ట్రైన్ టు పాకిస్తాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Train to Pakistan
కృతికర్త: Khushwant Singh
దేశం: India
భాష: English
విభాగం(కళా ప్రక్రియ): Historical novel
ప్రచురణ: Chatto & Windus
విడుదల: 1956
ప్రచురణ మాధ్యమం: Print (Hardback & Paperback)
పేజీలు: 181 pp
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): NA & reissue ISBN 0-8371-8226-3


ట్రైన్ టు పాకిస్తాన్ ఓ చారిత్రాత్మక నవల. కుష్వంత్ సింగ్ రాసిన ఈ నవల 1956లో ప్రచురితమైంది. ఈ నవల 1947 ఆగస్టులో జరిగిన భారత్ విభజనను వివరిస్తుంది.

ఈ నవలలో రాజకీయ ఘటనలను వివరించడానికే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సింగ్ స్థానిక అంశాల పైనే ఎక్కువగా దృష్టి సారించారు. మానవీయ కోణంలో తన రచనను కొనసాగించారు. వాస్తవంగా ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని, మరియు అప్పటి హింసను ఈ నవల బయటపెట్టింది.

అది 1947 వేసవి కాలం. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న గ్రామం మనో మజ్ర. ఆ గ్రామంలో ఉన్న సిక్కులు, ముస్లింలు దేశ విభజన గురించి పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా అదే సమయంలో ఓ వడ్డీ వ్యాపారి హత్య చేయబడతాడు. అందరూ జుగుత్ సింగ్ ను అనుమానిస్తారు. అతడు గ్రామంలో ఆకతాయిగా తిరుగుతూ ఉంటాడు. అప్పటికే ఓ ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడతాడు. అదే సమయంలో ఓ రైలు వస్తుంది. అది సిక్కుల శవాల్ని మోసుకొస్తుంది. గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. యుద్ధరంగంగా మారిపోతుంది. కలెక్టర్ గాని, పోలీసులుగాని, ఆ హింసను అడ్డుకోలేకపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో, గ్రామంలో శాంతి నెలకొల్పేందుకు తనను తాను మార్చుకునే అవకాశాన్ని జుగుత్ సింగ్ కే వదిలేస్తారు.

అభిప్రాయం[మార్చు]

సింగ్ తన పాత్రల ద్వారా నైతికతను ప్రశ్నిస్తాడు. చెడును గుర్తిస్తేనే మంచిని పెంచగలమని, అది మంచి ఉద్దేశమని సింగ్ భావన.

సామాజిక మరియు సంస్క్రతిక అవగాహన[మార్చు]

చూడ్డానికి చిన్న పుస్తకంలా కనిపించినా, పాఠకుడికి మాత్రం ఎన్నో పాత్రలు పూర్తిగా అవగతమవుతాయి. వివిధ వర్గాల ప్రజల్ని పరీక్షిస్తే అది అప్పటి కాలమాన పరిస్థితులు, సంస్క్రతిక, సామాజిక అవగాహన పెంచడమే కాదు, ఏదో ఒక వర్గాన్ని నిందించకూడదన్న సత్యం బోధపడుతుంది. ఆ పరిస్థితులకు అందరూ బాధ్యులే అన్న సంగతి అర్థమవుతుంది.

‘‘హిందువులే పథకం ప్రకారం హత్యలు చేయడం మొదులుపెట్టారని ముస్లింలు చెప్పారు. హిందువులేమో, ముస్లింలను నిందించారు. నిజానికి రెండు వర్గాల వాళ్లు హత్య చేయబడ్డారు. రెండు వర్గాల వాళ్లు కాల్చుకున్నారు. పొడుచుకున్నారు. ఇరువైపులా హింస వ్యాపించింది మరియు కలగలిసి పోయింది. ఒకరినొకరు హింసించుకున్నారు. రెండు వర్గాల వారు అత్యాచారాలకు గురయ్యారు‘‘.

ఈ నవలలోని కాల్పనిక గ్రామం మనోమజ్రలో ముస్లింలు, సిక్కుల ప్రాబల్యమే ఎక్కువ. సింగ్ తన నవలలో ఓ విచిత్రమైన వాతావరణం చూపించారు. అందులో సిక్కులు, ముస్లింలను ద్వేషిస్తారు. ముస్లింలు, సిక్కుల్ని ద్వేషిస్తారు. గ్రామంలో మాత్రం రెండు వర్గాలు కలిసే శాంతియుత జీవనం సాగించేవి. తమ గ్రామం బయట ఏం జరుగుతుందో వీరికి సరిగ్గా తెలిసేది కాదు. బయట విషయాలు ఏమైనా తెలిస్తే అవి పుకార్లు, నోటి మాటల ద్వారానే తెలిసేవి. అందుకే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్లకు తెలిసేది కాదు. ప్రభుత్వం ముస్లింలను భద్రతా కారణాల రీత్యా మనో మజ్ర నుంచి పాకిస్తాన్ కి తరలించాలని నిర్ణయించింది. అది తెలిసిన ఓ ముస్లిం, ‘‘మేం పాకిస్తాన్ వెళ్లి ఏం చేయాలని ప్రశ్నిస్తాడు. మేం ఇక్కడే పుట్టాం. మా పూర్వికులు కూడా ఇక్కడే పుట్టారు. మేము, సిక్కులు కలిసి ఇక్కడ సోదరుల్లా జీవిస్తున్నాం‘‘ అని చెప్తాడు. పాకిస్తాన్ కు వెళ్లిపోవాలనుకున్న ముస్లింలంతా శరణార్థ శిబిరాలకు వెళ్తారు. అదే సమయంలో కొంత మంది మతోన్మాదులు మనో మజ్రకు వస్తారు. స్థానిక సిక్కుల్లో ద్వేషభావం నూరిపోసి ఓ స్థానిక గుంపును పాకిస్తాన్ వెళ్లే రైలులో ముస్లింలను హత్య చేసేలా పురికొల్పుతారు.

మతవిశ్వాసాల్ని పక్కన పెట్టి ప్రజల్ని దగ్గరగా పరిశీలిస్తే సామాజిక నిర్మాణం మరింత వివరంగా అర్థమవుతుంది. ప్రభుత్వ అధికారులు అవినీతిపరులు. ప్రజల్ని తప్పుదోవపట్టించేవారు. ఏదో ఒక సాకుతో ఎవరినైనా ఖైదు చేసేవారు. కానీ ఇదంతా సొంత లాభం కోసం కాదు. కేవలం సమస్య పరిష్కారం కోసమే వాళ్లు ఇదంతా చేస్తున్నారని అంతా భావించేవారు. అందుకే వాళ్లు ఏం చేసినా ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు. చట్టాల్ని అమలు పరిచే అధికారమంతా స్థానిక ప్రభుత్వాల దగ్గరే ఉండేది. దీంతో అక్కడ న్యాయమనేది లేకుండా పోయింది. కొంత మంది చదువుకున్న వాళ్లు గ్రామస్థుల్లో ప్రజాస్వామ్య, సామ్యవాద సిద్ధాంతాలు, పాశ్చాత్య భావజాలం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించేవారు. కానీ గ్రామీణులు అయోమయానికి గురయ్యేవారు. ఒక చదువుకున్న వ్యక్తి గ్రామస్థులకు స్వాతంత్ర్యం గురించి చెబుతున్నప్పుడు, ఓ గ్రామస్థుడు తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించాడు.

‘‘స్వాతంత్ర్యం చదువుకున్నవాళ్ల కోసమే. వాళ్లే దాని కోసం పోరాడారు. మేం ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్లకు బానిసలం. ఇప్పుడు చదువుకున్న భారతీయులకో, పాకిస్తానీయులకో బానిసలం కాబోతున్నాం.

ఆంగ్లేయులు భారతదేశాన్ని వదలి వెళ్లిపోయినంత మాత్రాన నిరక్షరాస్యులకు ఏ మాత్రం మేలు జరగదనే ఆలోచనకు అది ఆరంభమైంది. అత్యధికంగా ఉన్న నిరక్షరాస్యులు అయోమయ పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టబడ్డారు. ఇది వాళ్ల అవకాశాల్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ ప్రభావానికి లోనైన నిరక్షరాస్యులు నిందించే పరిస్థితి ఎలా ఏర్పడింది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇది మరో ముఖ్య అంశాన్ని కూడా వివరిస్తోంది. ఓ విద్యావంతుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే దీని వల్ల సమాజానికి వచ్చే ముప్పేమీ ఉండదు.

నీతి సందేశం మరియు వ్యక్తిత్వ వికాసం[మార్చు]

మానవ చర్యల్ని నిశితంగా వివరించడం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని వివరించడమే కాకుండా సింగ్ ఇంకా చాలా విషయాల్ని చెప్పారు. ఈ నవలలో అంతర్గతంగా సింగ్ ఓ సందేశాన్ని వినిపించారు. దానిని తన పాత్రల ఆలోచనలు, చేతల రూపంలో బయటపెట్టారు. ఈ నవల మొత్తం మీద ఎక్కువ ప్రభావితం చేసే పాత్ర ఆ ప్రాంత కలెక్టర్ హుకుం చంద్. ఇతడు అత్యంత వివాదాస్పదుడుగా కనిపిస్తాడు. సంవత్సరాల తరబడి తన అధికారాలను దుర్వినియోగం చేసిన అవినీతిపరుడు. వ్యక్తిగత పరిశుభ్రతలేని వ్యక్తిగా, వికారమైన తన చేష్టలతో చిరాకుపరిచే మనిషిగా అతడి పాత్ర చిత్రించారు. హిందూ, ముస్లిం వర్గాల వివాదాల సమయంలో ప్రతీసారీ హుకుమ్ చంద్ అనైతికత బయటపడేది. వాళ్లు కొట్లాట మొదలు పెట్టేవారు. కాసేవటికి హుకుమ్ చంద్ వద్దకు వచ్చేవారు. అతడు కోపంతో రెచ్చిపోయేవాడు. తప్పు ఎవరిదైనా సరే, ఇద్దరూ అతడికి లొంగిపోవాల్సి వచ్చేది. అదంతా అతడికున్న అధికారాల మహిమే.

‘‘తన చేతులు చాలా శుభ్రంగా ఉన్నాయని, వాటిని వాళ్లు మురికి చేసేస్తున్నారని హుకుమ్ చంద్ అనుకునేవాడు. తన చేతుల్ని చొక్కాకు తుడుచుకునేవాడు. అంతే కాదు, దానిని తుడిపించేవాడు లేదంటే ఉతికించి శుభ్రం చేయించేవాడు.

హుకుం చంద్ కి ఉన్న మరో అవలక్షణం తాగుడు. పగలు తాను చేసే తప్పులకు ఉపశమనంగా రాత్రులు మద్యం తాగేవాడు. తాగినప్పుడు అతడు తన కూతరు వయస్సు ఉన్న ఓ వేశ్య దగ్గరకు వెళ్లేవాడు. అతడి చుట్టూ ఉన్న వివాదాలు, అతడు చేస్తున్న పనులు అన్నీ అతడి పై చెడు ముద్రే వేస్తున్నాయి. అంతమాత్రాన అతడు మంచిని ప్రచారం చేయడానికి అర్హుడు కాడా.

మరో రెండు ముఖ్యమైన పాత్రలు ఇక్బాల్ సింగ్, జుగుత్ సింగ్. ఇవి రెండు విభిన్న పాత్రలు. ఇక్బాల్ సింగ్ మంచి అభిప్రాయాలు ఉన్న యువకుడు, బాగా చదువుకున్నవాడు, విలువలకి కట్టుబడే సామాజిక కార్యకర్త. జుగుత్ సింగ్ మంచి శరీరసౌష్ఠవం ఉన్న యువకుడు, నిరక్షరాస్యుడు, కాస్త దుందుడుకు మనిషి, అందుకే తరచూ ముఠా తగాదాల్లో ఇరుక్కునేవాడు మరియు ఖైదు చేయబడేవాడు. వీళ్లిద్దరూ ఒక హత్యకేసులో ఖైదు చేయబడ్డారు, పక్కపక్క జైలుగదుల్లో బంధింపబడ్డారు. నిజానికి ఈ ఇద్దరిలో ఎవ్వరూ ఆ హత్య చేయలేదు. జైలు నుంచి విడుదలయ్యాక వీళ్లిద్దరూ ఓ ముఠా పాకిస్తాన్ కి ముస్లింలను తీసుకువెళ్తున్న రైలు పై దాడి చేసేందుకు కుట్ర పన్నిందనే విషయం తెలుసుకున్నారు. వాళ్లిద్దరికీ ఆ రైలును కాపాడే శక్తి ఉంది. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. జరుగుతున్న పరిణామాలతో జుగుత్ సహనం కోల్పోతాడు, ఉద్రేకపడతాడు, రైలును కాపాడేందుకు తన ప్రాణాలు అర్పిస్తాడు. ఇక్బాల్ తన కీర్తిని కోరుకుంటాడు. తనేం చేసినా అందులో నైతిక విరుద్ధతను చూపించేందుకు ప్రయత్నిస్తాడు.

‘‘తుపాకీ గుండు తటస్థమైంది. అది మంచివాళ్లనైనా చంపేస్తుంది, చెడ్డవాళ్లనైనా చంపేస్తుంది. ముఖ్యమైనవాళ్లయినా, అవసరంలేనివాళ్లయినా, ఆ తేడా దానికి తెలిదు. ఎవరైనా తమంతట తాముగా త్యాగానికి సిద్ధపడితే, ఆ త్యాగం వెనుక ఉన్న నైతిక సందేశం ప్రజలకు చేరినప్పుడు మాత్రమే దానికి ఓ గుర్తింపు లభిస్తుంది. ఒక విషయం సహజ సిద్ధంగా మంచిదైతే సరిపోదు. అది మంచిదన్న విషయం అందరూ గుర్తించాలి. అప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. ఈ విషయం ఏ ఒక్కరో తమలో తాము తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ ఒక్కరు సరైన వ్యక్తై ఉండాలి.

ఈ పుస్తకంలో మంచి, చెడుల ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. చెడును అడ్డుకునేందుకు అందుబాటులో ఉండే అవకాశాల్ని మలుచుకోవాలని ఈ నవల చెబుతుంది. ఓ మంచి పని చేయడం నిజంగా విలువైందే. అదే సమయంలో చెడు పట్ల కూడా అవగాహనతో మెలగాలి. ట్రైన్ టు పాకిస్తాన్ నవల చెడు గురించి కూడా తెలుసుకోవాలని చెబుతుంది. ఈ పుస్తకంలో భయానక హింస, చావులు, అత్యాచారాలు ఇవన్నీ ఉన్నాయి.

కసరాలను మనం అర్థం చేసుకుంటే ఇంకా ఎన్నో విషయాలు అవగతమవుతాయి. అతడు ఎన్నో ప్రాంతీయ అంశాలు, మానవీయ కోణాలు చూపించేందుకు ప్రయత్నించాడు. అవి మానవ వికాసానికి దోహదం చేసే అంశాలు.

రాజకీయాలు[మార్చు]

దేశ విభజనకు సంబంధించిన రాజకీయాలు కుష్వంత్ సింగ్ పెద్దగా చర్చించలేదు. వ్యక్తిగత అంశాలు, మానవీయ కోణాలు, సామాజిక అవగహనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. చారిత్రాత్మకమైన రెండు అంశాలకు ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. విభజనతో రాజకీయాల్లో భారీ మార్పులు వచ్చాయి. మార్పు ప్రభావం గుర్తించదగిందే, కానీ సింగ్ ను బాగా భయపెట్టే విధంగా చూపించారు. సామాజిక, మత వర్గాలు పుణరేకీకరణ చెందాయి మరియు హింసాత్మక కొట్లాట్లకు దిగాయి. ఆ పరిస్థితులకు దాదాపు అందరూ కారణమే అని రచయిత అభిప్రాయం. ఇందుకు అందర్నీ సమానంగా నిందించాలన్నది ఆయన వాదన. విభజన సమయంలో సంఘటనలన్నింటిని కలిపి ఆయన ఇందుకు ఉదాహరణగా చూపించాడు.

చలనచిత్రం[మార్చు]

ట్రైన్ టు పాకిస్తాన్ ఆధారంగా 1998లో ఓ సినిమా కూడా తీశారు. దీని పేరు కూడా ట్రైన్ టు పాకిస్తాన్. పమెలా రుక్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 1999 నాటి సినీక్వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఉత్తమ చిత్రం విభాగానికి అర్హత సాధించింది. నిర్మల్ పాండే, మోహన్ అగాషే, రజిత్ కపూర్, స్మృతి మిశ్రా, దివ్యా దత్తా, మంగల్ థిల్లాన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

2006 ప్రతి[మార్చు]

న్యూఢిల్లీ లో రోలీ బుక్స్ మార్గరెట్ బర్క్ వైట్ యొక్క హింసా పూరితమైన 66 ఫోటోలతో పాటుగా ఈ నవల కొత్త ప్రతిని కూడా ప్రచురించింది. 2006 చివరలో రోలీ సంస్థ తన కొత్త ప్రతికి ఫ్రాంక్ఫర్ట్ పుస్తక ప్రదర్శనలో ఒక అంతర్జాతీయ పంపిణీదారుడు దొరుకుతారని ఆశించారు.[1]

గమనికలు[మార్చు]

  1. సేన్ గుప్తా, సోమిని, ‘‘బేరింగ్ స్టడీ విట్నెస్ టు పార్టిషన్ ఊండ్స్‘‘ కళా విభాగంలో ఓ రచన, ది న్యూయార్క్ టైమ్స్ , సెప్టెంబర్ 21 , 2006 , పుటలు E1 ,E7 .

మూలాలు[మార్చు]

  1. {0/}సేన్ గుప్తా, సోమిని, ‘‘బేరింగ్ స్టడీ విట్ నెస్ టు పార్టిషన్ ఊండ్స్‘‘ కళా విభాగంలో ఓ రచన, {1}ది న్యూయార్క్ టైమ్స్{/1}, సెప్టెంబర్ 21 , 2006 , పుటలు E1 ,E7 .
  2. లాన్స్ త్రూంగ్,‘‘క్యారెక్టర్ డెవలప్ మెంట్‘‘ సెయింట్ పాల్స్ కాలేజీ రచనల్లో ఓ భాగం, సెప్టెంబర్ 16, 2006