24]

సంభావ్యమైన మూడో చిత్రం[మార్చు]

ద హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం వార్నర్ బ్రదర్స్ దాన లిన్ నిర్మాతగా మూడో చిత్రం పై పని నడుస్తోంది. డిసెంబరు 2008 లోటైం వార్నర్ ఎఇదొస్ లో షరతులు ఎక్కువ చేసి ఈ చిత్రం యొక్క హక్కులని సంపాదించుకున్నాడు. ఈ చిత్రం నిర్దేశకుడు మరియు రచయిత లేని తోలి దశ కలిగి ఉన్నది, కాని ఇది లారా క్రాఫ్ట్ "ఒరిజిన్స్ ...లవ్ ఇంటరెస్ట్ అండ్ ద మెయిన్ విలన్"ని మళ్ళీ మొదలుపెడుతుంది అని సూచిస్తుంది. ఏంజెలీనా జోలి లారా క్రాఫ్ట్ పాత్ర పోషించటము లేదు అని, రచయిత మరియు నిర్దేశకుడు ఈ యోజనలో వచ్చిన తర్వాత ఓ క్రొత్త నటిని తిసుకుంటున్నారు అని నివేదిక సూచిస్తోంది.[25]

బాక్సాఫీసు లో ప్రదర్శన[మార్చు]

చలనచిత్రం విడుదల తేదీ బాక్సాఫీసు ఆదాయం బాక్సాఫీసు ర్యాంకింగ్ బడ్జెట్ వివరణ
సంయుక్త రాష్ట్రాలు విదేశాలు ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా ప్రపంచ వ్యాప్తంగా
లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్ 2009 జూన్ 11 $131,168,070 $143,535,270 $274,703,340 #251 #243 $115,000,000 [26]
లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్ : క్రేడిల్ ఆఫ్ లైఫ్ 2003 జూలై 13 $65,660,196 90.8 (2007) $156,505,388 #788 శైలి ="పురవరంగం :పల్చని బూడిద రంగు;" $95,000,000 [27]
మొత్తం $196,828,266 $234,380,462 $431,208,728 $210,000,000

విమర్శనాత్మక ప్రతిస్పందన[మార్చు]

చలనచిత్రం రోటేన్ టమేతోస్ మెటాక్రిటిక్
మొత్తం కరీం ఆఫ్ ది క్రాప్
లారా క్రాఫ్ట్: టోంబ్ రైడర్ 19% (154 సమిక్షలు)[28] 11% (9 సమీక్షలు)[29] 33% (31 సమీక్షలు)[30]
లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్:క్రేడిల్ ఆఫ్ లైఫ్ 24% (163 సమీక్షలు)[31] 25% (8 సమీక్షలు)[32] 43% (34 సమీక్షలు)[33]

ఇతర మీడియా[మార్చు]

టోంబ్ రైడర్ని టాప్ కౌ ప్రొడక్షన్స్,కి అనుమతి ఇచ్చారు, ఇది 1999 నుంచి చాలా ఎక్కువ టోంబ్ రైడర్ హాస్య పుస్తకాలని ముద్రించింది. 2004లో ఆఖరి మరియు యభైవ హాస్య పుస్తకంతో ఈ పరంపర ముగిసింది.

బెల్లంతైన్ బుక్స్, ఎఇదొస్ సంయోగంతో వాస్తవ నవలలు ముద్రించే పరంపర 2004 వసంతం నుంచి మొదలుపెట్టారు, వీటిలో మొదటిది మైక్ రెస్నిక్ రాసిన ద అమ్యులేట్ ఆఫ్ పవర్, దీని తర్వాత 2004లో ఇ.ఇ .నైట్ రాసిన ద లాస్ట్ కల్ట్ తర్వాత జేమ్స్ అలన్ గార్డ్నర్ రాసిన ద మెన్ ఆఫ్ బ్రాంజ్ 2005 జనవరిలో వచ్చాయి. వీటిలో సాధారణంగా చలనచిత్రాల కన్నా విడియో గేం నిరంతరని అనుసరిస్తారు, (ముఖ్యంగా ఏంజెల్ ఆఫ్ డార్క్నెస్ ని), అయినా కాని లాస్ట్ కల్ట్లో క్రేడల్ ఆఫ్ లైఫ్ ఉల్లేఖలు ఉన్నాయి. మెన్ ఆఫ్ బ్రాంజ్కి మరియు ముందు రెండు పుస్తకాలకీ అభిప్రాయభేదాలు ఉన్నాయి, ఇవి లారా క్రాఫ్ట్ వైఖరిని మొదటి-వ్యక్తి విశదీకరణలో ఉన్నాయి. బెల్లంతైన్ వారి ఒప్పందం మూడు పుస్తకాలకే ఉంది మరియు ఈ పుస్తకం యొక్క పరంపర నడుస్తుందో లేదో తెలియదు.

కొన్ని టోంబ్ రైడర్ సంగీత సంకలనాలు అధికారంగా విడుదల అయ్యాయి.

 • Tomb Raider: Anniversary (కలెక్టర్స్ సంచిక) - ఈ విడుదలలోTomb Raider: Legend మరియు Tomb Raider: Anniversaryలో ఉన్న సంగీతం ఉన్నాయి. వీటిని త్రోఎల్స్ బ్రన్ ఫోల్మన్ స్వరబద్ధం చేసారు. మూడు డిస్కుల సముదాయంలో ఓ సంగీతపు CD కూడా ఉండేది. తర్వాత వచ్చిన రెండు డిస్కుల సముదాయంలో అదే సంగీతాన్ని ఒక DVDలో జతపరిచారు.[34][35]
 • టోంబ్ రైడర్: అండర్ వరల్డ్ (తక్కువ సంఖ్యలో విడుదలైన సంచిక)తో పది పాటల DVDని జత చేసారు.[36][37][38] (విశ్వకోశం యొక్క అండర్ వరల్డ్ అంశంలో వివరించబడినది).
 • టోంబ్ రైడర్ ఆటల ప్రచారార్ధం కొన్ని పాటల సంపుటులను ప్రజలకు పంచారు. ఈ పాటలు విడుదలైన వేరే సంగీత సంకలనాలలో భాగం కాకపోవటం వల్ల, వీటి మూలాన్ని కనుగొనడం కష్టంగా ఉంది. టోంబ్ రైడర్: అండర్ వరల్డ్ నుంచి తీసుకున్న మేడిటెర్రేనియన్ మర్డర్ [39] మరియు డీప్ సీ ఎన్కౌంటర్ [40] ఇందుకు ఉదాహరణలు. ఈ ఆటలు సంగీతం నుండి తీసుకున్నవే అయినా ఇవి అధికారిక రూపంలో ఎక్కడా కనిపించవు.
 • వీటితో పాటు, టోంబ్ రైడర్ చలన చిత్రాలలోని పాటలు/సంగీతాంశాలను నాలుగు సంచికలలో విడుగల చేసారు. రెండు Lara Croft: Tomb Raiderలో నుండి తీసుకున్నవైతే మరి రెండు లారా క్రోఫ్ట్: టోంబ్ రైడర్ - ద క్రెడిల్ ఆఫ్ లైఫ్ లోనివి. (ప్రతి సంగీతాంశము అనేక మంది కళాకారుల సంగీతాంశాముల సంకలము మరియు వారి స్వరకల్పనలే).[41][42][43][44]

గేమ్్ ట్యాప్ 2007 జూలై 10 నుండి 2007 నవంబరు 13 వరకు Re\Visioned: Tomb Raider Animated Series పేరు గల పది భాగాల కదిలే చిత్రాలతో చూపించే చిన్న కథల సంకలనాలని ప్రసారం చేసింది. ఈ పరంపరలో లారా క్రోఫ్ట్ వివిధ సామర్ధ్యాలను ప్రదర్శించారు. మిన్నీ డ్రైవర్ లారా క్రోఫ్ట్ పాత్ర తరఫున మాటలు చెప్పారు.

థీమ్ పార్క్ సవారీలు[మార్చు]

లారా క్రోఫ్ట్: టోంబ్ రైడర్ మరియు తదుపరి చలన చిత్రాలకు పారామౌంట్ పిక్చర్స్ సంస్థ పంపకందారులుగా ప్రత్యేక హక్కులను కలిగి ఉండటంతో, వారి సొంతమై వారిచే నడపబడుతున్న ఆరు పారామౌంట్ పార్క్ లలో టోంబ్ రైడర్ అంశాన్ని కూడా చేర్చడానికి అర్హత లభించింది. తర్వాత ఈ హక్కు CBS కార్పోరేషన్ కు సంక్రమించింది. పారామౌంట్ పార్క్స్ వారు ఇప్పటి వరకు మూడు టోంబ్ రైడర్ సవారీలు మొదలుపెట్టారు. ఇవి: టోంబ్ రైడర్: ద రైడ్ (రెండు చోట్ల ఉంది - కింగ్స్ ఐలాండ్ లో హస్స్ వారి జైంట్ టాప్ స్పిన్ మరియు కెనడాలోని వండర్లాండ్ లో ఎగిరించి దొర్లించి తిప్పే యంత్రం), టోంబ్ రైడర్: ఫైర్ ఫాల్ (కింగ్స్ డొమినియన్ లో హస్స్ వారి సస్పెండేడ్ టాప్ స్పిన్). సేడార్ ఫెయిర్ ఎల్ పికి పారామౌంట్ పార్క్ యొక్క అమ్మకంతో టోంబ్ రైడర్ పేరు వాడుకునే హక్కులను కోల్పోయారు. అందు వలన, కింగ్స్ ఐలాండ్ లోని "టోంబ్ రైడర్: ద రైడ్" మరియు కింగ్స్ డొమినియన్ లోని "టోంబ్ రైడర్: ఫైర్ ఫాల్" లను "ద క్రిప్ట్" గాను, కెనడా వండర్లాండ్ లోని "టోంబ్ రైడర్: ద రైడ్"ను "టైం వార్ప్" గాను పేరు మార్చారు.

పారామౌంట్ పార్క్స్ నుండి వెనక్కు తీసుకున్న హక్కులు, పెట్టుబడులతో ఇటలీ లోని మూవీలాండ్ స్టూడియోస్ లో టోంబ్ రైడర్: ద మషీన్ మొదలు పెట్టారు. విండ్ షియర్ అని పిలువబడే జంపెర్ల, వారు తయారు చేసిన ఈ సవారీ హస్స్ వారి టాప్ స్పిన్ ను పోలి ఉన్నా, దాని కన్నా అధునాతనమైనది.

కింగ్స్ ఐలాండ్ లోని టోంబ్ రైడర్: ద రైడ్ మొదటి మరియు ఏకైక గృహాన్తర్గత సవారీ. సాధారణంగా పులకరింతలతో కూడినది అయినా విసుగు కలిగించే చాలా జాతరలలో ఉండే టాప్ స్పిన్ లాంటి సవారీని ఈ గృహాన్తర్గత సవారీలో చక్కటి పరస్పర సంపర్గం ఏర్పడే చీకటి సవారిగా మలిచారు. ఇందులో లావా గుంతలు, అగ్ని పర్వతాలు, సూదిగా ఉండే ఇసు ముక్కలు, లేసర్ కళ్ళున్న పెద్ద అమ్మవారి బొమ్మ వంటివి ఉన్నాయి.[45] ఈ సవారీని ప్రత్యేకంగా రూపొందించబడిన టోంబ్ రైడర్ సంగీతంతో సమకాలీకరణం చెయడమే కాక, మొదటి చలన చిత్రం నుండి ఆరు చేతుల "దుర్గా" దేవిని, నీటి పాత్రలను, మరియు చలన చిత్రంలో ప్రాణం పోసుకునే పోరాడే కోతుల విగ్రహాలు చేర్చారు.

సూచనలు[మార్చు]

 1. "IGN: Toby Gard Biography". ign.com. Retrieved 2009-09-25. Cite web requires |website= (help)
 2. టోంబ్ రైడర్ ఆట నిర్దేశిక గ్రంథం (డౌన్లోడ్)
 3. (డౌన్లోడ్)
 4. టోంబ్ రైడర్: యానివర్సరీ ఆట నిర్దేశిక గ్రంథం డౌన్లోడ్)
 5. "Lara Croft: Feminist Icon or Cyberbimbo? On the Limits of Textual Analysis". Gamestudies.org. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 6. "UNDERWORLD SET FOR CHRISTMAS DEBUT". tombraiderchronicles.com. 2008-02-29. Retrieved 2009-03-23.
 7. "IP Profile: Tomb Raider". developmag.com. 2008-11-14. Retrieved 2009-03-23.
 8. "Japan dominates best-selling games franchise list". gamesindustry.biz. Eurogamer. 2007-01-11. Retrieved 2009-03-23.
 9. "Tomb Raider for Saturn Release Summary". GameSpot. Retrieved 2010-01-17. Cite web requires |website= (help)[permanent dead link]
 10. "Tomb Raider for PlayStation Release Summary". GameSpot. Retrieved 2010-01-17. Cite web requires |website= (help)[permanent dead link]
 11. "LC: The Guardian of Light Preview for PC, PS3, XBOX 360 from". 1UP.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)[permanent dead link]
 12. "Livingstone takes life president role at Eidos". Gamesindustry.biz. 2009-04-29. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 13. Tomb Raider News Channel (2009-05-11). "Interview with Ian Livingstone by GamingIndians.com". Tombnews.com. మూలం నుండి 2011-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 14. Starpulse. "Credits for AoD". Lara Croft: Tomb Raider The Angel of Darkness (PlayStation 2) Credits. Starpulse. మూలం నుండి 2009-08-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-02.
 15. "SR-JV80-02". Synthmania.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 16. Troels Brun Folmann. "The music of Tomb Raider: Anniversary". 1up. మూలం నుండి 2013-05-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-09. Cite web requires |website= (help)
 17. Starpulse. "Credits for AoD". Lara Croft: Tomb Raider The Angel of Darkness (PlayStation 2) Credits. Starpulse. మూలం నుండి 2009-08-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-04-02.
 18. 18.0 18.1 "Podcast 3 - Interview with TR:U composer Troels Folmann". Tombraider.com. మూలం నుండి 2008-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 19. "Weekend Box Office". Cite web requires |website= (help)
 20. "Box Office Mojo chart". Cite web requires |website= (help)
 21. "Prince Of Persia is biggest game movie ever | News". Gamesindustry.biz. 2010-06-22. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 22. "'Prince of Persia' surpasses 'Lara Croft' - Films, Arts & Entertainment". The Independent. 2010-06-25. Retrieved 2010-08-11. Cite news requires |newspaper= (help)
 23. జులై 25-27 2003 సప్తాహాంతం లో బాక్స్ ఆఫీస్ పరిణామాలు - బాక్స్ ఆఫీస్ మోజో
 24. లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్: ద క్రెడిల్ ఆఫ్ లైఫ్ -బాక్స్ ఆఫీస్ మోజో
 25. Steven Zeitchik (2009-01-28). "Lara Croft to return to the big screen". The Hollywood Reporter. Retrieved 2009-02-07.[dead link]
 26. "Lara Croft: Tomb Raider (2001)". Box Office Mojo. Cite web requires |website= (help)
 27. "Lara Croft Tomb Raider: Cradle of Life (2003)". Box Office Mojo. Cite web requires |website= (help)
 28. "Lara Croft: Tomb Raider". Rotten Tomatoes. Retrieved 2009-12-01. Cite web requires |website= (help)
 29. "Lara Croft: Tomb Raider". Rotten Tomatoes. Retrieved 2009-12-01. Cite web requires |website= (help)
 30. "Lara Croft: Tomb Raider (2001): Reviews". Metacritic. Retrieved 2009-12-02. Cite web requires |website= (help)
 31. "Lara Croft Tomb Raider: Cradle of Life". Rotten Tomatoes. Retrieved 2009-12-01. Cite web requires |website= (help)
 32. "Lara Croft Tomb Raider: Cradle of Life". Rotten Tomatoes. Retrieved 2009-12-01. Cite web requires |website= (help)
 33. "Lara Croft Tomb Raider: Cradle of Life (2003): Reviews". Metacritic. Retrieved 2009-12-01. Cite web requires |website= (help)
 34. "Lara Croft Tomb Raider: Anniversary (Collector's Edition)". MobyGames. 2008-11-21. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 35. "Lara Croft Tomb Raider Anniversary Collectors Edition Game PS2: Amazon.co.uk: PC & Video Games". Amazon.co.uk. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 36. "Buy Tomb Raider: Underworld Limited Edition for PS3 at Mighty Ape NZ". Mightyape.co.nz. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 37. "Tomb Raider: Underworld (Limited Edition) for Xbox 360". MobyGames. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 38. "Tomb Raider: Underworld Limited Edition >> Xbox 360 >> EB Games New Zealand". Ebgames.co.nz. మూలం నుండి 2010-05-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 39. Tomb Raider News Channel (2008-09-05). "TOMB RAIDER NEWS :: Eidos Interactive releases Tomb Raider: Underworld Mediterranean Murder Soundtrack". Tombnews.com. మూలం నుండి 2011-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 40. Tomb Raider News Channel (2008-09-12). "TOMB RAIDER NEWS :: Eidos Interactive releases Tomb Raider: Underworld Deep Sea Encounter Soundtrack". Tombnews.com. మూలం నుండి 2011-07-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 41. "Tomb Raider: Graeme Revell: Music". Amazon.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 42. "Tomb Raider: Original Motion Picture Score: Graeme". Amazon.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 43. "Lara Croft Tomb Raider: The Cradle of Life: Various". Amazon.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 44. "Tomb Raider: The Cradle of Life (Score): Alan Silvestri: Music". Amazon.com. Retrieved 2010-08-11. Cite web requires |website= (help)
 45. Rick Davis (2009-01-28). "Tomb Raider: The Ride - the Unveiling". DAFE. మూలం నుండి 2011-07-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-02-07.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Tomb Raider series